హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భోస్లే బాధ్యతల స్వీకరణ | High Court judge Justice Dilip Babasaheb Bhosale, acceptance of responsibility | Sakshi
Sakshi News home page

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భోస్లే బాధ్యతల స్వీకరణ

Published Tue, Dec 9 2014 4:04 AM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భోస్లే బాధ్యతల స్వీకరణ

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భోస్లే బాధ్యతల స్వీకరణ

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భోస్లే సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా ప్రమాణం చేయించారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, ఇరు రాష్ట్రాల అడ్వొకేట్స్ జనరల్, న్యాయవాదులతో పాటు జస్టిస్ భోస్లే కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం తరువాత ఆయన మరో న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డితో కలసి కేసులను విచారించారు. జస్టిస్ భోస్లే కర్ణాటక హైకోర్టు నుంచి ఉమ్మడి హైకోర్టుకు బదిలీ అయిన విషయం తెలి సిందే. జస్టిస్ భోస్లే నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement