చంద్రబాబూ.. ఖబడ్దార్ | SC classification mandakrishna madhiga protest for arrest | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ.. ఖబడ్దార్

Published Fri, Mar 11 2016 2:26 AM | Last Updated on Mon, Oct 8 2018 3:00 PM

SC classification  mandakrishna madhiga  protest for arrest

నిజామాబాద్ నాగారం : ఎస్సీ వర్గీకరణకు అడ్డుపడు తూ ఏపీ సీఎం చంద్రబా బు, మందకృష్ణ మాదిగను అరెస్ట్ చేయించడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గురువారం బస్టాండ్ ఎదుట ఖబడ్దార్ చంద్రబాబూ.. అంటూ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గంధమాల నాగభూషణం మాట్లాడారు. చంద్రబాబు సొంతూరు చిత్తూర్ జిల్లా నారావారిపల్లె నుంచి విశ్వరూప యాత్రను చేపట్టిన మందకృష్ణను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఎన్నికలపుడు పెద్ద మాదిగ అన్న చంద్రబాబు ఇప్పుడు మోసం చేస్తే చూస్తూ ఊరుకోలేమన్నారు. యువసేన జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ఎమ్‌ఎస్‌ఎఫ్ జిల్లాఅధ్యక్షుడు తోబేవార్ సం తోష్, మహిళ సమాఖ్య రాష్ట్ర నాయకులు యమునా, తార, సాయిలు, రాజు, రమేష్, గంగారాం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement