
నేడు ఏపీ సభల్లో గవర్నర్ ప్రసంగం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభ,మండలి సభ్యులను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ శనివారం ప్రసంగించనున్నారు. ఉదయం 8.54 గంటలకు సభ ప్రారంభమై.. ప్రభుత్వం నిర్ణయించిన ముహూర్తం ప్రకారం 8.55 గంటలకు గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. ప్రసంగం ముగిసిన అనంతరం సభ సోమవారానికి వాయిదా పడుతుంది. తర్వాత శాసన సభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశం జరిగే అవకాశం ఉంది.