హైదరాబాద్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై జైలు ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. జైళ్ల శాఖ డీజీ ఆధ్వర్యంలో అధికారులు గురువారం సమావేశమైయ్యారు. జగన్ ఆరోగ్య స్థితిపై అధికారిక బులెటెన్ విడుదల చేయాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేయడంతో అధికారులు సమావేశమైయ్యారు.
ఈ సమీక్షా సమావేశంలో డీజీ సాంబశివరావుతో పాటు ఐజీ సునీల్ కుమార్, డీఐజీ చంద్రశేఖర్, చంచలగూడ సూపరిండెంట్ సైందయ్య పాల్గొన్నారు. రాష్ట్ర విభజన విషయంలో ఇరుప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్తో ఆయన ఆమరణదీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. జగన్ చేపట్టిన దీక్ష 5వ రోజుకు చేరడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి ఓ నివేదికను పంపారు.
జగన్ నిరాహార దీక్షపై ఉన్నతాధికారుల సమీక్ష
Published Thu, Aug 29 2013 5:16 PM | Last Updated on Wed, Aug 8 2018 5:33 PM
Advertisement
Advertisement