జిల్లాలో అటవీశాఖ భూములను గుర్తించాలని ఆ శాఖ అధికారులను కలెక్టర్ అహ్మద్ బాబు ఆదేశించారు.
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో అటవీశాఖ భూములను గుర్తించాలని ఆ శాఖ అధికారులను కలెక్టర్ అహ్మద్ బాబు ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ, వివిధ శాఖల అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అటవీ భూముల్లో ఎక్కడెక్కడ రోడ్లకు అనుమతి ఇచ్చారో తెలపాలని ఆ శాఖ అధికారులను అడిగారు.
రెవెన్యూ అధికారులు సంబంధిత డీఎఫ్‌వోలకు అటవీ భూములకు సంబంధించిన నివేదిక అందజేసినా అటవీశాఖ అధికారులు భూములు గుర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జిల్లాలోని డీఎఫ్‌వోలు ఫారెస్ట్ క్లియరెన్స్ నివేదికలు తమకు వారంలోగా ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. రోడ్డు పనులు ఎక్కడెక్కడ చేపడుతున్నారు?, పనులు ఎంత వరకు పూర్తయ్యాయని ఆర్ అండ్ బీ ఎస్‌ఈ ఉమామహేశ్వర్‌రావును అడిగి తెలుసుకున్నారు. రోడ్ల నిర్మాణానికి అటవీ శాఖ అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు. జేసీ సుజాతశర్మ, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, నిర్మల్, మంచిర్యాల ఆర్డీవోలు అరుణశ్రీ, చక్రధర్, డీఎంహెచ్‌వో స్వామి, అధికారులు పాల్గొన్నారు.