ఖమ్మం రూరల్ న్యూస్‌లైన్: ఖమ్మం రూరల్ మండలంలోని కామంచికల్ గ్రామ శివారులో బుధవారం కోడి పందాలు నిర్వహిస్తున్న తొమ్మిది మంది ని అరెస్ట్ చేసినట్లు ఖమ్మం డీఎస్‌పీ బాలకిషన్‌రావు తెలిపారు. రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అంబలి శ్రీనివాస్, కృష్ణా జిల్లాకు షేక్ అలీషరీఫ్,షేక్ రహీం, ఖమ్మానికి చెందిన గుడ్డి జానకిరాములు,షేక్ బాబు, జక్కుల ఆంజనేయులు, కంచపు వీరబాబు, కడలి బాలయోగి వరంగల్ జిల్లాకు చెందిన కొండి విష్ణు కామంచికల్ గ్రామ శివారులో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. మరికొందరు పారిపోయారు. వీరి వద్ద నుంచి 21 పందెం కోళ్లు, 11 సెల్‌ఫోన్లు, 13 మోటార్‌బైక్‌లు, ఒక కారు, ఒక ఆటో, రూ.8,300 నగదు స్వాధీనం చేసుకున్నారు. కోడి పందేలలో భారీగా డబ్బు చేతులు మారినట్లు, గత కొంతకాలంగా ఇక్కడ కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు తమ దృస్టికి వచ్చిందని తెలిపారు. నిందితులను పట్టుకున్న సీఐ తిరుపతిరెడ్డి, ఎస్‌ఐ నాగరాజు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
కోడి పందేలు నిర్వహిస్తున్న 9 మంది అరెస్ట్
Published Thu, Jan 9 2014 4:02 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM
Advertisement