కారు అద్దం పగులగొట్టి బంగారం, నగదు చోరీ
ఏలూరు : వివాహ వేదిక వద్ద నిలిపివుం చిన కారు అద్దాన్ని పగులగొట్టి 23 కాసుల బంగారం, రూ.15 వేల నగదు అపహరించుకుపోయిన ఘటన కొయ్యలగూడెంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలవరం సీఐ జీఆర్‌ఆర్ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన వట్టికూటి ప్రవీణ్‌కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి కొయ్యల గూడెంలోని టీటీడీ కళ్యాణ మండపంలో గురువారం రాత్రి జరిగిన బంధువుల వివాహానికి కారులో వచ్చారు. తొలుత నల్లజర్లలో ఓ వివాహానికి హాజరై అనంతరం కొయ్యల గూడెంలో చేరుకున్నారు.
ఆ సందర్భంలో ప్రవీణ్‌కుమార్ భార్య, అతని తల్లి, కుటుంబ సభ్యులు తాము ధరిం చిన ఆభరణాలను తీసి వెంట తెచ్చుకున్న బ్యాగ్‌లలో ఉంచారు. ఆ బ్యాగ్‌లను కల్యాణ మండపం ఎదురుగా పార్క్ చేసిన తమ కారులో ఉంచి డోర్ లాక్‌చేసి వివాహానికి హాజరయ్యూరు. అర్ధరాత్రి ఒంటిగంటకు కల్యాణ మం డపం నుంచి బయటకు వచ్చిన ప్రవీ ణ్‌కుమార్, అతని కుటుంబ సభ్యులు కారు వెనుక అద్దం పగిలిపోయి ఉండటాన్ని గుర్తించారు. కారులోని ఐదు బ్యాగ్‌లు కనపడకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు.
అక్కడకు సమీపంలోని ప్రకాశం, వీఎస్‌ఎన్ కళాశాలల మధ్యగల జామాయిల్ తోటలో ఆ బ్యాగులు కనిపించాయి. వాటిలోని దుస్తులు, సామగ్రి చెల్లాచెదురుగా పడేసి ఉన్నాయి. వాటిలో పెట్టిన 23 కాసుల బంగారు ఆభరణాలు, రూ.15వేల నగదు కనిపించలేదు. వివాహ వేదిక వద్ద ఖరీదైన కార్లు అనే కం ఉన్నప్పటికీ దొంగలు ఆ కారునే ఎంచుకోవడాన్ని చూస్తే నల్లజర్ల నుంచే ఆ కారును వెంబడించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తమ కారు అద్దాలకు ఫిల్మ్ లేకపోవడంతో అందులోని బ్యాగ్‌లు బయటకు కనిపిస్తున్నాయని, దీంతో దుండగులు కారు అద్దాలను పగుల గొట్టి చోరీకి పాల్పడి ఉంటారని బాధితులు పేర్కొంటున్నారు. ఘటనా స్థలాన్ని సీఐ జీఆర్‌ఆర్ మోహన్ పరిశీలించారు. స్థానికులే చోరీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఏలూరు నుంచి క్లూస్‌టీం సభ్యులు రంగంలోకి దిగారు. ఎస్సై ఎస్‌ఆర్‌ఆర్ గంగాధర్ కేసు నమోదు చేశారు.