startup area project
-
అంకురాల అభివృద్ధిలో మనమెక్కడ..?
భారత ఆర్థిక వ్యవస్థకు అంకుర సంస్థలు కొత్త ఊపు తెస్తున్నాయి. స్టార్లప్‌ల రూపంలో కొత్తదనాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రాయితీలు అందిస్తున్నాయి. అందుకు అనువుగా ఒడుదొడుకులను తట్టుకొని ముందుకు సాగేలా వాటి వ్యవస్థాపకులను ప్రోత్సహిస్తున్నాయి. యువ జనాభా అధికంగా ఉన్న భారతదేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటికి రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు బ్యాంకు రుణాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్టాండప్ ఇండియా కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య అభివృద్ధి విభాగం (డీపీఐఐటీ) గుర్తింపు పొందిన అంకుర సంస్థలకు పన్ను రాయితీలు, ఆర్థిక సహాయంతో పాటు మేధాహక్కులూ వేగంగా మంజూరు అవుతున్నాయి. భారత్‌లో దాదాపు 110 యూనికార్న్ కంపెనీలు.. ప్రపంచంలో అంకురాల సంఖ్యలో భారత్ మూడో స్థానాన్ని ఆక్రమిస్తోంది. 2023 అక్టోబరు నాటికి దేశంలోని 763 జిల్లాల్లో డీపీఐఐటీ గుర్తింపు పొందిన 1,12,718 అంకురాలు వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ప్రపంచంలో నవీకరణ, నాణ్యత పరంగా చూస్తే మన స్టార్టప్‌లు రెండో స్థానంలో నిలుస్తున్నాయి. 100 కోట్ల డాలర్ల విలువ సాధించిన అంకురాలను యూనికార్న్‌లుగా వ్యవహరిస్తారు. అలాంటివి భారత్‌లో 110 వరకు ఉన్నాయి. అమెరికా, చైనాల తరవాత ఇంత పెద్ద సంఖ్యలో యూనికార్న్‌లు ఉన్నది భారత్‌లోనే. ఒక్క 2022లోనే భారత్‌లో 42 టెక్నాలజీ అంకురాలు పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ వెన్నుదన్నుతో ఇవి సాధిస్తున్న విజయాలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఐదు విభాగాల్లో డీపీఐఐటీ ర్యాంకింగ్‌లు.. స్టార్టప్‌ల వృద్ధికి అనుకూలమైన ఎకోసిస్టమ్‌ను నిర్మించడానికి 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేస్తున్న ప్రయత్నాలను పరిశీలించిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఇటీవల ఐదు రకాల ర్యాంకులను ఇచ్చింది. ఇందులో బెస్ట్ పర్ఫార్మర్స్, టాప్ పర్ఫార్మర్స్, లీడర్స్, ఆస్పైరింగ్ లీడర్స్, ఎమర్జింజ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ విభాగాల్లో గుర్తింపు ఇస్తున్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను వాటి జనాభా ఆధారంగా రెండు విభాగాలుగా విభజించారు. కోటి జనాభా కంటే ఎక్కువ ఉన్నవి, కోటి కంటే తక్కువ ఉన్నవిగా వర్గీకరించారు. ‘లీడర్స్’ కేటగిరీలో ఏపీ టాప్.. దేశంలోని ఎనిమిది రాష్ట్రాలను 'లీడర్స్' కేటగిరీలో చేర్చారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, త్రిపుర వరుస స్థానాల్లో ఉన్నాయి. ఆంత్రప్రెన్యూర్ల కోసం బలమైన స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడంలో గుజరాత్, కర్ణాటకలు బెస్ట్ పర్ఫార్మర్లుగా ర్యాంకులు తెచ్చుకున్నాయి. ఇదే లిస్టులో కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ తరువాత స్థానాల్లో నిలిచాయి. గుజరాత్ వరుసగా నాలుగోసారి బెస్ట్ స్టేట్‌గా నిలిచింది. కర్ణాటక ఈ విభాగంలో రెండో ర్యాంకు సాధించింది. మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయలు టాప్ పర్ఫార్మర్స్గా ఎంపికయ్యాయి. బిహార్, హరియాణా, అండమాన్ నికోబార్ దీవులు, నాగాలాండ్‌లు ఆస్పైరింగ్ లీడర్స్ విభాగంలో వరుస స్థానాల్లో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్, దిల్లీ, జమ్మూకాశ్మీర్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, లద్ధాఖ్, మిజోరాం, పుదుచ్చేరి , సిక్కింలు ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్స్ విభాగంలోకి చోటుసాధించాయి. ఇదీ చదవండి: తీరనున్న ఎగిరే ట్యాక్సీ కల! వీటి ఆధారంగానే ర్యాంకింగ్‌లు.. ఇన్నోవేషన్లను ప్రోత్సహించడం, మార్కెట్ యాక్సెస్, ఇంక్యుబేషన్ ఫండింగ్ సపోర్ట్ వంటి 25 యాక్షన్ పాయింట్ల ఆధారంగా ఈ ర్యాంకులను ఇచ్చామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్‌లకు ఎలాంటి సాయం అవసరమో తెలుసుకోవాలని అధికారులను కోరారు. స్టార్టప్‌లు పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌ల వంటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపీఆర్‌లు) నమోదు కోసం డీపీఐఐటీ సాయం తీసుకోవాలని అన్నారు. -
రాజధానిలో 35 నిర్మాణాలు.. 25 శాతం లోపే
సాక్షి, అమరావతి : నిధుల లభ్యత లేకపోయినా, పెద్దగా అవసరం లేకపోయినా రాజధానిలో గత తెలుగుదేశం ప్రభుత్వం ఎడాపెడా మొదలుపెట్టిన 73 పనుల్లో 35 నిర్మాణాలకు సంబంధించిన పనులు 25 శాతంలోపే అయినట్లు తేలింది. వాటిలో కొన్ని ఐదు శాతం కూడా పూర్తికాలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ప్రభుత్వ శాఖల్లో పనుల తీరుపై నివేదికలు కోరిన విషయం తెలిసిందే. ఏప్రిల్ ఒకటో తేదీ కంటే ముందు కేటాయించిన పనుల్లో ఇప్పటివరకూ అసలు మొదలు కానివి.. కేటాయించిన పనుల్లో 25 శాతం కన్నా తక్కువ పూర్తయిన వాటి వివరాలతో సీఆర్డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ), ఏడీసీ (అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్) అధికారులు నివేదికలు సిద్ధంచేస్తున్నారు. నాలుగున్నరేళ్లల్లో కట్టినవి ఇవే.. టీడీపీ పాలనలోని నాలుగున్నరేళ్లలో రాజధాని నగర పరిధిలో మొత్తం 73 పనులు చేపట్టగా వాటిలో అందుబాటులోకి వచ్చినవి కేవలం తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలు, సిటీ సివిల్ కోర్టు కాంప్లెక్స్ మాత్రమే. మిగిలిన పనులన్నీ వివిధ దశల్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వీటిలో 38 పనులే 25 శాతానికి మించి జరిగినట్లు చెబుతున్నారు. ఏడీసీ అధ్వర్యంలో జరిగిన రోడ్ల పనులు కొన్ని సగానికి పైగా పూర్తయ్యాయి. రాజధానిని జాతీయ రహదారితో అనుసంధానం చేసే సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా అందులో ఉన్నా ఒక ప్యాకేజీలోనే పనులు జరిగాయి. రెండో ప్యాకేజీకి ఇంకా టెండర్లే పిలవకపోవడంతో ఈపని అసంపూర్తిగానే ఉంది. గెజిటెడ్, నాన్–గెజిటెడ్ అధికారుల కోసం నిర్మిస్తున్న అపార్టుమెంట్లు కొంతవరకూ పూర్తయ్యాయి. అన్ని పనులు అప్పులతోనే ముందుకు ఇదిలా ఉంటే.. మొదలైన ఈ మొత్తం పనుల విలువ రూ.35 వేల కోట్లకు పైనే ఉంటుందని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. కానీ, నిధులు లేకపోవడంతో అన్ని పనుల్ని దాదాపు అప్పులతోనే మొదలుపెట్టారు. పీపీపీ కింద కేటాయించిన పనులు మినహా మిగిలిన పనుల కోసం ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకులు, పలు ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకున్నారు. ఏ పనికి ఎంత రుణం తీసుకున్నారు, ఎక్కడి నుంచి తీసుకున్నారనే పూర్తి వివరాలను సీఆర్డీఏ ఇప్పటివరకూ బయట పెట్టకపోయినా తీసుకున్న రుణాల్లో నిర్మాణ సంస్థలకు చెల్లించింది మాత్రం మూడు వేల కోట్ల వరకే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఆయా నిర్మాణాలు చేపట్టిన సంస్థలు చాలారోజుల నుంచి బిల్లుల కోసం గత ప్రభుత్వ పెద్దలు, సీఆర్డీఏ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నా వారు ఏదో ఒక సాకుతో తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి చేపట్టిన పనులన్నింటినీ సమీక్షిస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి పూర్తి వాస్తవాలను బయటపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. హడావుడి తప్ప పురోగతి లేని పనులు గత ప్రభుత్వం మూడున్నరేళ్ల నుంచి డిజైన్ల పేరుతో హడావుడి చేసినా పూర్తిస్థాయి అసెంబ్లీ నిర్మాణం ఇంకా మొదలు కాలేదు. లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్స్ సంస్థతో దీని డిజైన్ రూపొందించినా నిర్మాణ పనుల్ని ఇంకా ఎవరికీ అప్పగించలేదు. అలాగే.. - సచివాలయం కోసం నిర్మించే ఐదు టవర్లు, హైకోర్టు, ముఖ్యకార్యదర్శులు.. కార్యదర్శుల నివాస భవనాలు, మంత్రులు..జడ్జీల బంగ్లాలు, ఎమ్మెల్యేలు–ఐఏఎస్ అధికారుల భవన నిర్మాణ పనులు 25 శాతానికి మించలేదు. - సచివాలయ టవర్లు, హైకోర్టు పనులైతే ఐదు శాతం కూడా దాటకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. - ఇబ్రహీంపట్నం నుంచి లింగాయపాలెం వరకూ కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణ పనులకు ఎన్నికలకు ముందు హడావుడిగా శంకుస్థాపన చేసినా మొదలు పెట్టలేదు. - అలాగే, సింగపూర్ కన్సార్టియంకు అప్పగించిన స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కూడా వివాదాల కారణంగా ఒక్కడుగూ ముందుకు పడలేదు. - భూసమీకరణ పథకం కింద రైతుల నుంచి సేకరించిన భూమికి బదులుగా వారికిచ్చే ప్లాట్ల లేఅవుట్ల అభివృద్ధి పనుల్లో ఒక్కటీ మొదలు కాలేదు. మొత్తం 11 జోన్ల కింద విభజించిన ఈ లేఅవుట్ల అభివృద్ధి పనులపై ఇప్పటికీ స్పష్టత లేవకపోవడం గమనార్హం. -
అప్పులతోనే మౌలిక వసతులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు కేటాయించిన 1,691 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు అప్పులు చేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. రహదారులు, ప్రభుత్వ కాంప్లెక్స్, ల్యాండ్ పూలింగ్ స్కీం, వరద నియంత్రణ, ఘన వ్యర్థాల నిర్వహణ, ఐకానిక్ వంతెన, విద్యుత్ తదితర మౌలిక వసతుల కల్పనకు తొలి దశలో రూ.51,208 కోట్లు అవసరమని సీఆర్డీఏ అంచనా వేసింది. ఈ నిధులను హడ్కో, ప్రపంచ బ్యాంకు, స్టాండర్డ్ చార్టెర్డ్ బ్యాంకు నుంచి అప్పు తీసుకోవడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా కొంత సమీకరించాలని నిర్ణయించింది. భారం సీఆర్డీఏ పైనే.. అమరావతిలో సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిన 1,691 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు అయ్యే వ్యయాన్ని సీఆర్డీఏ భరించాల్సి ఉంటుంది. ఆ మేరకు సింగపూర్ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రూ.5,500 కోట్ల వ్యయం అవుతుందని జీవో కూడా జారీ చేసింది. సింగపూర్ కంపెనీలకు ఇచ్చిన భూమిలో విద్యుత్, రహదారులు, మంచినీరు, పారిశుధ్యం తదితర వసతులను సీఆర్డీఏ అప్పులు చేసి కల్పించనుంది. ఆ భూమిని సింగపూర్ కంపెనీలు ప్లాట్లుగా మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాయి. రుణానికి రాçష్ట్ర సర్కారు గ్యారెంటీ తొలి దశలో రూ.10వేల కోట్ల అప్పులు చేసేందుకు సీఆర్డీఏకు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. అయితే వడ్డీ 8 శాతంలోపే ఉండాలని స్పష్టం చేసింది. సీఆర్డీఏకు వేల ఎకరాల భూములు ఉన్నప్పటికీ సొంతంగా అప్పులు చేసి, తీర్చే సామర్థ్యం లేదని రేటింగ్ ఇచ్చే సంస్థలు తేల్చాయి. అప్పులు పుట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీ ఉండాలని స్పష్టం చేశాయి. -
అరచేతిలో వైకుంఠం!
సాక్షి, అమరావతి: అమరావతిలో నవ నగరాలు, ఐకానిక్ టవర్లు, ఐకా నిక్ బ్రిడ్జీలు.. వాటర్ ఛానళ్లు.. గోల్ఫ్ కోర్సులతో ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు కోటలు దాటినా అడుగులు మాత్రం అస్తవ్యస్థంగా ఉంటున్నాయి. రాజధాని ఎక్కడుందో కనపడ్డంలేదు కానీ అంతర్జాతీయ స్థాయి కుంభకోణాలు మాత్రం కలవరపెడుతున్నాయి. కొత్త రాజధానిలో నిర్మాణాలు ఒకటి రెండే ఉండగా వివాదాలు, అడ్డగోలు వ్యవహారాలు మాత్రం అడుగడుగునా దర్శనమిస్తున్నాయి. సింగపూర్ కంపెనీలతో లాలూచీపడి వేల కోట్ల విలువైన భూములను వారికి అప్పనంగా అప్పగించడం.. భూసమీకరణ పేరుతో నాలుగు పంటలు పండే భూములను రైతుల నుంచి బలవంతంగా తీసుకోవడం.. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా వాటిని సొంతం చేసుకోవడం వంటి అనేక దారుణాలు నాలుగేళ్లుగా అమరావతికి అడ్డుగా మారాయి. రాజధాని పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని అవినీతికి పాల్పడిందనడానికి ఇవే నిదర్శనాలు. గద్దెనెక్కకాగానే ఇన్సైడర్ ట్రేడింగ్ 2014 ఎన్నికల అనంతరం రాజధాని ఎక్కడనే విషయంపై వ్యూహాత్మకంగా లీకులిచ్చిన ప్రభుత్వ పెద్దలు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి వేల కోట్ల విలువైన భూములను కారుచౌకగా చేజిక్కించుకున్నారు. శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను పక్కనపెట్టి తమకు అనుకూలమైన ప్రాంతంలో రాజధాని ఏర్పాటుచేయాలని నిర్ణయించుకుని ఆ విషయాన్ని తమకు కావల్సిన వారికి మాత్రమే చెప్పారు. దీంతో సీఎం, ఆయన కుమారుడు, వారి కోటరీ వ్యక్తులంతా ఆ ప్రాంతంలో తక్కువ ధరకు భారీగా భూములు కొనుగోలు చేశారు. ఇలా తాము ముందే అనుకున్న ప్రాంతంలో సుమారు 25వేల ఎకరాలను టీడీపీ నాయకులు తక్కువ రేటుకు చేజిక్కించుకున్నారు. అదే సమయంలో బయట ప్రపంచానికి మాత్రం రాజధాని నూజివీడులో అని, గన్నవరంలో అని గుంటూరు జిల్లాలోని నాగార్జున వర్సిటీ ప్రాంతంలో అని అనుకూల మీడియా ద్వారా లీకులిచ్చారు. తద్వారా రాజధాని పేరుతో ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బూమ్ సృష్టించి సాధారణ, మధ్యతరగతి ప్రజలను తప్పుదారి పట్టించారు. అనుకున్న చోట భూములన్నీ తమ చేతుల్లోకి వచ్చాక గుంటూరు జిల్లా తుళ్లూరులో రాజధాని ఏర్పాటుచేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఆ ప్రాంతంలో అప్పటివరకూ భూములమ్ముకున్న వారు గొల్లుమనగా, ప్రభుత్వ లీకులతో వేరే ప్రాంతాల్లో కొన్నవారు నిండామునిగిపోయారు. దీంతో తాము అనుకున్న ప్రాంతంలో కొన్న భూముల విలువ అమాంతం పెరిగిపోవడంతో టీడీపీ బడా బాబులంతా వేలకోట్ల లబ్ధి పొందారు. ఈ ఆట తెలియని సామాన్యులు సర్వం పోగొట్టుకున్నారు. దళిత రైతుల అసైన్డ్, లంక భూములను సైతం అధికార పార్టీ నేతలు భయపెట్టి కారుచౌకగా తీసుకున్నారు. ఇలా ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్, మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావుతోపాటు అనేకమంది టీడీపీ ఎమ్మెల్యేల బాగోతాలను ‘సాక్షి’ రెండేళ్ల క్రితమే బయటపెట్టింది. బలవంతపు భూసమీకరణ.. అడుగడునా దౌర్జన్యాలు ఇలా భూముల కొనుగోళ్లు పూర్తయ్యాక తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల రైతుల నుంచి ప్రభుత్వం భూసమీకరణ ద్వారా 34వేల ఎకరాలను లాక్కుంది. కృష్ణా నది తీరంలో నాలుగు పంటలు పండే అత్యంత విలువైన భూములను ఇవ్వలేమని రైతులు గగ్గోలు పెట్టినా.. పర్యావరణవేత్తలు మొత్తుకున్నా, ప్రతిపక్షాలు, స్థానికులు పెద్దఎత్తున ఆందోళనలు చేసినా పట్టించుకోని ప్రభుత్వం బెదిరింపులు, దౌర్జన్యాలతో భూములు లాక్కుంది. పలుచోట్ల తోటలను దగ్ధం చేయడం, ఇవ్వని రైతులపై కేసులు పెట్టి వేధించడం, టీడీపీ నేతలు వారి ఇళ్లకు వెళ్లి మరీ బెదిరించడం, పొలాలకు నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేయడం, వ్యవసాయ రుణాలు ఇవ్వకపోవడం, రైతులకు తెలియకుండానే వారి భూములను దున్నేయడం వంటి అనేక అరాచకాలకు పాల్పడింది. ఈ ఆగడాలను కప్పిపుచ్చుకునేందుకు తమకు అనుకూలమైన కొందరు రైతులను చూపించి స్వచ్ఛందంగా రైతులు భూములిచ్చినట్లు ప్రచారం చేసింది. మరోవైపు.. నాలుగు పంటలు పండే భూముల్లో రాజధాని నిర్మాణం వద్దంటూ పర్యావరణవేత్తలు గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా నిబంధనల మేరకు రాజధాని నిర్మాణం చేపట్టాలని ట్రిబ్యునల్ సూచనలు చేసింది. వాటి ప్రకారమే నడుచుకుంటామని ట్రిబ్యునల్‌కు చెప్పిన సర్కార్.. క్షేత్రస్థాయిలో మాత్రం తన ‘ప్లాన్’ ప్రకారమే వెళ్తోంది. అలాగే.. మేధాపాట్కర్, రాజేంద్రసింగ్ వంటి పర్యావరణవేత్తలు సైతం రాజధాని ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ జరుగుతున్న నష్టంపై తమ వాణి వినిపించారు. పర్యావరణ విషయం ఇలా ఉంటే.. భూసమీకరణ సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, బెదిరింపులపై ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో బ్యాంకు ప్రతినిధులు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని పరిశీలించారు. దీంతో రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక సాయం పై ఆ బ్యాంకు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్లాట్ల కేటాయింపుల్లో వివక్ష ఇదిలా ఉంటే.. భూసమీకరణ ప్యాకేజీని టీడీపీకి అనుకూలంగా ఉన్న వారికి లబ్ధిచేకూర్చేలా తయారుచేసిన ప్రభుత్వం రైతులకిచ్చే ప్లాట్ల విషయంలో వివక్ష చూపించింది. ఎక్కడి భూములకు అక్కడే ప్లాట్లు ఇస్తామని చెప్పి ఆ తర్వాత ఇష్టానుసారం వాటిని మార్చేసి అనుకూలురకు కావల్సిన చోట కేటాయించింది. కాగా, ప్లాట్ల పంపిణీ కేవలం కాగితాల్లోనే జరిగింది తప్ప ఎవరికీ ప్లాట్లు భౌతికంగా ఇవ్వలేదు. ప్లాట్ల కేటాయింపునకు నిర్వహించిన లాటరీ విధానంపై కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. ‘తాత్కాలికం’లో డొల్లతనం ఇంత హడావుడి చేసినా రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ తప్ప మరో నిర్మాణం రాజధానిలో కట్టలేకపోయారు. వీటికి వెయ్యి కోట్ల వరకూ ఖర్చు చేశారు. ఆరు లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన ఆరు బ్లాకులను మొదట రూ.180 కోట్లతో మొదలు పెట్టి అంచెలంచెలుగా దాని ఖర్చు పెంచుకుంటూ వెళ్లారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా చదరపు అడుగుకు రూ.10 వేలు ఖర్చు చేసి నిర్మించిన ఈ భవనాలు పైన పటారం లోన లొటారం మాదిరిగా తయారయ్యాయి. చిన్నపాటి వర్షానికే భవనాల లోపల వర్షపు ధార కారిపోతుండడం వాటి డొల్లతనాన్ని బయటపెట్టింది. ఒక్క శాశ్వత భవనమూ లేదు రాజధానిలో ఇప్పటివరకూ ఒక్క శాశ్వత భవన నిర్మాణానికీ పునాది పడలేదు. డిజైన్ల కోసం చంద్రబాబు చేస్తున్న విన్యాసాలతో నవ్వులపాలవడం తప్ప ఫలితం లేకుండాపోయింది. 900 ఎకరాల్లో హైకోర్టు, అసెంబ్లీ భవనం, సచివాలయం, శాఖాధిపతులు, విభాగాధిపతులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయ భవనాల డిజైన్ల మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా మొదట జపాన్‌కు చెందిన ‘మకి’ అసోసియేట్స్‌ను అంతర్జాతీయ పోటీలో ఎంపిక చేసిన ప్రభుత్వం అనూహ్యంగా దాన్ని పక్కకు తప్పించి లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్‌ను ఎంపిక చేసింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌కు ‘మకి’ ఫిర్యాదు చేయడంతోపాటు అంతర్జాతీయ జర్నళ్లలో ఎండగట్టింది. దీంతో అంతర్జాతీయంగా రాష్ట్రం పరువు బజారునపడింది. మరోవైపు.. బాహుబలి, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాల్లోని అమరావతి సెట్టింగ్‌లపై మనసుపడి వాటి దర్శకులతో చర్చలు జరిపారు. రెండున్నరేళ్లపాటు ఇలా డిజైన్లు మార్చిమార్చి ఇటీవలే ఆమోదం తెలిపినా ఇంకా టెండర్ల ప్రక్రియ పూర్తికాలేదు. ఇదిలా ఉంటే.. రాజధాని రోడ్లు, భవనాల నిర్మాణ అంచనాలను కళ్లుచెదిరేలా తయారు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చదరపు అడుగుకు రూ.నాలుగైదు వేలతో నిర్మించే అవకాశం ఉన్న భవనాలకు రూ.7వేల నుంచి 10 వేల వరకూ అంచనాలు వేసి టెండర్లు పిలవడంతో నిర్మాణ నిపుణులే విస్తుపోతున్నారు. తాజాగా రూ.1,387 కోట్ల అంచనాతో కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి పనుల్ని ఖరారు చేయడం ఈ కోవలోనిదే. మరోవైపు.. టెండర్లు, డిజైన్లతో సంబంధం లేకుండా రూ.250 కోట్లు ఖర్చుపెట్టి ఏడాదిన్నర క్రితం ప్రధాని నరేంద్ర మోదీతో ఉద్ధండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన చేయించినా అక్కడ ఏం కట్టాలనే దానిపై ప్రభుత్వం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. పరిపాలనా నగరానికి కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో శంకుస్థాపన చేయించినా దానికి సంబంధించిన డిజైన్లూ ఇంకా ఖరారు కాలేదు. ఇలా రాజధానికి సంబంధించిన ప్రతీ పని ఒక ఆర్భాటపు ప్రహసనమే తప్ప ఆచరణలోకి రాలేదు. స్టార్టప్ ఏరియాలో సింగపూర్ కంపెనీలతో లాలూచీ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు పేరుతో రాజధాని భూములను కారుచౌకగా సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి కుంభకోణానికి తెరతీసింది. రైతుల నుంచి సేకరించిన భూముల్లోని 1691 ఎకరాలను ఎకరం రూ.12 లక్షల చొప్పున స్విస్ ఛాలెంజ్ విధానంలో నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి సింగపూర్ కన్సార్టియంకు అప్పగించింది. విడతల వారీగా అప్పగించే ఈ భూముల విలువలో కొంత హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. అవే భూములను ఇతర కంపెనీలకు ఎకరం రూ.4 కోట్లకు ప్రభుత్వం కేటాయించింది. దీన్నిబట్టి రూ.6,764 కోట్ల విలువైన భూములను కేవలం రూ.250 కోట్లకు అప్పగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ప్రాజెక్టు కోసం రాజధాని ప్రకటనకు ముందే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సింగపూర్ కంపెనీలతో లోపాయకారీ ఒప్పందం చేసుకున్నారు. రాజధాని మాస్టర్‌ప్లాన్‌ను వారితో తయారు చేయించి ఆ తర్వాత ఈ ప్రాజెక్టును స్విస్ ఛాలెంజ్ విధానంలో వారికే అప్పగించారు. ఇదిలా ఉంటే.. రాజధాని ప్రాంతంలో తమకూ అవకాశం ఇవ్వాలని పలు సంస్థలు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపింది. దీంతో ప్రభుత్వం ఏపీఐడీసీ చట్టాన్నే మార్చేసి సింగపూర్ కన్సార్టియంకు ప్రాజెక్టును అప్పగించింది. ప్రభుత్వం అభివృద్ధి చేసి ఇచ్చిన ఈ భూముల్లో ప్లాట్లు వేసి సింగపూర్ కన్సార్టియం, ఏడీసీ (అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్) కలిసి విక్రయిస్తుంది. కారుచౌకగా భూములివ్వడంతోపాటు రూ.5,500 కోట్లతో అందులో మౌలిక వసతులు అభివృద్ధి చేసే పని కూడా ప్రభుత్వానిదే. ఈ భూములపై సింగపూర్ కన్సార్టియంకు సీఆర్డీఏ పవర్ ఆఫ్ అటార్నీ కూడా ఇచ్చేసింది. ఇంతచేసి సింగపూర్ కంపెనీలు ఇందులో పెట్టే పెట్టుబడి రూ.330 కోట్లు మాత్రమే. కానీ, ప్రాజెక్టులో మాత్రం 58 శాతం వాటా వారికి ఇచ్చారు. భూములు, వసతులు కల్పన అన్నీ చేసిన ఏడీసీ వాటా మాత్రం 42 శాతమే. ఇంత దారుణంగా ప్రభుత్వం నష్టపోతూ కూడా సింగపూర్ సంస్థలకు ప్రభుత్వం మోకరిల్లడం వెనుక ప్రభుత్వ ముఖ్యుల స్వప్రయోజనాలున్నాయని, వేల కోట్ల లబ్ధి ఉందని స్పష్టమవుతోంది. -
సింగపూర్ కంపెనీలకు గ్రీన్ సిగ్నల్
కేబినెట్ సమావేశంలో నిర్ణయం సాక్షి, అమరావతి: రాజధానిలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ కన్సార్షియంకు అప్పగించే ఒప్పందానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆన్‌లైన్‌ద్వారా అనుమతులు ఇచ్చేందుకు అనువుగా కొత్త బార్ లైసెన్స్ విధానానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో ఐదేళ్ళపాటు బార్ లైసెన్స్‌లను పొడిగించాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 9,10 షెడ్యూల్డ్‌లోని పబ్లిక్ రంగ సంస్థల ఉద్యోగుల వయోపరిమితిని 60 ఏళ్ళకు పెంపునకు ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకుంది. హా ఏపీ రైల్వే మౌలిక వసతుల కార్పొరేషన్ లిమిటెడ్ స్థాపన. రైల్వే ప్రాజెక్టులు త్వరిత గతిన పనిచేసేందుకు ఈ సంస్థ పనిచేస్తుంది. హా కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీం ద్వారా వచ్చే డెత్ గ్రాట్యుటీ, రిటైర్మెంట్ గ్రాట్యుటీ ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపు. హా ఆంధ్రప్రదేశ్ ఇనిస్టిట్యూట్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, అమరావతి స్టార్టప్ అభివృద్ధికి సింగపూర్‌తో చేసుకున్న ఒప్పందానికి ఆమోదం. -
ఎన్నికల్లోపు కొంతైనా పురోగతి చూపండి
- సింగపూర్ కంపెనీల కన్సార్టియంకు సీఎం వేడుకోలు - స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికి సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందం సాక్షి, అమరావతి: రాజధానిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు పనిని వెంటనే ప్రారంభించి, వచ్చే ఎన్నికల నాటికి కొంతైనా పురోగతి చూపించాలని చంద్రబాబు సింగపూర్ ప్రైవేట్ కంపెనీలను కన్సార్టియంను కోరారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయమే ఉందన్నారు. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు మాస్టర్ డెవలపర్‌గా స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ కంపెనీల కన్సార్టియంను ఎంపిక చేసిన ప్రభుత్వం సోమవారం విజయవాడలో దీనిపై ఒప్పందాలు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్ సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... రెండేళ్లలో సింగపూర్ కంపెనీలు తమ సామర్థ్యం చూపాలని కోరారు. అమరావతికి గుండెకాయ స్టార్టప్ ఏరియా రాజధానికి మూడు దశల్లో మాస్టర్ప్లాన్లు అందించిన తర్వాత తమ సేవలను కొనసాగించాలని సీఎం చంద్రబాబు కోరారని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ చెప్పారు. నాణ్యమైన నిర్మాణాలు చేపడతా మన్నారు. స్టార్టప్ ఏరియా రాజధాని అమరావతికి గుండెకాయలా మారుతుందని చెప్పారు. దీంతోపాటు మరో మూడు ఒప్పంద పత్రాలపై చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సంతకాలు చేశారు. అమరావతిని భూతల స్వర్గంలా నిర్మిస్తాం అమరావతిని భూతల స్వర్గంలా నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సోమవారం రాజధాని అమరావతి స్టార్టప్ ఏరియా అభివృద్ధి పనులకు తాళ్లాయపాలెం సమీపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ.. విభజనతో నష్టపోయామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ధి కోసం అమెరికాకు వెళ్లి పలు కంపెనీలు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అదే విధంగా నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్ది దానికి సైబరాబాద్ అని పేరు కూడా తానే పెట్టానన్నారు. విభజన జరిగిన తరువాత ఏపీని ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో సింగపూర్ వెళ్లినట్లు పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్ అడిగిన వెంటనే ఆ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తనకు క్యాపిటల్ రీజయన్, క్యాపిటిల్ సిటీ, సీడ్ క్యాపిటల్ ప్లాన్లు ఇచ్చిందన్నారు. సింగపూర్ స్ఫూర్తితో అమరావతిని నిర్మించాలని, అందులో భాగంగానే సింగపూర్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు. -
వేల కోట్ల ‘వాటా’ల కోసమే సింగపూర్ బాట
-
సింగపూర్‌తో ‘చంద్ర’ బంధం
న్యాయస్థానాలు ఆక్షేపించినా స్విస్ ఛాలెంజ్ వదలరు - వేల కోట్ల ‘వాటా’ల కోసమే సింగపూర్ బాట - రాజధాని ‘స్టార్టప్’లో బాబు అండ్ కో భారీ స్కెచ్ - 1691 ఎకరాల భూమి, రూ. 5,721 కోట్ల పెట్టుబడికి దక్కేది రూ. 372 కోట్లు - రూ. 306 కోట్లు పెట్టుబడిపెట్టే సింగపూర్ కన్సార్టియంకు రూ. 52,439 కోట్లు లాభం - అయినా సింగపూర్‌కే అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం - బాబు బినామీలతోనే మేనేజ్మెంట్ కంపెనీ - దానిని అడ్డుపెట్టుకుని భారీ దోపిడీకి పథకం ‘‘స్విస్ చాలెంజ్ విధానం పారదర్శకంగా లేదు. ఈ విధానంలో ఏయే ప్రాజెక్టులు చేపట్టనున్నారో అందరికీ తెలిసేలా పారదర్శకంగా ప్రభుత్వం అన్నీ ప్రకటించాలి. ప్రాజెక్టు వివరాలు ప్రభుత్వం ఎవరికీ ఇవ్వకూడదు. ఈ విధానంలో పాల్గొనే సంస్థలతో ప్రభుత్వం ఎటువంటి సంప్రదింపులు జరపకూడదు.’’ – 11.05.2009న lఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ‘‘స్విస్ చాలెంజ్ విషయంలో ఎందుకీ లోగుట్టు? విదేశీ కంపెనీల కోసం నిర్ణయాలు తీసుకోవద్దు. రాజధాని ప్రజల ఆస్తి. మీ ఇష్టారా జ్యంగా వ్యవహరి స్తామంటే చెల్లదు. ఆదాయవ్యవ హారా లన్నీ బహిర్గతం చేయాల్సిందే. టెండర్ నోటిఫికేషన్లో పారదర్శకత ఎక్కడా లేదు. మీరు చెప్పేది కాగితాలపై ఒకటి ఉంటుంది. ఆచరణలో మరొకటి జరుగుతుంది.’’ – రాష్ట్ర ప్రభుత్వ తీరుపై 23.08.2016న హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం వ్యాఖ్యలు ‘‘సీఆర్డీఏ స్వతంత్రంగా పనిచేయడం లేదని, రాజకీయ ప్రయోజనాలతో ముడిపడివున్న ఆదేశాలను పాటించడం తప్ప, తాము ఏమీ చేయలేమని ఆ సంస్థ ఉద్యోగులంటున్నారు. కారణం లేకుండా మమ్మల్ని తొలగించారు. తర్వాత లండన్‌కు చెందిన ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ను ఎంపిక చేశారు. కానీ ఎలా ఎంపిక చేసిందీ బాహ్య ప్రపంచానికి తెలియనివ్వలేదు. దీన్ని బట్టి ఇక్కడ ఏదో లోపాయికారీ ఒప్పందం ప్రకారమే ఎంపికలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.’’ – ఆర్కిటెక్చురల్ డైజెస్ట్ ఏప్రిల్ సంచికలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాకి అసోసియేట్స్ ఫౌండర్ చైర్మన్ ఫుమిహికో కథనం సాక్షి, అమరావతి: పత్రికలు, మేధావులు, రాజకీయనాయకులు, ప్రతిపక్షాలు పలుమార్లు ఇది తప్పు అని ఖండించినా.. న్యాయస్థానాలు పూర్తిగా ఎండగట్టినా.. కాస్త ఆలస్యమైతే చేశారు గానీ.. మళ్లీ అదే స్విస్ చాలెంజ్.. అవే సింగపూర్ కంపెనీలు.. అవే లోపాయికారీ ఒప్పందాలు.. అవే పద్ధతుల్లో.. ఎలాంటి జంకూగొంకూ లేకుండా రాజధాని స్టార్టప్ ప్రాజెక్టును కట్టబెట్టడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూనుకున్నారు. వేల కోట్లు దుర్వినియోగం కాబోతున్నాయని.. అందులో భారీ వాటా దక్కించుకోబోతున్నారని చెప్పడానికి ఇదో పెద్ద ఉదాహరణ. అందుకే ఈ స్థాయిలో చంద్రబాబు ముందుకు పోతున్నారని, న్యాయస్థానాలు ఆక్షేపిస్తున్నా బరితెగించినట్లు వ్యవహరిస్తున్నారని విశ్లేషకులంటున్నారు. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో 1691 ఎకరాల భూమి ఇవ్వడంతోపాటు రూ.5,721.9 కోట్ల పెట్టుబడిని ప్రభుత్వం పెడుతోంది. ఆ ప్రాజెక్టును సింగపూర్ కన్సార్టియంకు అప్పగించింది. ఈ ప్రాజెక్టులో సింగపూర్ కన్సార్టియం రూ.306.4 కోట్లను పెట్టుబడి పెడుతోంది. రూ.5,721.9 కోట్ల పెట్టుబడి పెట్టే ప్రభుత్వానికి 50 శాతం వాటా ఇస్తామని సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదిస్తే.. అంతకన్నా ఎక్కువ వాటా కోసం ప్రయత్నించాల్సింది పోయి 42 శాతమే చాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. అంటే రూ.306.4 కోట్ల పెట్టుబడి పెట్టే సింగపూర్ కన్సార్టియంకు దక్కే వాటా 58 శాతం. దీనిని బట్టి అర్ధం కావడం లేదూ ‘వాటా’ల కోసమే ‘వాటాల’లో తేడా వచ్చిందని? రాష్ట్రప్రభుత్వానికి ఇచ్చే రెవెన్యూ 8.7శాతమట.. న్యాయస్థానాలు అనేకసార్లు మొట్టికాయలు వేశాక అంతిమంగా రాష్ట్రప్రభుత్వానికి వచ్చే లాభం గురించి చంద్రబాబు కేబినెట్ సమావేశంలో బయటపెట్టారు. మొత్తం 1691 ఎకరాల స్టార్టప్ ఏరియాను 15 ఏళ్లలో మూడు దశల్లో అభివృద్ధి చేస్తారని, తొలి దశలో 656 ఎకరాలు, రెండో దశలో 514 ఎకరాలు, మూడో దశలో 521 ఎకరాల భూమిని అభివృద్ధి చేస్తారని కేబినెట్ సమావేశంలో వెల్లడించారు. ఇందులో సింగపూర్ కన్సార్టియం చేసేదేమీ లేదు. భూమి ఇచ్చి మౌలికసదుపాయాలకు రాష్ట్రప్రభుత్వమే రూ.5,500 కోట్లు ఖర్చుపెడితే ఆ భూమిలో రహదారులు, పార్కులు విడగొట్టి మిగిలిన 1070 ఎకరాల మేర భూమిని ప్లాట్లు చేసి అమ్ముకోవడమే మేనేజ్మెంట్కంపెనీ ముసుగులో సింగపూర్ కన్సార్టియం చేసేది. అలా అమ్మగా వచ్చే లాభాలలో మొదట దశలో 5శాతం, రెండో దశలో 7.5 శాతం, మూడో దశలో 12 శాతం రెవెన్యూ వాటాను రాష్ట్రప్రభుత్వానికి ఇస్తారు. మూడు దశల్లో కలిపితే ఇది 8.7 శాతం ఉంటుందని అంచనా. రాష్ట్రప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత మిగిలిన మొత్తాన్నంతా ఏడీపీలోని సింగపూర్ కన్సార్టియం, సీసీడీఎంసీఎల్ 58ః42 నిష్పత్తిలో పంచుకుంటాయి. రూ.5721.9 కోట్ల పెట్టుబడికి వచ్చేది రూ.372.36 కోట్లే! స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అమలు కోసం సింగపూర్ సంస్థల కన్సార్టియం, ప్రభుత్వానికి చెందిన కేపిటల్ సిటీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ (సీసీడీఎంసీఎల్) కలసి అమరావతి డెవలప్మెంట్ పార్టనర్ (ఏడీపీ)ని ఏర్పాటుచేశాయి. ► రాజధాని నిర్మాణానికి భూసమీకరణ ముసుగులో 33 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి లాక్కున్న సర్కార్ 1,691 ఎకరాల భూమిని రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం సింగపూర్ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాలను సర్కార్ కల్పించనుంది. ► రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం రూ.3,137 కోట్లు ఖర్చవుతుందని సింగపూర్ సంస్థలు ప్రాథమికంగా అంచనా వేశాయి. ఇందులో తమ వాటా రూ.306.4 కోట్లు. సీసీడీఎంసీ వాటా రూ.221.9 కోట్లనీ.. మిగతా రూ.2618.70 కోట్లను బ్యాంకుల్లో భూమిని తనఖా పెట్టి రుణం రూపంలోనూ ప్లాట్లు విక్రయం ద్వారా వచ్చే మొత్తాన్ని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తామని సింగపూర్ సంస్థలు చేసిన ప్రతిపాదనకు సర్కార్ అంగీకరించింది. ► ఈ ప్రాజెక్టులో రూ.5,721.9 కోట్లు ఖర్చు చేసే రాష్ట్రప్రభుత్వానిది 42 శాతం వాటా కాగా.. కేవలం రూ.306.4 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్ కన్సార్టియంది 58 శాతం కావడం గమనార్హం. ► రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును తాము నియమించే మేనేజ్మెంట్ కంపెనీకే ఏడీపీ అప్పగించాలన్న సింగపూర్ సంస్థల ప్రతిపాదనకూ సర్కార్ అంగీకరించింది. ఈ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును అభివృద్ధి చేయడంతోపాటు.. ప్లాట్లను విక్రయిస్తుంది. ► స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో రహదారులు, పార్కులకు పోగా మిగిలిన 1,070 ఎకరాలను ఎకరం రూ.4 కోట్ల చొప్పున విక్రయించగా వచ్చే మొత్తం ఆదాయంలో ప్రభుత్వానికి వాటా ఇవ్వగా మిగిలిన సొమ్ము ఏడీపీకి వస్తుంది. అంటే.. ఎకరం రూ.4 కోట్ల చొప్పున విక్రయించి.. ప్రభుత్వానికి గ్రాస్ రెవెన్యూ షేర్లో తొలి దశలో 5, రెండో దశలో 7.5, మూడో దశలో 12 అంటే సగటున 8.7 శాతం వాటా ఇస్తే ప్రభుత్వానికి దక్కేది రూ.372.36 కోట్లే. ఏడీపీకి దక్కేది రూ.3907.64 కోట్లు. ► ఏడీపీకి ఇచ్చే 250 ఎకరాల్లో ఎకరం రూ.నాలుగు కోట్ల చొప్పున విక్రయిస్తే వచ్చే సొమ్ము రూ.వెయ్యి కోట్లును కలిపితే రూ.4,907.64 కోట్లు వస్తుంది. అయితే మేనేజ్ మెంట్ కంపెనీ ఖర్చులతో పాటు రాజధాని స్టార్టప్ ఏరి యా ప్రాజెక్టు వ్యయం రూ.3,137 కోట్ల నుంచి ఏటా 20 శాతం చొప్పున పెరిగితే.. సీసీడీఎంసీకి దక్కేది బూడిదే. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో నష్టం వస్తే ఆ మేరకు సింగపూర్ సంస్థలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలి. మేనేజ్మెంట్ కంపెనీ ముసుగులో దోపిడీ పథకం రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును తాము నియమించే మేనేజ్మెంట్ కంపెనీకే ఏడీపీ అప్పగించాలన్న సింగపూర్ సంస్థల ప్రతిపాదనకూ సర్కార్ అంగీకరించింది. ఈ మేనేజ్మెంట్ కంపెనీ ఏదన్నది స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సింగపూర్ సంస్థల ప్రతిపాదనల్లో వెల్లడించకపోవడం గమనార్హం. ఆ మేనేజ్మెంట్ కంపెనీ ముఖ్యనేత బినామీలది కావడం వల్లే గోప్యంగా ఉంచారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఈ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును అభివృద్ధి చేయడంతోపాటు.. ప్లాట్లను విక్రయిస్తుంది. ప్రభుత్వం ఎకరం భూమి కనీస ధరను రూ.నాలుగు కోట్లుగా నిర్ణయించింది. ఒకవేళ ఏదైనా సంస్థకు రూ.నాలుగు కోట్ల కన్నా తక్కువకు ఎకరం భూమి ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తే.. ఆ తగ్గించిన మొత్తాన్ని సర్కారే మేనేజ్మెంట్ కంపెనీకి చెల్లించాలి. ఒకవేళ అధిక ధరకు అమ్ముకున్నా అడిగే నాధుడులేడు. ఆ లాభాలను సింగపూర్ సంస్థలే పంచుకుంటాయి. రాష్ట్రానికి దక్కేదేమీ ఉండదు. మేనేజ్మెంట్ కంపెనీని అడ్డుపెట్టుకుని రూ.4 కోట్లకు ఎకరం చొప్పున భూమిని కొట్టేసేందుకు చంద్రబాబు అండ్ కో, సింగపూర్ సంస్థల కన్సార్టియం ఎత్తులు వేస్తున్నాయి. విజయవాడలో ప్రధాన కేంద్రాల్లో గజం భూమి రూ.లక్ష పలుకుతోంది. ఈ లెక్కన రాజధానిలో ప్రాంతంలోనూ అదే ధర పలుకుతుందనుకుంటే.. ఎకరం భూమి రూ.40 కోట్లు ఉంటుంది. ఈ లెక్కన 1,070 ఎకరాల భూమిని అమ్మి రూ.42,800 కోట్లను ముఖ్యనేత, సింగపూర్ సంస్థలు సొమ్ము చేసుకోనున్నాయి. తొలుత 50 ఎకరాలు, రెండో దశలో 200 ఎకరాల భూమి సింగపూర్ సంస్థలకు అప్పగించడానికి సర్కార్ అంగీకరించింది. ఈ 250 ఎకరాలను ఎకరం రూ.40 కోట్ల చొప్పున అమ్ముకున్నా రూ.పది వేల కోట్లు ఆ సంస్థలకు ఆదాయం వస్తుంది. ఇందులో ఒక్క పైసా కూడా వాటా ఇవ్వమని ఆ సంస్థలు పెట్టిన షరతుకూ సర్కార్ అంగీకరించింది. అంటే.. సింగపూర్ సంస్థలు పెట్టే రూ.306.4 కోట్ల పెట్టుబడికి ఆదిలోనే రూ.9,693.60 కోట్ల లాభం దక్కించుకోనున్నాయి. మొత్తమ్మీద స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనే కనిష్ఠంగా రూ.52,439.6 కోట్లను ముఖ్యనేత, సింగపూర్ సంస్థలు కాజేయనున్నాయి. -
ఔను.. తుస్ చాలెంజే!
-
ఔను..తుస్ చాలెంజే !
-
ఔను.. తుస్ చాలెంజే!
► రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు సింగపూర్ కన్సార్టియంకు అప్పగింత ► రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర ► రూ. 5,721 కోట్లు ఖర్చు పెట్టే రాష్ట్ర ప్రభుత్వం వాటా 42 శాతం ► రూ. 306.4 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్ కన్సార్టియం వాటా 58% ► త్వరలో ఏడీసీ, కన్సార్టియం ఒప్పందం సాక్షి, అమరావతి: అంతా ముందు నుంచి అనుకున్నట్లే పక్కా ప్రణాళికతో జరిగిపోయింది. రాజధానిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియంకు కట్టబెట్టింది. స్విస్ చాలెంజ్ విధానాన్ని తుస్సుమనిపిస్తూ.. ఇతర కంపెనీలేవీ బిడ్లు దాఖలు చేయకుండా, తాము కోరుకున్న కన్సార్టియంకే ఈ ప్రాజెక్టు దక్కేలా ప్రభుత్వ పెద్దలు సాగించిన మంత్రాంగం ఫలించింది. ఈ మేరకు మంత్రివర్గం దీనికి ఆమోదముద్ర వేసింది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం మంగళవారం సమావేశమైంది. అసెండాస్–సిన్‌బ్రిడ్జి–సెంబ్‌కార్ప్‌లతో కూడిన సింగపూర్ కంపెనీల కన్సార్టియంకు స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టును అప్పగించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో తన పెట్టుబడితోసహా మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5,721.9 కోట్లు ఖర్చు పెట్టే రాష్ట్ర ప్రభుత్వం వాటా 42 శాతం కాగా, కేవలం రూ.306.4 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్ కంపెనీల కన్సార్టియం వాటా 58 శాతం కావడం గమనార్హం. రాజధానిలో ప్రాజెక్టు పేరిట సింగపూర్ కంపెనీలతో కలిసి రూ.లక్ష కోట్లకుపైగా దోచుకోవడానికి ‘ముఖ్య’నేత స్కెచ్ వేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టులో 58 శాతం వాటాను సింగపూర్ కంపెనీలకు ఇచ్చి, కేవలం 42 శాతం వాటా మాత్రమే తాను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అగీకరించింది. స్విస్ చాలెంజ్ విధానంలో గ్లోబల్ టెండర్ పిలిచినా ఇతరులెవరూ పోటీ బిడ్లు దాఖలు చేయకపోవడంతో సింగపూర్ కన్సార్టియంకే ఈ ప్రాజెక్టును అప్పగిస్తూ కేబినెట్ తీర్మానించింది. కేబినెట్లో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలను చంద్రబాబు స్వయంగా మీడియాకు వెల్లడించారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు కింద రాజధాని కోర్ ఏరియాలో 1,691 ఎకరాలను సింగపూర్ కన్సార్టియంకు అప్పగిస్తారు. కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) కలిసి 15 సంవత్సరాల్లో మూడు దశల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తారు. మొదటి దశలో 656, రెండో దశలో 514, మూడో దశలో 521 ఎకరాలను కన్సార్టియంకు అప్పగిస్తారు. మొదట 50 ఎకరాలను నామమాత్రపు ధరకే ఇస్తారు. లాభాల్లో 42:58 శాతం వాటాలు పంచుకోవడంతోపాటు భూమికి సంబంధించిన గ్రాస్ టర్నోవర్‌లో మొదటి విడత 5 శాతం, రెండో విడత 7.5 శాతం, మూడో విడత 12 శాతం (సరాసరి 8.7 శాతం) ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ), సింగపూర్ కన్సార్టియం కలిసి అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్(ఏడీపీ)గా ఏర్పడి ఈ ప్రాజెక్టును చేపడతాయి. అభివృద్ధి చేసిన ప్లాట్లను వేలం ద్వారా ప్రపంచంలోని కంపెనీలకు ఏడీపీ కేటాయిస్తుంది. మరోవైపు మౌలిక సదుపాయాలకు అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ (ఏడీపీ) రూ.2,118 కోట్లను పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. స్టార్టప్ ఏరియాలో మొదటి దశలో 8–9 లక్షల చదరపు అడుగుల మేర నిర్మాణం చేపడతారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో ఏడీసీ, సింగపూర్ కన్సార్టియం ఒక ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. -
తుస్... చాలెంజ్!