మేడారం (తాడ్వాయి), న్యూస్‌లైన్ : మేడారంలో ఫిబ్రవరిలో జరిగే శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. జాతర పనుల కోసం ప్రభుత్వం రూ.68 లక్షలు కేటాయించింది. గిరిజన సం క్షేమ శాఖ, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలు మినహా ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో జంపన్నవాగుపై అదనం గా రూ.3కోట్ల వ్యయంతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
మైనర్ ఇరిగేషన్ ఆధ్వర్యంలో రూ.9కోట్లతో కొత్తూరు సమీపంలో జంపన్నవాగుపై 300 మీటర్ల వరకు స్నానఘట్టాల నిర్మాణం జరుగుతోంది. భూమి చదును పనులు పూర్తి చేసి మెట్ల కోసం సెంట్రింగ్ చేపట్టారు. జాతరను అధికారులు పర్యవేక్షిం చేందుకు రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో రూ.30 లక్షలతో జంపన్నవాగు, ఊరట్టం జంపన్నవాగు, కొత్తూరు కాజ్‌వే, ఆర్టీసీ బస్టాండ్, గద్దెల ప్రాంతంలో చేపట్టిన మంచెల నిర్మాణం కొనసాగుతోంది.
ఆర్‌అండ్‌బీ, పీఆర్ ఆధ్వర్యంలో బయ్యక్కపేట, నార్లాపూర్, ఊరట్టం, కన్నెపల్లి, ఎల్బాక, జంపన్నవాగు నుంచి గద్దెల వరకు రోడ్ల విస్తీర్ణం పనులు జరుగుతున్నాయి. ఈనెల 18న మేడారంలో జేసీ పౌసుమిబసు నిర్వహించిన సమీక్ష సమావేశంలో జాతర అభివృద్ధి పనుల వేగం పెంచాలని, వారంలో ఎంత పనిచేస్తారో రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను అదేశించడం గమనార్హం.
హుండీలకు మరమ్మతులు
మేడారంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో హుండీలకు మరమ్మతులు చేస్తున్నారు. జాతర సమీపిస్తున్నందున భక్తుల రాక పెరుగుతోంది. వారు కానుకలు వేసేందుకు జాతరకు ముందుగానే అమ్మవార్ల గద్దెలపై హుండీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు.
జాతర పనులు ముమ్మరం
Published Thu, Dec 26 2013 4:12 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM
Advertisement