ఆర్థిక ఇబ్బందులు తాళలేక కుటుంబం ఆత్మహత్య | four of family commit suicide | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులు తాళలేక కుటుంబం ఆత్మహత్య

Published Sun, Mar 30 2014 12:49 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

ఆర్థిక ఇబ్బందులు తాళలేక కుటుంబం ఆత్మహత్య - Sakshi

ఆర్థిక ఇబ్బందులు తాళలేక కుటుంబం ఆత్మహత్య

విజయవాడ, న్యూస్‌లైన్ : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇద్దరు పిల్లలుసహా యువదంపతులు సైనేడ్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన శనివారం విజయవాడలో చోటుచేసుకుంది. గులాబీతోట నేతాజీ వీధికి చెందిన పిన్నింటి రాము (29) చుట్టుగుంట అల్లూరి సీతారామరాజు, ఆరేళ్ల కిందట అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన భాగ్యలక్ష్మి(25)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు యశ్వంత్(5), కుమార్తె రోషిణి(3) ఉన్నారు. స్థానికంగా బంగారు నగలు కుదువపెట్టుకుని రాము వడ్డీలకు ఇస్తుం టాడు. పలువురి వద్ద నగలు తీసుకుని వారడిగిన దానికంటే అధిక సొమ్ము పొందేందుకు పాతబస్తీలో కుదువపెట్టేవాడు.

 

ఆ విధంగా తీసుకున్న మొత్తాన్ని వ్యాపారంలో వెచ్చించినట్టు చెబుతున్నారు. వ్యాపా రం ఆశించిన విధంగా సాగకపోవడంతో భార్య వాటా ధనం ఇవ్వాలంటూ కొంతకాలంగా అత్తింటివారిపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. దానికి వారు నిరాకరించడం.. నగలు కుదువపెట్టిన వారు విడిపించుకుంటామని ఒత్తిడి తీసుకురావడంతో మనస్తాపానికి లోనైన రాముభార్య, ఇద్దరు పిల్లలు సహా శనివారం నగల తయారీలో వినియోగించే సైనేడ్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement