
భర్త తాగొచ్చాడని భార్య...
మహిళ ఆత్మహత్యాయత్నం
పార్వతీపురం : భర్త తాగొచ్చాడని భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన స్థానిక జగన్నాథపురంలోని పిల్లా వీధిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానిక ఏరియా ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. పిల్లా వీధికి చెందిన రెడ్డిపల్లి అప్పలరాజు వారపు సంతల్లో పొగాకు విక్రయిస్తుంటాడు. ఎప్పటికప్పుడు మద్యం తాగుతూ ఉండడం వల్ల భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి.
సోమవారం మధ్యాహ్నం కూడా అప్పలరాజు పూటుగా మద్యం తాగి ఇంటికి రావడంతో భార్య మంగమ్మ నిలదీసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మనస్థాపానికి గురైన మంగమ్మ ఇంట్లో ఉన్న కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలను ఆర్పే క్రమంలో భర్త కూడా స్వల్పంగా గాయపడ్డాడు. అనంతరం మంగమ్మను స్థానిక ఏరియూ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.