
వైఎస్ జగన్‌కు పుష్పగుచ్చం అందజేస్తున్న మాజీ డీజీపీ
సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఏపీ మాజీ డీజీపీ ఎన్.సాంబశివరావు కలిశారు. జననేత వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర విశాఖ జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. శనివారం అచ్యుతాపురం సమీపంలోని ధారభోగాపురం వద్ద పాదయాత్ర శిబిరానికి వచ్చిన మాజీ డీజీపీ, వైఎస్ జగన్‌ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఇరువురు సుమారు 15 నిమిషాలు చర్చించుకున్నారు.
ముగిసిన పాదయాత్ర..
వైఎస్ జగన్ 245వ రోజు పాదయాత్ర ధారభోగాపురంలో ముగిసింది. ఆయన పాదయాత్ర కొత్తపాలెం క్రాస్ రోడ్డు, నారాయణపురం, మమిడివాడ, గోకివాడ, పంచదార్ల, అప్పారాయుడిపాలెం మీదుగా ధారభోగాపురం వరకు సాగింది. ఇవాళ 9 కిలోమీటర్ల మేర నడిచిన వైఎస్ జగన్ ఇప్పటి వరకు మొత్తం 2810.6 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తిచేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment