
గాంధీజీ కూడా జైల్లో దీక్ష చేశారు: అంబటి రాంబాబు
జైల్లో ఉండి కూడా ప్రజల కోసం పోరాడే చిత్తశుద్ధి ఒక్క వైఎస్ జగన్ మోహన రెడ్డికే ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. జైల్లో ఉన్నంత మాత్రాన నిరాహార దీక్ష చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. జగన్ దీక్ష చేయడానికి కేసీఆర్, హరీష్‌రావు, గుత్తా సుఖేందర్‌రెడ్డిల అనుమతి అవసరంలేదని అంబటి రాంబాబు మండిపడ్డారు. మహాత్మాగాంధీ కూడా తాను జైల్లో ఉన్న కాలంలో ఐదుసార్లు నిరాహార దీక్ష చేశారని గుర్తుచేశారు.
కాగా, రాష్ట్ర విభజనకు అనుకూలంగా సీడబ్ల్యుసీ తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రే వ్యతిరేకిస్తున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టాలనుకున్న బస్సు యాత్ర కాస్తా తుస్సుయాత్ర అయ్యిందని అంబటి రాంబాబు విమర్శించారు.