ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు
హైదరాబాద్: రాజ్యసభ లేదా ఓ రాష్ట్రానికి గవర్నర్ వెళ్లాలని తాను అనుకున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తన మనసులోని మాటను బయటపెట్టారు. కానీ తమ పార్టీ నాయకులంతా కేబినెట్లో ఉండాలని కోరారు... అందుకే ఆర్థిక మంత్రిగా బాధ్యతుల స్వీకరించానని చెప్పారు.
అయితే తన మొదటి ఆప్షన్ మాత్రం రాజ్యసభే అని యనమల స్ఫష్టం చేశారు.శనివారం హైదరాబాద్లో యనమల విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం ప్లానింగ్ కమిషన్కు బదులు అంతర్ రాష్ట్ర కౌన్సిల్ను పునరుద్దరిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల సీఎంలు, ఆర్థిక మంత్రులు భాగస్వామ్యం ఉంటుందని చెప్పారు. గిరిజన జిల్లా ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని యనమల తెలిపారు.