ప్రత్యేక కోర్టుకు నివేదించిన హెటిరో న్యాయవాది
హైదరాబాద్: వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ జనని ఇన్‌ఫ్రాలో లాభాల కోసమే రూ.15 కోట్లు పెట్టుబడులు పెట్టామని హెటిరో డ్రగ్స్ తరఫు న్యాయవాది వి.పట్టాభి సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. అలాగే జగతి పబ్లికేషన్స్‌లో రూ.4 కోట్లు పెట్టుబడి పెట్టామని వివరించారు. ఈ కేసులో తమను అక్రమంగా ఇరికించారని, తమ పేర్లను తొల గించాలని కోరుతూ హెటిరో సంస్థ, ఆ సంస్థ డెరైక్టర్ శ్రీనివాసరెడ్డిలు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి శుక్రవారం మరోసారి విచారించారు.
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డిని జగన్ ప్రభావితం చేసి ఆయన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించారని సీబీఐ ఆరోపిస్తోందని, కేవలం జగన్‌ను ఇరికించేందుకే సీబీఐ ఈ రకమైన ఆరోపణ చేస్తోందని పిటిషన్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. రాజశేఖరరెడ్డి సహాయకుడు సూరీడు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్న వారందరిపై కేసులు ఎం దుకు పెట్టలేదని ప్రశ్నించారు. హెటిరో డ్రగ్స్‌పై మాత్రమే కేసులు పెట్టడం సరికాదన్నారు. ఈ కేసు నుంచి తమ పేర్లను తొల గించాలని కోరుతూ అరబిందో, ట్రైడెంట్ డ్రగ్స్ సంస్థలు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణను న్యాయమూర్తి ఈనెల 27కు వాయిదా వేశారు.
లాభాల కోసమే పెట్టుబడులు పెట్టాం
Published Sat, Oct 25 2014 2:24 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement