కేబినెట్ సమావేశంలో నిర్ణయం
సాక్షి, అమరావతి: రాజధానిలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ కన్సార్షియంకు అప్పగించే ఒప్పందానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆన్‌లైన్‌ద్వారా అనుమతులు ఇచ్చేందుకు అనువుగా కొత్త బార్ లైసెన్స్ విధానానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో ఐదేళ్ళపాటు బార్ లైసెన్స్‌లను పొడిగించాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 9,10 షెడ్యూల్డ్‌లోని పబ్లిక్ రంగ సంస్థల ఉద్యోగుల వయోపరిమితిని 60 ఏళ్ళకు పెంపునకు ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకుంది.
హా ఏపీ రైల్వే మౌలిక వసతుల కార్పొరేషన్ లిమిటెడ్ స్థాపన. రైల్వే ప్రాజెక్టులు త్వరిత గతిన పనిచేసేందుకు ఈ సంస్థ పనిచేస్తుంది.
హా కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీం ద్వారా వచ్చే డెత్ గ్రాట్యుటీ, రిటైర్మెంట్ గ్రాట్యుటీ ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపు.
హా ఆంధ్రప్రదేశ్ ఇనిస్టిట్యూట్ అండ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్, అమరావతి స్టార్టప్ అభివృద్ధికి సింగపూర్‌తో చేసుకున్న ఒప్పందానికి ఆమోదం.
సింగపూర్ కంపెనీలకు గ్రీన్ సిగ్నల్
Published Fri, Jun 16 2017 2:03 AM | Last Updated on Tue, Sep 5 2017 1:42 PM
Advertisement
Advertisement