యజమాని వేధింపులు భరించలేకఆత్మహత్యాయత్నం | Husband and wife Suicide in TADEPALLIGUDEM | Sakshi
Sakshi News home page

యజమాని వేధింపులు భరించలేకఆత్మహత్యాయత్నం

Published Wed, Jul 16 2014 1:38 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

యజమాని వేధింపులు భరించలేకఆత్మహత్యాయత్నం - Sakshi

యజమాని వేధింపులు భరించలేకఆత్మహత్యాయత్నం

 తాడేపల్లిగూడెం రూరల్ : యజమాని వేధింపులు భరించలేక భార్యాభర్తలు పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడేపల్లిగూడేనికి చెందిన షేక్ అక్బర్ ఆలీ పట్టణంలోని స్టేషన్ రోడ్డులో ఉన్న విజయదుర్గ బ్యాటరీ షాపులో పనిచేసేవాడు. షాపులో ఇన్‌వర్టర్, బ్యాటరీలు చోరీకి గురికాగా, యజమాని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా షాపు యజమాని, నారాయణపురం గ్రామానికి చెందిన మరో వ్యక్తి కలిసి ఇటీవల అక్బర్, అతని భార్య పర్వీన్‌ను వేధించడం ప్రారంభించారు. దీంతో మనస్తాపం చెందిన భార్యాభర్తలు రామారావుపేటలో ఉన్న షాపు యజమాని ఇంటి ఎదుట మంగళవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. వీరిని ప్రైవేట్ అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. పోలీసులు బాధితుల నుంచి వివరాలు సేకరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement