బాలికపై లైంగికదాడికి యత్నం
Published Thu, Mar 13 2014 2:34 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
నరసన్నపేట రూరల్, న్యూస్‌లైన్: చీపురుపల్లిలోని పిల్లపేట వెంకటవీధికి చెందిన బాలికపై శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం నడగాం గ్రామానికి చెందిన దొంపాక వెంకటి లైంగిక దాడికి ప్రయత్నించాడు. వివరాలిలా ఉన్నాయి. నడగాంలోని బంధువుల ఇంటికి రెండు రోజుల కిందట చీపురుపల్లికి చెందిన బాలిక వెళ్లింది. మంగళవారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లిన బాలికపై దొంపాక వెంకటి లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీంతో బాలిక గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న పశువుల కాపరి కరణం రామదాసు వచ్చి బాలికను రక్షించేందుకు ప్రయత్నించాడు. వెంకటి మొదట్లో రామదాసుపై తిరగబడ్డాడు. తర్వాత డబ్బులిస్తానని మభ్యపెడుతుండగా బాలిక ఊర్లోకి వెళ్లి జరిగిన సంగతి గ్రామస్తులకు తెలియజేసింది. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement