సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : పెళ్లికి కులం అడ్డుగోడగా నిల వడంతో రెండు నిండు ప్రాణాల్లో కలిసి పోయాయి. కలిసి బతకడానికి పెద్దలు అ భ్యంతరం చెప్పడంతో జీర్ణించుకోలేకపోయారు. జీవితాంతం ఒక్కటి కాలేకపోయినా.. చావులోనైనా ఒక్కటి కావాలని తలచారు. నిండు నూరేళ్లు బతకాల్సిన ఆ జంట అర్ధంతరంగా తనువు చాలించిం ది.
కులాంతర వివాహం చేసుకోవడానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో చిత్తూరు జిల్లా సత్యవేడుకు చెందిన ఓ స్నేహితులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం సూళ్లూరుపేట మండలం కోటపోలూరు రైల్వేగేట్ సమీపంలో చోటు చేసుకుంది. సత్యవేడు మండలం వెంకటరాజుల కండ్రిగకు చెందిన దొమ్మరాజు మోహన్‌కృష్ణ (20), సత్యవేడుకు చెందిన జక్కల చాతుర్య (18) దాసు జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఇరువురు తల్లిదండ్రులకు ఒప్పించి ఒక్కటవ్వాలని అనుకున్నారు. అయితే వీరి పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. వీడిపోవడానికి ఇష్టపడని వా రిద్దరూ చనిపోవడానికి నిర్ణయించుకున్నారు.
గురువారం సాయంత్రం 6 గం టలకు బైక్‌పై ఇద్దరూ సూళ్లూరుపేటకు వచ్చారు. రాత్రంతా కోటపోలూరు సమీపంలోనే గడిపి శుక్రవారం ఉదయం రైలుకింద పడి ఆత్యహత్య చేసుకున్నారు. గురువారం సాయంత్రం నుంచి చాతుర్య కనిపించకపోవడంతో తల్లిదండ్రులు సత్యవేడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం టీవీల్లో వచ్చిన స్క్రోలింగ్‌లు చూసి పోలీసులకు అనుమానం వచ్చి ఆరా తీయడంతో వీరి ఆచూకీ తెలిసింది.
సత్యవేడు పోలీసులు మృతుల తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వచ్చి గుర్తుపట్టారు. మృతదేహా లను శనివారం పోస్టుమార్టం నిర్వహించి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామని గూడూరు రైల్వే ఎస్సై వరప్రసాద్ తెలి పారు. తొలుత వీరిద్దరిని గుర్తుతెలియని వారుగా పరిగణించి మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
స్నేహితుల ఆత్మహత్య
Published Sat, Dec 21 2013 3:54 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement