డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీవో) అధ్యక్ష పదవి ఎంపిక ప్రక్రియ జోరందుకుంది.
సాక్షి, హైదరాబాద్: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీవో) అధ్యక్ష పదవి ఎంపిక ప్రక్రియ జోరందుకుంది. ఈ స్థానానికి రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్‌సీఐ) డెరైక్టర్ జి.సతీశ్‌రెడ్డితోపాటు మరో 4 పేర్లు పరిశీలనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ అవినాశ్ చందర్ (64)ను ఆ స్థానం నుంచి తప్పిస్తున్నట్లు రక్షణ మంత్రి ఇప్పటికే ప్రకటించారు.
యూపీఏ హయాంలో అవినాశ్ చందర్ డీఆర్‌డీవో అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. గత ఏడాది నవంబర్‌లో పదవీ విరమణ వయసుకు చేరుకున్నప్పటికీ మరో 18 నెలలు అదే పదవిలో కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతారని కొత్తగా ఎన్నికైన ఎన్డీఏ ప్రభుత్వం అదే నెలలో ఆదేశాలిచ్చింది. కానీ ఈ ఒప్పందం గడువు 16 నెలలుండగానే దాన్ని రద్దు చేసింది.