నెల్లూరు(అర్బన్): నగరంలోని కలెక్టరేట్‌లో రుణమాఫీపై శనివారం గ్రీవెన్స్ నిర్వహించారు. వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో పాటు వ్యవసాయ కమిషనర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారులు రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇప్పటి వరకు రుణమాఫీ పొందని, మొదటి విడత పొంది, రెండో విడత పొందని రైతులు భారీగా తరలిరావడంతో కలెక్టరేట్ కిక్కిరిసింది. అధి కారులు ఏర్పాట్లలో విఫలమవడంతో గందరగోళం నెలకొంది. మధ్యాహ్న భో జన విరామ సమయానికి సుమారు 1500 మంది రైతులు కలెక్టరేట్ వద్ద పడిగాపులు కాశారు. అధికారులు కేవలం 500 మంది కి టోకన్లు అందజేశారు. మధ్యాహ్నం నుం చి టోకన్లు అందజేసిన రైతుల దరఖాస్తులు మాత్రమే స్వీకరిస్తామని, మిగిలిన వా రు ఆదివారం రావాలని తెలిపారు. దీంతో వందలాది మంది రైతులు నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయం తెలియక మధ్యాహ్నం నుంచి కలెక్టరేట్‌కు చేరుకున్న రైతులకు సమాధానం చెప్పే వారు కరువయ్యారు.
రైతుల సంతోషం కోసమే
రైతులు సంతోషంగా ఉండాలనే ధ్యేయంతో కష్టతరమైనా ప్రభుత్వం రుణమాఫీ చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో రుణమాఫీ ఫిర్యాదుల విభాగాన్ని ప్రారంభించిన మంత్రి సోమిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. అన్ని బ్యాంకుల నుంచి పంట రుణాల వివరాలు తెప్పించుకుని రుణమాఫీ చేస్తున్నామన్నారు. 2007 నుంచి 2013 వరకు నిల్వ ఉన్న ఖాతాలను పరిశీలించి వడ్డీతో సహారుణమాఫీ చేస్తున్నామన్నారు. మూడో విడతతో కలిపి మొత్తం రూ.14,710 కోట్లు మాఫీ చేశామన్నారు. రైతు సాధికారత సంస్థ 9లక్షల ఫిర్యాదులను పరిశీలించిందని, అందులో 5.72 లక్షల ఫిర్యాదులు న్యాయమని తేల్చిందన్నారు. వీరందరికీ వివిధ దశల్లో రుణమాఫీ చేస్తున్నామన్నారు. ఉద్యానవన పంటల కింద రూ.384.47 కోట్లు, మరణించిన రైతులకు సంబంధించి రూ.51.54 కోట్లు రుణ ఉపశమనం కల్పించామన్నారు. బ్యాంకుల్లో సాంకేతిక కారణాలతో కొందరికి రుణమాఫీ జరగలేదని, వారందరికీ ఇప్పుడు ఇస్తున్నామని తెలిపారు. కలెక్టర్ ముత్యాలరాజు మాట్లాడుతూ అర్హులైన రైతులందరికీ న్యాయం చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, జేసీ2 వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు.
బ్యాంకర్లు తిప్పుకుంటున్నారు
నాకు రూ.26,321 రుణమాఫీ జరిగినట్లుగా అధికారులు తెలిపారు. యూబీఐ బ్యాంకుకు వెళ్తే రుణమాఫీ జరగలేదన్నారు. విజయవాడ రైతు సాధికారత సంస్థ వద్దకు వెళ్తే వారు ఒకేసారి మొత్తం రుణ మాఫీ చేసినట్టు పది నెలల క్రితం లెటర్ ఇచ్చారు. బ్యాంకు అధికారులకు ఇచ్చే ఆన్‌లైన్‌లో చెక్ చేసి ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని చెబుతున్నారు.
–వల్లూరు మస్తాన్, సాయిపేట
ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు
మానాన్న పాశం చిన మాలకొండయ్య రూ.20 వేలు క్రాప్‌లోను తీసుకున్నాడు. రుణమాఫీ కోసం దరఖాస్తు చేసుకున్నా ఒక్క రూపాయి ఖాతాలో జమకాలేదు. అధికారులు స్పందించి రుణమాఫీ చేయాలి.
–లక్ష్మి, తాళ్లూరు
Comments
Please login to add a commentAdd a comment