కళ్లముందు కూతురు బాధను చూస్తూ తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు
విశాఖపట్నం, ఎస్.రాయవరం: చేయి కదిపితే భరించలేని నొప్పి, ముద్ద తిందామంటే మోయలేని భారం. శరీర అవయవాల నొప్పులతో ప్రతి నిమిషం చిత్రహింసలు అనుభవిస్తూ బాలికను అంతుపట్టని వ్యాధి పట్టిపీడిస్తోంది. మల్లి స్నేహలత అనే 14 ఏళ్ల బాలిక శరీర అవయవాలు కదిలించలేని స్థితిలో కీళ్లనొప్పులు బాధలతో ఏడాది కాలంగా మంచానికే పరిమితమైంది. ఈ బాలికకు 8 ఏళ్లు వయస్సులో ప్రారంభమయిన ఈ జబ్బు వైద్యం చేయిస్తున్నకొద్దీ ఎక్కువ అవుతూ వస్తుంది. చేపలవేటపై బతికే కుటుంబంలో పుట్టిన బాలికకు ఇప్పటికే రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకూ ఖర్చు చేసి వైద్యం చేయించారు.
విశాఖ కేజీహెచ్‌లో కూడా 6 నెలలు వైద్యం అందించి నయంకాక అక్కడ వైద్యుల సూచనలు మేరకు ప్రయివేటు పెద్దాసుపత్రులకు తిప్పారు. కానీ జబ్బు నయం కాలేదని , బాలికను అనుక్షణం పట్టిపీడిస్తున్న కీళ్ల నొప్పులకు వైద్యం ఆరోగ్య శ్రీ కార్డులో లేదని సిబ్బంది తేల్చి చెప్పేస్తున్నారు, దీంతో ఉన్న నగదు ఖర్చు చేసి వైద్యం చేయించిన తల్లిదండ్రులు ఇకపై వైద్యం చేయించలేక నిస్సహాయ స్థితిలో ఉన్నారు. దాతలు సహకారం అందించి మెరుగైన వైద్యం అందించాలని బాలిక ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు. దాతలు బాలిక తల్లిదండ్రుల ఫోన్ : 9177294382 సంప్రదించాలని వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment