దొడ్డి దారిన దోచిపెడదాం!
కాంట్రాక్టర్లకు రూ. 20 వేల కోట్ల లబ్ధి కోసం రాష్ట్ర సర్కారు ఎత్తులు
సాక్షి, హైదరాబాద్: ఓవైపు రాష్ట్రం విభజన తాలూకు అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది.. మరోవైపు సాధారణ ఎన్నికల గడువు సమీపిస్తోంది... సర్వ త్రా రాజకీయు వేడి రాజుకుంటోంది.. ఈ పరిస్థితిని సానుకూలంగా వూ ర్చుకుని ఖజానాను భారీగా కొల్లగొట్టే ఓ వ్యూహం నిశ్శబ్దంగా అవులవుతోంది! ఇప్పటికే కీలక దశకు చేరిన ఈ వ్యూహం పూర్తరుుతే నిబంధనలకు విరుద్ధంగా పదుల్లో కాదు, వందల్లో కాదు.. ఏకంగా రూ.20 వేల కోట్ల మేర కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరుతుంది. సహకరించిన నేతలకూ సరేసరి!!
తలూపిన ముఖ్యనేత..
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను ఈపీసీ పద్ధతిలో చేపట్టారు. అంటే ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ నుంచి అన్ని దశలనూ కాంట్రాక్టు సంస్థలే స్వయుంగా చేపట్టాలి. ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందాల మేరకు నిర్ణీత గడువులో వాటిని పూర్తి చేయూలి. లేదంటే భారీగా జరివూనాలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ కాంట్రాక్టు సంస్థల తప్పేమీ లేకపోరుునా, నిర్మాణాలు ఆలస్యమైతే ప్రభుత్వం వారికి సిమెంట్, స్టీల్, ఇంధనం ధరల్లో పెరుగుదలను అదనంగా చెల్లించవచ్చు. వైఎస్ హయూంలో 2005 నుంచి 2008 వుధ్య అధికంగా ప్రాజెక్టులను చేపట్టారు. ఆయన హయాంలోనే పలు ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తికాగా, మరికొన్ని చివరి దశలో ఉండిపోయాయి. వైఎస్ మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు ఆ ప్రాజెక్టులను గాలికొదిలేశాయి. వాటిలో అధిక శాతం ఒప్పందాల్లోని గడువు వుుగిసింది. ఈపీసీ కాంట్రాక్టు నిబంధనల ప్రకారం కాంట్రాక్టు సంస్థలపై జరివూనాలు వేసి, ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేరుుంచాల్సిన ప్రస్తుత ప్రభుత్వం అదేమీ చేయలేదు. రాజకీయు నేతల ఒత్తిళ్లు, స్వార్థం కోసం ఒప్పందాల గడువునే పొడిగిస్తూ వచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం అందరి దృష్టి విభజన రాజకీయూలపైనే ఉంది. సాధారణ ఎన్నికలు కూడా రాబోతున్నారుు. దీన్ని అదనుగా తీసుకున్న బడా కాంట్రాక్టు సంస్థలు పెద్దమొత్తంలో నిధులు పొందటానికి ఓ వ్యూహం పన్నారుు. సాక్షాత్తూ వుుఖ్య నేత దీనికి తలూపారు.
అంతా ప్రణాళిక ప్రకారమే...
వుుఖ్యనేత సవ్ముతించిన ప్రణాళిక ప్రకారం.. తొలుత కాంట్రాక్టు సంస్థలు ప్రభుత్వానికి ఓ వినతి పత్రాన్ని సవుర్పించారుు. సకాలంలో నిధులు ఇవ్వకపోవడం వల్ల, తవుకు సంబంధం లేని ఇతరత్రా కారణాల వల్ల సాగునీటి పనుల్లో విపరీతమైన జాప్యం జరిగిందని, అందువల్ల ఈ వుధ్యకాలంలో పెరిగిన ధరల మేరకు తవుకు అదనంగా చెల్లించాలని అందులో కోరారుు. అడగ్గానే ఇచ్చేస్తే వివుర్శలు, ఇతరత్రా ఆరోపణల్లో చిక్కుకుంటావునే ఆలోచనతో వుుఖ్య నేత తన ప్రణాళికలో వురో దశకు తెరతీశారు. ఒక వుంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారు. అనుకున్నట్లుగానే పలు దఫాలు సమావేశమైన మంత్రివర్గ ఉప సంఘం కూడా కాంట్రాక్టర్లకు అనుకూలంగా నివేదికను అందజేసింది. నిజానికి ఈపీసీ నిబంధనల మేరకు ధరలు పెరిగితే సదరు భారం మోయూల్సింది కాంట్రాక్టర్లదే! వుహా అరుుతే స్టీల్, సిమెంట్, ఇంధనం (పెట్రోల్, డీజిల్) వాటికి మాత్రమే పెరిగే ధరలను వర్తింపజేస్తారు. కానీ మంత్రివర్గ ఉపంఘం మాత్రం స్టీల్, సిమెంట్, ఇంధనంతోపాటు ఇసుక, లేబర్ తదితరాలన్నింటికీ పెరిగిన ధరలను అమలు పరచాలని సిఫారసు చేసింది.
దీనిపై సొంత పార్టీ నేతల నుంచే వివుర్శలు వెల్లువెత్తాయి. పైగా వుంత్రివర్గ ఉపసంఘం ఏకంగా 2013 ఏప్రిల్ నుంచి ఈ ధరల పెరుగుదలను అమలు పరచాలని సూచించింది. అంటే ఈ నిర్ణయం అమలు పరిస్తే.. గత ఎనిమిది మాసాల బిల్లులకు కూడా పెరిగే ధరలను చెల్లించడంతోపాటు, భవిష్యత్తులో చేయబోయే అన్ని పనులకు ఈ ధరలను వర్తింపజేస్తారన్న వూట! ఇలా పెరిగే ధరలను అమలు పరిస్తే... రాష్ట్ర ఖజానాపై అదనంగా రూ.20 వేల కోట్ల భారం పడనుందని ఇంజనీర్లే అంచనా వేస్తున్నారు. గత ఐదారేళ్ల నుంచి బయటి ధరలు కనీసం 20 శాతం పెరిగినట్టు చెబుతున్నారు. ప్రాజెక్టుల్లో ఇంకా సుమారు లక్ష కోట్ల విలువైన పనులను చేయాల్సి ఉంది. ఈ లెక్కన కనీసం 20 శాతం భారం సర్కారు ఖజానాపై పడనుంది. అలాగే భవిష్యత్తులో కూడా ఎప్పటికప్పుడు పెరిగే ధరలను సవరించాల్సి ఉంటుంది. అంటే.. ఈ భారం మరింత పెరిగే అవకాశం ఉందన్నవూట!