వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : కాంగ్రెస్‌లో కింగ్‌మేకర్‌గా వెలుగొందిన స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే పరిపాటి ఉమారెడ్డి (84) ఇక లేరు. హైదరాబాద్ దోమలగూడలోని స్వగృహంలో ఆయన అనారోగ్యంతో శనివారం తుదిశ్వాస విడిచారు. జిల్లాలోని సీనియర్, జూనియర్ నేతలెందరికో రాజకీయ గురువుగా పేరొందారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట సమీపంలోని కందుగులలో 1929 నవంబర్ 12వ తేదీన జన్మించిన ఉమారెడ్డికి ఇద్దరు కుమారులు రాంగోపా ల్, పవన్ ఉన్నారు. విద్యాభ్యాసం నుంచి రాజకీయ జీవితమంతా వరంగల్ జిల్లాలోనే కొనసాగింది. విద్యార్థి దశలోనే తెలంగాణ విమోచనం కోసం మిలి టెంట్ పోరాటాలు చేశారు.
1962లో సోషలిస్ట్ పార్టీలో చేరి వరంగల్ నుంచి, 1967లో కాంగ్రెస్ అభ్యర్థిగా వర్ధన్నపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వరంగల్ మునిసిపల్ చైర్మన్‌గా 1959 నుంచి కొద్ది కాలం, 1967 నుంచి 1972 మధ్య కాలంలో రెండు పర్యాయాలు పనిచేశారు. 1972లో వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985 నుంచి ఇప్పటి వరకు హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 1994లో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా, హౌసింగ్‌బోర్డు చైర్మన్‌గా కూడా పనిచేశారు.
ఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలు..
మాజీ ముఖ్యమంత్రులు నీలం సంజీవరెడ్డి, కోట్ల విజ యభాస్కర్‌రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, సోషలిస్టు పార్టీ నేత జయప్రకాష్‌నారాయణతో ఉమారెడ్డికి సన్నిహిత సంబంధాలుండేవి. జిల్లా ప్రత్యక్ష రాజకీయాల కు దూరంగా ఉన్నా హైదరాబాద్ నుంచే ఆయన పా వులు కదిపేవారని పేరుంది. మరో సీనియర్ నేత రామసహాయం సురేందర్‌రెడ్డికి వ్యతిరేకంగా కొంతకా లం గ్రూపు రాజకీయాలు నడిపారు. సురేందర్‌రెడ్డిని కాదని ఓసారి కల్పనాదేవికి ఎంపీ టికెట్ ఇప్పించారు. ప్రస్తుత మంత్రి సారయ్య రాజకీయ ఎదుగుదలకు ఉమారెడ్డి ఆశీసులున్నట్లు ప్రచారం ఉంది.
జిల్లా కాంగ్రెస్ నాయకుల నివాళి..
జిల్లా మంత్రులు బస్వరాజు సారయ్య, పొన్నాల లక్ష్మ య్య, చీఫ్ విప్ గండ్ర, నాయకులు ఘంటా నరేందర్‌రెడ్డి, డాక్టర్ హరిరమాదేవి, బొచ్చు సమ్మయ్య తదితరులు హైదరాబాద్‌లో ఉమారెడ్డి ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. హన్మకొండ డీసీసీ కార్యాల యంలో మంత్రి సారయ్య పాటు తాడిశెట్టి విద్యాసాగర్, బం డా ప్రకాష్ నివాళులర్పించారు. ఉమారెడ్డి మృతికి వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు టి.రమేష్‌బాబు, తూర్పు నియోజకవర్గ కోఆర్డినేటర్ తక్కెళ్లపల్లి రాము, తక్కెళ్లపల్లి అశోక్‌రావు, ఏసీరెడ్డి ఈశ్వరయ్య సంతాపం తెలిపారు. ఉమారెడ్డి అంత్యక్రియలు సోమవారం సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.