పోలీసులనూ బెదిరించారు | Gang accused new angle | Sakshi
Sakshi News home page

పోలీసులనూ బెదిరించారు

Published Mon, Aug 25 2014 1:33 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Gang accused new angle

గ్యాంగ్‌రేప్ నిందితుల కొత్త కోణం
 
హైదరాబాద్: పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఫామ్ హౌస్‌లో యువతిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన నిందితులు పోలీసులనూ బెది రించేవారని తాజాగా వెలుగులోకి వచ్చింది. త2003లో ఓ కేసు విషయంలో విచారణ కోసం ఇంటికి వెళ్లిన చాంద్రాయణగుట్ట ఎస్‌ఐ రామారావుపై మాజీ రౌడీషీటర్ అలీ బారక్ బా (60) తనను వేధిస్తున్నాడంటూ హైకోర్టులో పిటిషన్ వేశాడు. చివరకు బారక్‌బా వేధింపులు తట్టుకోలేక ఎస్‌ఐ రామారావు అతనితోనే రాజీకి వచ్చినట్లు తెలిసింది.  పాములతో బెదిరించి యువతిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఉదంతంలో ఫైసల్ దయానీ (26), ఖాదర్ బారక్‌బా (25), తయ్యబ్ బాసలామా (20), మహ్మద్ పర్వేజ్ (25), అన్వర్ (19), ఖాజా అహ్మద్(26), మహ్మద్ ఇబ్రహీం (19), అలీ బారక్‌బా (60), సాలం అహ్మదీ (25)లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అలీ బారక్ బా, ఖాదర్ బారక్ బాలు తండ్రీకొడుకులు కావడం గమనార్హం.

గతంలో అలీ బారక్ బా పోలీసుపై వేసిన కేసుల మాదిరిగానే, తాజా ఉదంతంలో పోలీసులు నిందితులను పట్టుకునేందుకు వారి ఇళ్లకు వెళ్లగా పహాడీషరీఫ్ పోలీసులపై కూడా హైకోర్టులో అలీ బార్‌బా పిటిషన్ వేశాడు. అయితే, అతని నైజం గురించి.. గతంలో వేసిన పిటిషన్ల గురించి కోర్టు దృష్టికి తీసుకుపోవడంతో పోలీసులకు పరువు దక్కినట్లయింది. ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తూ పిటిషన్లు వేసి వేధించడం వల్లనే అతని జోలికి వెళ్లేందుకు పోలీసులు వెనుకంజ వేయడం, ఫలితంగా వారి ఆగడాలు పెరిగాయి. ఫైసల్ దయానీ బాధితులు తమకు ఫిర్యాదు చేయాలనిపోలీసులు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement