అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: ఓ బాలికను అపహరించేందుకు ఆటోవాలాలు చేసిన ప్రయత్నం స్థానికు లు గుర్తించడంతో విఫలమైంది. వివరాలి లా ఉన్నాయి. స్థానిక అజయ్‌ఘోష్ కాల నీలో నివసించే నాయక్, లలిత దంపతుల కూతురు కళావతి (12)తో పాటు ఓ కొడు కు ఉన్నాడు. ఆ బాలికకు సరిగా మాటలు రాకపోవడంతో వారు ఆమెను పాఠశాలకు పంపడం లేదు. శుక్రవారం ఉదయం ఆ దంపతులు కూతురిని, ఆమె తమ్ముడిని ఇంటివద్దే వదిలి కూలి పనులకు వెళ్లారు. కాగా, ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్న కళావతి నగరంలోని పెద్దమ్మ ఇంటికి వెళ్లేందుకు శుక్రవారం మధ్యాహ్నం రుద్రంపేట బైపాస్ రోడ్డు కూడలి వద్దకు వచ్చింది. అటుగా వచ్చిన ఆటోను ఎక్కిం ది.
బాలిక ఒంటరిగా ఉండడం గమనించి న ఆటో డ్రైవర్ ఆమె ను 44వ నెంబరు జాతీయ రహదారి మీదుగా అశోక్‌లేల్యాండ్ షోరూం ఎదురుగా ఉన్న లింకు రోడ్డులోకి ఆటోను మళ్లించారు. తనను ఎక్కడికో తీసుకెళుతున్నట్లు గుర్తించిన బాలిక గట్టిగా కేకలు వేసింది. అదే సమయంలో కూడలిలో వాహనాల కోసం ఎదురు చూస్తున్న స్థాని కులు స్పందించి ఆటో వెంట పడ్డారు. దీంతో దుండగులు బాలికను రోడ్డుపైకి నెట్టేసి పరారయ్యారు. సమాచార అందుకున్న రాప్తాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విషయం ఆరా తీశా రు.
దుండగులు తన చెంపపై కొట్టి, గొం తు నులిమారని బాలిక సైగలతో చూపుతున్నా.. ఏమీ జరగలేదంటూ పోలీసులు ఖండించే యత్నం చేశారు. స్థానికులు కలుగజేసుకోవడంతో పోలీసులు చిన్నారి సూచనల మేరకు ఎస్సై తమీం ఆమెతో సహా అజయ్‌ఘోష్ కాలనీకి చేరుకున్నాడు. ఇంట్లో ఉన్న తమ్ముడి సాయంతో ఆమె ఏం చెబుతుందో తెలుసుకున్నారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అటోలో తనను ముళ్లపొదల్లోకి తీసుకెళ్లారని ఆమె చెబుతోందని తమ్ముడు వివరించడంతో ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించి టూటౌన్ పోలీసు స్టేషన్‌కు బయలుదేరారు.
పోలీసుల ‘సరిహద్దు’ యుద్దం..
ఈ బాలిక నివాసముంటున్న కాలనీ టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో కాగా, బాలికను రక్షించిన స్థలం రాప్తాడు పోలీసు స్టేషన్ పరిధిలోనిది కావడంతో ఈ కేసుతో తమకు సంబంధం లేదంటూ ఆయా స్టేషన్ల పోలీసులు వాదించుకున్నట్లు తెలిసింది. సాయంత్రమైనా ఏ స్టేషన్‌లోనూ ఇందుకు సంబంధించి కేసు నమోదు కాలేదని సమాచారం.
బాలిక కిడ్నాప్‌యత్నం విఫలం
Published Sat, Jan 18 2014 2:38 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement