నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : పక్షుల పండగను ప్రతిష్టాత్మంగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీకాంత్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ బంగ్లాలో గురువారం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఫ్లెమింగో ఫెస్టివల్‌ను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో పక్షుల పండగ
నిర్వహించనున్నామని, దీనికి అవసరమైన ఏర్పాటు చేయాలన్నారు. సూళ్లూరుపేట జూనియర్ కళాశాలలో ఈ పండగను నిర్వహించనున్నట్లు తెలిపారు. నేలపట్టు, భీములవారిపాళెం, రోడ్డు మరమ్మతు పనులు పూర్తి చేయాలన్నారు. కళాశాల మైదానంలో స్టేజీ, తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. వివిధ శాఖల ద్వారా ప్రదర్శనలను నిర్వహించాలని సూచించారు. ప్రదర్శనలో ఒంగోలు జాతి ఎద్దులు, డాగ్ షో, సంకరజాతి పశువులను సిద్ధం చేయాలన్నారు.
గామీణక్రీడలు, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ వంటి క్రీడలను నిర్వహించాలన్నారు. ఫెస్టివల్‌ను సందర్శించేందుకు వచ్చే విద్యార్థులకు తగిన ఏర్పాటు చేయాలని తెలిపారు. రెండు రోజుల పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టుమైన భద్రత చేపట్టాలని సూచించారు. ఫెస్టివల్‌కు వచ్చే మంత్రులు, శాసనసభ్యులు, అధికారులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ప్రత్యేక అధికారి రవిప్రకాష్, డ్వామా పీడీ గౌతమి, డీఆర్‌డీఏ పీడీ వెంకటసుబ్బయ్య, ఆర్డీఓ రమణ, డీఎస్పీ చౌడేశ్వరి పాల్గొన్నారు.
ఫ్లెమింగో ఫెస్టివల్
Published Fri, Jan 3 2014 3:13 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement