విశాఖపట్నం జిల్లా గొలుగొండ మండలం పాకలపాడులో శుక్రవారం పోలీసులు చేపట్టిన తనిఖీల్లోభాగంగా పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వాహనాన్ని సీజ్ చేశారు. వాటర్ ప్యాకెట్ల లోడుతో వెళ్తున్న వాహనంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
దాంతో పెద్ద మొత్తంలో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువు రూ.20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.