హెలిపాడ్ ఏర్పాటుకు స్థలం పరిశీలన: రేపు సీఎం రాక | Helipad space observation | Sakshi
Sakshi News home page

హెలిపాడ్ ఏర్పాటుకు స్థలం పరిశీలన: రేపు సీఎం రాక

Published Tue, Jun 17 2014 2:10 AM | Last Updated on Wed, Aug 29 2018 3:33 PM

హెలిపాడ్ ఏర్పాటుకు స్థలం పరిశీలన:  రేపు సీఎం రాక - Sakshi

హెలిపాడ్ ఏర్పాటుకు స్థలం పరిశీలన: రేపు సీఎం రాక

గుడ్లూరు, న్యూస్‌లైన్: మండలంలోని ఐదో నంబరు జాతీయ రహదారి పక్కన ఉన్న చేవూరు చెరువులో హెలిపాడ్ ఏర్పాటుకు స్థలాన్ని కలెక్టర్ విజయ్‌కుమార్, ఎస్పీ ప్రమోద్‌కుమార్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 18వ తేదీ రామదూత ఆశ్రమంలో జరిగే వేణుదత్త దాంపత్యవ్రత దీక్ష విరమణ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వస్తారనే సమాచారంతో ఆశ్రమంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలిస్తున్నామన్నారు.
 
ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో వస్తుండటంతో చేవూరు చెరువులో హెలిపాడ్ సిద్ధం చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించామన్నారు. ఎస్పీ ప్రమోద్‌కుమార్ మాట్లాడుతూ ఆశ్రమంలో స్టేజీ వద్ద, ఆశ్రమ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వీరి వెంట జిల్లా ఆర్‌అండ్‌బీ అధికారులు, ఆర్డీఓ బాపిరెడ్డి, డీఎస్పీ శంకర్, సీఐ మధుబాబు, గుడ్లూరు, ఉలవవపాడు, కందుకూరు ఎస్సైలు హుస్సేన్‌బాషా, నసీఫ్‌బాషా, రమణయ్య ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement