విశ్వరూప చైతన్య యాత్ర జరిపి తీరుతామంటున్నా మంద కృష్ణమాదిగ
అడ్డుకుంటామంటున్న మాల, మాదిగ ఐక్య పోరాట సమితి నాయకులు
నలువైపులా పోలీసు చెక్‌పోస్టులు
నగరంలో 30 యాక్టు, 144 సెక్షన్ అమలు
తిరుపతి: ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి విస్మరించిన సీఎం చంద్రబాబునాయుడు వైఖరికి నిరసనగా ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో గురువా రం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విశ్వరూప చైతన్య యాత్రను తలపెట్టారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ము ందస్తుగా ఎమ్మార్పీఎస్ నాయకులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా యాత్రను ఆే ప ప్రసక్తేలేదని ఎమ్మార్పీఎస్ నాయకులు స్పష్టం చేస్తుండగా, అడ్డుకుని తీ రుతామని మాల, మాదిగ ఐక్యపోరా టసమితి నాయకులు హెచ్చరిస్తున్నా రు. ఈ క్రమంలో నారావారిపల్లెలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, హైఅలర్ట్ ప్రకటించారు.
ఎస్పీ పర్యవేక్షణ..
మాదిగ విశ్వరూప చైతన్యయాత్రకు ప్రభుత్వం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి స్వయంగా బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బుధవారం సాయంత్రం నారావారిపల్లెకు చేరుకునే మార్గాలైన శ్రీనివాసమంగాపురం, రంగంపేట, పీటీసీ, కొటాల, ఐతేపల్లి, నాగాలమ్మ కూడళ్లను సందర్శించారు. నారావారిపల్లెకు చేరుకునే అన్ని రహదారులను దిగ్బంధించారు. చుట్టుపక్కల గ్రామాల్లో కొత్త వ్యక్తుల రాకపై ఆరా తీస్తున్నారు. కడప, అనంతపురం జిల్లాల నుంచి అదనపు బలగాలను తెప్పించారు. 16మంది డీఎస్పీల పర్యవేక్షణలో 500 మంది పోలీసులను మోహరించారు. నారావారిపల్లెకు చేరుకునే మార్గాల్లో ఏడు చెక్‌పోస్టులు, పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు.
నారావారిపల్లెలో హైఅలెర్ట్
Published Thu, Mar 10 2016 2:18 AM | Last Updated on Mon, Oct 8 2018 3:00 PM
Advertisement
Advertisement