pahadisariph
-
ప్రపంచ శాంతిని ఆకాంక్షించండి
సాక్షి, హైదరాబాద్: ‘ఇస్లాం శాంతి మార్గా న్ని ప్రబోధిస్తోంది.. సర్వ మానవాళి శ్రేయస్సు, ప్రపంచ శాంతి ఆకాంక్షిస్తూ అపకారం తలపెట్టిన వారికి కూడా ఉపకారం చేసి దేవుడి (అల్లా) కృపకు పాత్రులు కావాలని’ ఇస్లామిక్ పండితులు ఉద్బోధించారు. ఆదివారం హైదరాబాద్ నగర శివారులోని పహాడీ షరీఫ్‌లో జరుగుతున్న ఇస్లామిక్ సమ్మేళనం(ఇజ్తేమా)లో ఉదయం ప్రార్థనల అనంతరం న్యూ ఢిల్లీకి చెందిన మౌలానా ముర్సాలియిన్, లక్నోకు చెందిన మౌలానా షౌకత్, బెంగుళూరుకు చెందిన మౌలానా ఖాసీం ఖురేషీ, మౌలానా అస్లాంలు సుదీ ర్ఘంగా ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. రెం డో రోజు సుమారు మూడున్నర లక్షల మంది హజరయ్యారు. స్కాలర్లు ప్రసంగిస్తూ పుట్టిన ప్రతి జీవీ గిట్టక తప్పదని, మానవ జన్మకు కూడా మరణం తప్పదన్నారు. మానవ జీవితాన్ని ప్రసాదించిన సృష్టికర్త ఒక్కొక్కరికీ ఒక్కోలా పరిస్థితులు సృష్టించి సహనాన్ని పరీక్షిస్తాడన్నారు. మహ్మద్ ప్రవక్త చూపిన సన్మార్గంలో పయనిస్తూ, మంచిని ప్రబోధిస్తూ చెడును దూరం చేయాలన్నారు. కర్తవ్యాన్ని మరచి అరాచకం, దౌర్జన్యం మార్గంలో ప్రయాణిస్తే దేవుడి కృప కోల్పోవడం ఖాయమన్నారు. అసౌకర్యాలు... ఇజ్తేమాలో అసౌకర్యాలతో ముస్లింలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలిసారిగా జరుగుతున్న ప్రపంచ స్థాయి ఇజ్తేమాకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తామని ప్రకటించి.. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీకి బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం.. ఏర్పాట్లలో విఫలమైంది. ఇజ్తేమాకు సుమారు ఐదు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని ముందస్తుగానే అంచనా వేసినప్పటికీ పూర్తి స్థాయిలో షామియానాలను ఏర్పాటు చేయలేదు. దీంతో నలుమూలల నుంచి వచ్చిన వారు ఆధ్యాత్మిక ప్రసంగాలు వినేందుకు, ఐదు పూటలు ప్రార్థనలు చేసేందుకు షామియానాలు సరిపోక ఇబ్బందులకు గురయ్యారు. దుమ్ముధూళితో వృద్ధులు తీవ్ర అవస్థలు పడ్డారు. భోజనశాలలు కూడా సరిపడినన్ని ఏర్పాటు చేయకపోవడంతో చాంతాడు క్యూలు తప్పలేదు. మరోవైపు పహాడీ షరీఫ్ రోడ్డు మార్గం దుమ్ముమయంగా మారింది. నేడు ఇజ్తేమా ముగింపు పహాడీషరీఫ్‌లో రెండురోజులపాటు కొనసాగుతున్న తబ్లిక్ జమాత్ ఇస్లామిక్ ఇజ్తేమా సోమవారం ముగియనుంది. ఉదయం ఫజర్ నమాజ్ అనంతరం మౌలానా ముస్తాక్, మౌలానా ఖాసీం ఖురేషీ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తారు. సమ్మేళనం ముగింపు సందర్భంగా సుదీర్ఘంగా ప్రత్యేక దువా (అల్లాను వేడుకోలు) కార్యక్రమం నిర్వహిస్తారు. -
స్నేక్ గ్యాంగ్‌పై ఐదు కేసులు
నత్తనడకన సాగుతున్న విచారణ రాజకీయ ఒత్తిళ్లే కారణమని ఆరోపణలు ముఠా సభ్యులకు పార్టీల అండదండలు! హైదరాబాద్: అత్యాచారాలు, సెటిల్మెంట్లతో హైదరాబాద్‌ను హడలెత్తించిన స్నేక్గ్యాంక్పై పోలీసులు ఇప్పటివరకు ఐదు కేసులు నమోదు చేశారు. ఫాం హౌజ్‌లో యువతిపై సామూహిక అత్యాచార ఘట నకు సంబంధించి ప్రధాన నిందితుడు ఫైసల్ దయాని, 9వ నిందితుడు సాలం హమ్దీ(స్నేక్‌గ్యాంగ్ సభ్యులు)లను విచారించిన పహాడీషరీఫ్ పోలీసులు శనివారం వారిని రిమాండ్‌కు తరలిం చారు. ఇన్స్పెక్టర్ పి.శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకా రం.. గత నెల 31న యువతిపై జరిగిన సాముహిక అత్యాచారం ఘటనతో పాటు మరో నాలుగు కేసులలో స్నేక్‌గ్యాంగ్ సభ్యులు నిందితులు. పాములను పట్టుకున్నందుకు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద స్నేక్గ్యాంగ్పై సుమోటో కేసు నమోదు చేశారు. అలాగే, మతాంతర వివాహం చేసుకుందని ముస్లిం యువతిని బెదిరించిన ఘటనలో ఐపీసీ 295ఎ, 506, 509 సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేశారు. ఓ మహిళ ఇంటిని ఆక్రమించి బెదిరించిన ఘటన, భార్యాభర్తల గొడవలో తలదూర్చి భర్తపై తీవ్రంగా దాడిచేసిన ఘటనలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, స్నేక్‌గ్యాంగ్ బాధితులెవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. సా...గుతున్న విచారణ.. స్నేక్‌గ్యాంగ్ సభ్యులను మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకున్న పోలీసులు విచారణను నత్తనడకన సాగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. సెటిల్మెంట్లు, అత్యాచారాలు చేసి వాటిని తమ సెల్ఫోన్లో వీడియో తీసుకున్న ఈ ముఠా సభ్యులపై కొన్ని ఘటనలకు సంబంధించి మాత్రమే కేసులు నమోదు చేయడం అనుమానాలకు తావిస్తోంది. నిందితుల నుంచి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులో కేవలం నాలుగైదు వీడియోలే లభించాయని, డిలీట్ చేసిన వాటిని రికవరీ చేస్తామని చెప్పారు. కానీ, స్నేక్‌గ్యాంగ్ అకృత్యాలకు బలమైన సాక్ష్యాలుగా నిలిచే ఆ వీడియోలను ఇప్పటివరకు రికవరీ చేయలేకపోయారు. -
పోలీసులనూ బెదిరించారు
గ్యాంగ్‌రేప్ నిందితుల కొత్త కోణం హైదరాబాద్: పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఫామ్ హౌస్‌లో యువతిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన నిందితులు పోలీసులనూ బెది రించేవారని తాజాగా వెలుగులోకి వచ్చింది. త2003లో ఓ కేసు విషయంలో విచారణ కోసం ఇంటికి వెళ్లిన చాంద్రాయణగుట్ట ఎస్ఐ రామారావుపై మాజీ రౌడీషీటర్ అలీ బారక్ బా (60) తనను వేధిస్తున్నాడంటూ హైకోర్టులో పిటిషన్ వేశాడు. చివరకు బారక్‌బా వేధింపులు తట్టుకోలేక ఎస్ఐ రామారావు అతనితోనే రాజీకి వచ్చినట్లు తెలిసింది. పాములతో బెదిరించి యువతిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఉదంతంలో ఫైసల్ దయానీ (26), ఖాదర్ బారక్‌బా (25), తయ్యబ్ బాసలామా (20), మహ్మద్ పర్వేజ్ (25), అన్వర్ (19), ఖాజా అహ్మద్(26), మహ్మద్ ఇబ్రహీం (19), అలీ బారక్‌బా (60), సాలం అహ్మదీ (25)లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అలీ బారక్ బా, ఖాదర్ బారక్ బాలు తండ్రీకొడుకులు కావడం గమనార్హం. గతంలో అలీ బారక్ బా పోలీసుపై వేసిన కేసుల మాదిరిగానే, తాజా ఉదంతంలో పోలీసులు నిందితులను పట్టుకునేందుకు వారి ఇళ్లకు వెళ్లగా పహాడీషరీఫ్ పోలీసులపై కూడా హైకోర్టులో అలీ బార్బా పిటిషన్ వేశాడు. అయితే, అతని నైజం గురించి.. గతంలో వేసిన పిటిషన్ల గురించి కోర్టు దృష్టికి తీసుకుపోవడంతో పోలీసులకు పరువు దక్కినట్లయింది. ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తూ పిటిషన్లు వేసి వేధించడం వల్లనే అతని జోలికి వెళ్లేందుకు పోలీసులు వెనుకంజ వేయడం, ఫలితంగా వారి ఆగడాలు పెరిగాయి. ఫైసల్ దయానీ బాధితులు తమకు ఫిర్యాదు చేయాలనిపోలీసులు కోరుతున్నారు. -
కలకలం
నగరంలో వరుస ఘటనలు భార్య, కుమారుడి హత్య..ఉలిక్కిపడిన పహడీషరీఫ్ భార్య సీమంతం ఏర్పాట్లలో అపశ్రుతి..గాలికి పట్టుతప్పి పడి భర్త దుర్మరణం చార్మినార్‌లో డీఆర్డీఓ ఆర్డీపై బ్లేడుతో దాడి రహమత్‌నగర్‌లో కానిస్టేబుళ్లపై దౌర్జన్యం గండిపేట జలాశయంలో ఇద్దరి గల్లంతు పహడీషరీఫ్: తెలతెలవారుతూనే.. భార్య, కుమారుడిని భర్త హతమార్చాడనే వార్తతో పహడీషరీఫ్ ప్రాంతం ఉలిక్కిపడింది. హయత్‌నగర్ ప్రాంతంలో భార్య సీమంతానికి ఏర్పాట్లు చేస్తూ.. పెద్దగా వీచిన గాలికి అదుపుతప్పి పడిపోయి ఆమె భర్త దుర్మరణం పాలైన ఘటన విషాదాన్ని నింపింది. శుభకార్యం జగరాల్సిన ఆ ఇంట చావు బాజా మోగడం పలువురిని కలచివేసింది. ఆపై రహమత్‌నగర్‌లో జూబ్లీహిల్స్ కాని స్టేబుళ్లపై దాడి, చార్మినార్‌లో డీఆర్డీఓ రీజనల్ డెరైక్టర్ సత్యపతిపై బ్లేడుతో ఓ బాలుడు దాడి, గండిపేట జలాశయంలో ఇద్దరు యువకుల గల్లంతు ఘటనలు కలకలం రేపాయి. తల్లీకొడుకుల దారుణహత్య చిన్న విషయానికే గొడవపడిన ఓ వ్యక్తి కిరాతకుడయ్యాడు. కట్టుకున్న భార్యను, కన్న కుమారుడిని దారుణంగా హతమార్చాడు. అనంతరం భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటిం చాడు. పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ డి.భాస్కర్ రెడ్డి కథనం ప్రకారం... బీహార్‌కు చెందిన మినీందర్ (24)కు కర్ణాటకకు చెందిన స్వప్న (19)తో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి సూరజ్ అనే పది నెలల కుమారుడు ఉన్నాడు. వీరు జల్పల్లి శ్రీరాం కాలనీలో ఉంటున్నారు. మినీందర్ స్థానిక ప్లాస్టిక్ కంపెనీలో పని చేస్తున్నాడు. భార్యాభర్తలు శనివారం రాత్రి 8 గంటల సమయంలో గొడవ పడ్డారు. వీరి ఇంటికి ఎదురుగా ఉండే ఓ వ్యక్తి అర్ధరాత్రి 12.30ప్రాంతంలో బయటకు రాగా, మినీందర్ ఇంట్లోంచి పొగలు రావడం కనిపించింది. ఆయన వెంటనే స్థానికుల సాయంతో లోనికి వెళ్లి చూడగా స్వప్న మంటల్లో కాలి పడి ఉంది. పక్కనే ఆమె కుమారుడు సూరజ్ విగతజీవిగా కన్పించాడు. సూరజ్‌కు కాలిన గాయాలు లేవు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్వప్నకు కొద్దిపాటి కాలిన గాయాలే ఉండడాన్ని గమనించిన పోలీసులు మరింత లోతుగా పరిశీలించగా ఆమె మెడకు చీరతో ఉరేసి హత్య చేసినట్టు ఆనవాళ్లు కన్పించాయి. భార్యాభర్తల మధ్య గొడవ జరగడం.... భర్త పరారీలో ఉండడంతో భర్తే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. భార్యను చీరతో ఉరేసి హత్య చేసిన మినీందర్ నేరం తనపైకి రాకుండా ఉండేందుకు కిరోసిన్ పోసి నిప్పంటించినట్టు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని శంషాబాద్ ఏసీపీ ఆర్.సుదర్శన్, ఇన్స్పెక్టర్ డి.భాస్కర్‌రెడ్డి పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.