మావోయిస్టులతోపాటు క్రాంతికారీ ఆందోళనను అంతం చేయడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించిన ఆపరేషన్ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో 200 మంది ఉద్యమకారులు అమరులయ్యారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది.
మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటన
చింతూరు: మావోయిస్టులతోపాటు క్రాంతికారీ ఆందోళనను అంతం చేయడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించిన ఆపరేషన్ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో 200 మంది ఉద్యమకారులు అమరులయ్యారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మావోయిస్టు పార్టీ దక్షిణ రీజినల్ కమిటీ పేరుతో ఛత్తీస్‌గఢ్‌లో ఈ మేరకు కరపత్రాలను విడుదల చేసింది. కాగా, సోమవారం నుంచి ప్రారంభమైన మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రాష్ర్టంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు మృతిచెందగా ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి.