junnior college
-
హాల్‌టికెట్ల హైడ్రామా
నెల్లూరు(విద్య) : నెల్లూరు రూరల్ మండలం సౌత్‌మోపూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రం వద్ద బుధవారం హైడ్రామా నడిచింది. ఎనిమిది మంది విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకపోవడంతో వారు కళాశాల భవనంపైకి ఎక్కి నినాదాలు చేశారు. పరీక్ష జరుగుతున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళితే.. కళాశాల ప్రిన్సిపల్‌గా మాల్యాద్రిచౌదరి పనిచేస్తున్నారు. వాసవి, సాయికుమార్ అనే సీనియర్ ఇంటర్ విద్యార్థులు చంద్రశేఖర్, రాజేంద్రబాబు, వెంకటేష్, అభిలాష్, అజయ్‌కుమార్, రాజేంద్రలు అనే జూనియర్ ఇంటర్ విద్యార్థులకు హాజరుతగ్గడంతో బోర్డు నిబంధనలను అనుసరించి హాల్‌టికెట్లు ఇచ్చేది లేదని ప్రిన్సిపల్ తేల్చిచెప్పేశారు. వారిలో బైపీసీ జూనియర్ ఇంటర్ విద్యార్థులు ఐదుగురు, ఎంపీసీ ఒకరు, సీనియర్ ఇంటర్లో ఎంపీసీ ఒకరు, బైపీసీ ఒకరు ఉన్నారు. ఆర్ట్స్ విద్యార్థులకు అటెండెన్స్ సరిపోకపోతే కాండోనేషన్ ఫీజు కట్టించుకొని పరీక్షలు రాయించవచ్చుననేది బోర్డు నిబంధన. సైన్స్ విద్యార్థులు ఖచ్చితంగా అటెండెన్స్ ఉండి తీరాల్సిందే. 60 నుంచి 70 శాతం అటెండెన్స్ ఉన్న విద్యార్థులకు ఈ అవకాశం ఉంటుంది. అయితే ఈ కళాశాల విద్యార్థులకు 40 నుంచి 60 శాతం ఉండటంతో ప్రిన్సిపల్ వీరికి హాల్‌టికెట్లు ఇవ్వకపోవడంతో వారు ఈ విద్యాసంవత్సరాన్ని నష్టపోవాల్సి వచ్చింది. ఎంతమంది సర్దిచెప్పినా ప్రిన్సిపల్ ససేమిరా అనడంతో విద్యార్థులు ఏమీ చేయలేకపోయారు. కళాశాల భవనంపై చేరి నినాదాలు చేశారు. సెల్ఫ్ సెంటర్‌పై వివాదాలు... సౌత్‌మోపూరు కళాశాల సెల్ఫ్సెంటర్. అక్కడ చదివే విద్యార్థులు అక్కడే పరీక్షలు రాస్తారు. సుమారు 212 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఏడాది పొడవునా విద్యార్థుల అటెండెన్స్ విషయం పట్టించుకోవాల్సిన ప్రిన్సిపల్ ఆ విషయాన్ని పరీక్షలప్పుడే పట్టుబట్టడంపై పలు వివాదాలకు తావిస్తోంది. వారి తల్లిదండ్రులకు ఫోన్ చేశామని ప్రిన్సిపల్ వాదిస్తున్నారు. ప్రిన్సిపల్ విద్యాసంవత్సరం మొత్తం మీద వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని స్థానికుల వాదన. అయితే విద్యార్థుల వద్ద నుంచి తెల్లకాగితాలపై సంతకాలు తీసుకొని వాటినే షోకాజ్ నోటీసులుగా చూపుతూ ప్రిన్సిపల్ వాదనకు దిగడం విడ్డూరమని గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న డీవీఈఓ బాబు జాకబ్ కళాశాలను సందర్శించారు. పూర్వాపరాలను ఆరా తీశారు. డీవీఈఓ చెప్పినా ప్రిన్సిపల్ ఒప్పుకోకపోవడంతో ఆయన కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అప్పటికే పరీక్షా సమయం కాస్త అయిపోయింది. ఇక చేసేదిలేక ప్రిన్సిపల్‌ను కలెక్టర్‌కు వ్యక్తిగతంగా సంజాయిషీ ఇవ్వమన్నారు. కనీసం గురువారం జరిగే సెకండియర్ పరీక్షను రాసే ఇద్దరికన్నా అవకాశం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. అందరూ పేద విద్యార్థులే.. కళాశాలలో చదివే విద్యార్థుల ఆర్థిక నేపథ్యం అంతంతమాత్రమేనని సమాచారం. పుస్తకాలు, ఫీజులు కట్టాలంటే ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులు కూలి పనులకు వెళ్లి వచ్చిన సంపాదనతో ఫీజులు కడతారనేది స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమం లో అనేక మంది దాతలు కళాశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషిచేస్తున్నారు. విద్యాసంవత్సరం అంతటిలో ఇంత పట్టుపట్టి ఉంటే వారు కళాశాలకు వచ్చి ఉండేవారని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. నా గొంతులో ప్రాణం ఉండగా మీరు ఎలా పరీక్ష రాస్తారో చూస్తానంటూ జీఓను సాకుగా చూపడం పలువురు విస్మయానికి గురిచేసింది. అధికారు లు స్పందించి ఆ విద్యార్థులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
ఉత్సాహ భరితం.. ఉత్తేజ పూరితం
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో కళా, సాహిత్య, సాంస్కృతిక సృజనను వెలికితీస్తూ రెండు రోజుల పాటు నిర్వహించిన ‘చే’ యువ తరంగాలు శుక్రవారం ముగిశాయి. గుంటూరు వేదికగా ఈనెల 18వ తేదీ నుంచి జరగనున్న భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని, నగరంలోని సాంబశివపేట ప్రభుత్వ వృత్తివిద్య బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముగింపు కార్యక్రమంలో కార్యక్రమ నిర్వహణ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యార్థులు మార్కులు, ర్యాంకులకే పరిమితం కాకుండా సృజనకు పదునుపెట్టి సమాజాన్ని మేలుకొల్పాలని సూచించారు. మాస్టర్‌మైండ్స్ డెరైక్టర్ మట్టుపల్లి మోహన్ మాట్లాడుతూ పాశ్చాత్య ధోరణికి అలవాటు పడిన యువతరాన్ని సంస్కృతి, సంప్రదాయాలవైపు మరల్చే విధంగా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ కోయి సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులు, విద్యారంగ పరిరక్షణ కోసం ఎస్ఎఫ్ఐ వినూత్న కార్యక్రమాలతో ముందుకెళ్తోందని ప్రశంసించారు. న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన కావూరి సత్యనారాయణ, డాక్టర్ అబ్ధుల్ రజాక్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నూర్ మహ్మద్, ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాల ఎన్సీసీ అధికారి మద్ధినేని సుధాకర్, కార్యక్రమాల నిర్వహణ సమన్వయకర్త డాక్టర్ ఎం.బోసుబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వి.భగవాన్‌దాస్, జగదీష్, ప్రసన్న, రవి, ఝాన్సీ, శ్రీవిద్య, నాగరాజు, క్రాంతి, ప్రజా నాట్యమండలి జిల్లా కార్యదర్శి పి.వి.రమణ, డి.వి.రామారావు, డ్యాన్స్ మాస్టర్ రమేష్, సుశీల, టీఆర్ రమేష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లలిత సంగీతం, బృందగానం, వక్తృత్వం, క్విజ్, మిమిక్రీ, ఏకపాత్రభినయం, లఘు నాటిక, చిత్రలేఖనం, శాస్త్రీయ నృత్యం, జానపద నృత్యం, రంగోలి విభాగాల్లో పోటీపడి ప్రథమ, ద్వితీయ, తృ తీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. -
అడ్డదారుల్లో నియామకాలు!
ఎస్కేయూ/అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్టు లెక్చరర్ల పోస్టులను అడ్డదారుల్లో భర్తీ చేశారు. రోస్టర్‌కు విరుద్ధంగా అడ్డగోలుగా నియామకాలు చేపట్టారు. ఇంటర్ విద్య రీజనల్ జాయింట్ డెరైక్టర్ (ఆర్జేడీ-కడప)ను సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరగా.. ఈ అక్రమాలు వెలుగు చూశాయి. 2010 ఆగస్టు 13కు ముందు భర్తీ చేసిన 972 కాంట్రాక్ట్ లెక్చరర్ పోస్టులను 2013-14 విద్యా సంవత్సరంలో రోస్టర్ ప్రకారం రెన్యూవల్ చేయలేదని ఆర్జేడీ అధికారులు రాతపూర్వకంగా ఇచ్చారు. రాయలసీమ జోన్ పరిధిలో మొత్తం 1,369 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారు. వీరిలో 972 మందిని 2010 ఆగస్టు 13వ తేదీకి ముందు విధుల్లోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రతియేటా రెన్యూవల్ చేస్తున్నారు. అలాగే 397 మందిని 2010 ఆగస్టు 13 తర్వాత తీసుకున్నారు. మొదటి దఫా ఉద్యోగాల భర్తీలో రోస్టర్ పాటించలేదు. 2013-14 విద్యా సంవత్సరంలో రోస్టర్‌ను అనుసరించి రెన్యూవల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే.. ఈ ఆదేశాలను పట్టించుకోకుండా స్థానిక ప్రిన్సిపాళ్ల సిఫార్సులకు పెద్దపీట వేశారనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తెలిసింది. రోస్టర్ పాటించని కారణంగా బడుగు, బలహీన వర్గాల అభ్యర్థులే ఎక్కువగా నష్టపోయారు. రోస్టర్ పాటించకుండా.. అర్హులందరికీ సమాన అవకాశాలు ఇవ్వకుండా జరిపిన నియామకాలు 15 ఏళ్ల సర్వీసు ఉన్నా రద్దు చేయాలని ‘ఉమాదేవి వర్సెస్ కర్ణాటక స్టేట్’ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని మన అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదు. న్యాయ పోరాటాలకు సిద్ధం కాంట్రాక్టు లెక్చరర్ల నియామకాల్లో జరిగిన అక్రమాలపై త్వరలో న్యాయపోరాటాలకు దిగుతామని ఎస్కేయూలోని నిరుద్యోగ పోరాట సమితి స్పష్టం చేసింది. నిబంధనలు పాటించాల్సిన అధికారులే ఇలా అడ్డగోలుగా నియామకాలు ఎలా చేస్తారని ప్రశ్నించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిరుద్యోగులకు జరిగిన అన్యాయంపై పోరాడతామని సమితి సభ్యుడు రవిప్రకాష్ తెలిపారు. వేలాది మంది పీజీ, పీహెచ్‌డీలు పూర్తి చేసుకుని జూనియర్ లెక్చరర్ల (జేఎల్) నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ అక్రమ నియామకాలు రద్దు చేస్తే మూడు వేల పోస్టులతో రెగ్యులర్ నోటిఫికేషన్‌కు మార్గం సుగమం అవుతుందన్నారు. -
ఫ్లెమింగో ఫెస్టివల్
నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : పక్షుల పండగను ప్రతిష్టాత్మంగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీకాంత్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ బంగ్లాలో గురువారం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఫ్లెమింగో ఫెస్టివల్‌ను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో పక్షుల పండగ నిర్వహించనున్నామని, దీనికి అవసరమైన ఏర్పాటు చేయాలన్నారు. సూళ్లూరుపేట జూనియర్ కళాశాలలో ఈ పండగను నిర్వహించనున్నట్లు తెలిపారు. నేలపట్టు, భీములవారిపాళెం, రోడ్డు మరమ్మతు పనులు పూర్తి చేయాలన్నారు. కళాశాల మైదానంలో స్టేజీ, తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. వివిధ శాఖల ద్వారా ప్రదర్శనలను నిర్వహించాలని సూచించారు. ప్రదర్శనలో ఒంగోలు జాతి ఎద్దులు, డాగ్ షో, సంకరజాతి పశువులను సిద్ధం చేయాలన్నారు. గామీణక్రీడలు, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ వంటి క్రీడలను నిర్వహించాలన్నారు. ఫెస్టివల్‌ను సందర్శించేందుకు వచ్చే విద్యార్థులకు తగిన ఏర్పాటు చేయాలని తెలిపారు. రెండు రోజుల పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టుమైన భద్రత చేపట్టాలని సూచించారు. ఫెస్టివల్‌కు వచ్చే మంత్రులు, శాసనసభ్యులు, అధికారులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ప్రత్యేక అధికారి రవిప్రకాష్, డ్వామా పీడీ గౌతమి, డీఆర్డీఏ పీడీ వెంకటసుబ్బయ్య, ఆర్డీఓ రమణ, డీఎస్పీ చౌడేశ్వరి పాల్గొన్నారు. -
స్నేహితుల ఆత్మహత్య
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : పెళ్లికి కులం అడ్డుగోడగా నిల వడంతో రెండు నిండు ప్రాణాల్లో కలిసి పోయాయి. కలిసి బతకడానికి పెద్దలు అ భ్యంతరం చెప్పడంతో జీర్ణించుకోలేకపోయారు. జీవితాంతం ఒక్కటి కాలేకపోయినా.. చావులోనైనా ఒక్కటి కావాలని తలచారు. నిండు నూరేళ్లు బతకాల్సిన ఆ జంట అర్ధంతరంగా తనువు చాలించిం ది. కులాంతర వివాహం చేసుకోవడానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో చిత్తూరు జిల్లా సత్యవేడుకు చెందిన ఓ స్నేహితులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం సూళ్లూరుపేట మండలం కోటపోలూరు రైల్వేగేట్ సమీపంలో చోటు చేసుకుంది. సత్యవేడు మండలం వెంకటరాజుల కండ్రిగకు చెందిన దొమ్మరాజు మోహన్‌కృష్ణ (20), సత్యవేడుకు చెందిన జక్కల చాతుర్య (18) దాసు జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఇరువురు తల్లిదండ్రులకు ఒప్పించి ఒక్కటవ్వాలని అనుకున్నారు. అయితే వీరి పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. వీడిపోవడానికి ఇష్టపడని వా రిద్దరూ చనిపోవడానికి నిర్ణయించుకున్నారు. గురువారం సాయంత్రం 6 గం టలకు బైక్‌పై ఇద్దరూ సూళ్లూరుపేటకు వచ్చారు. రాత్రంతా కోటపోలూరు సమీపంలోనే గడిపి శుక్రవారం ఉదయం రైలుకింద పడి ఆత్యహత్య చేసుకున్నారు. గురువారం సాయంత్రం నుంచి చాతుర్య కనిపించకపోవడంతో తల్లిదండ్రులు సత్యవేడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం టీవీల్లో వచ్చిన స్క్రోలింగ్‌లు చూసి పోలీసులకు అనుమానం వచ్చి ఆరా తీయడంతో వీరి ఆచూకీ తెలిసింది. సత్యవేడు పోలీసులు మృతుల తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వచ్చి గుర్తుపట్టారు. మృతదేహా లను శనివారం పోస్టుమార్టం నిర్వహించి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామని గూడూరు రైల్వే ఎస్సై వరప్రసాద్ తెలి పారు. తొలుత వీరిద్దరిని గుర్తుతెలియని వారుగా పరిగణించి మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.