'నామినేషన్ వెనక్కా... తీసుకోను గాక తీసుకోను' | I will not withdraw MLA Nomination, says Jithendra goud | Sakshi
Sakshi News home page

'నామినేషన్ వెనక్కా... తీసుకోను గాక తీసుకోను'

Published Wed, Apr 23 2014 4:41 PM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

I will not withdraw MLA Nomination, says Jithendra goud

అనంతపురం జిల్లా గుంతకల్లులో బీజేపీకి టీడీపీ బుధవారం ఝలక్ ఇచ్చింది. గుంతకల్లులో స్థానిక టీడీపీ నేత జితేంద్రగౌడ్ను నామినేషన్ వేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అంతే బాబు ఆదేశాలతో ఎగిరి గంతేసిన జితేంద్ర ఆగమేఘాల మీద నామినేషన్ వేశారు. అయితే గుంతకల్ స్థానాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి చంద్రబాబు కేటాయించారు. అందులోభాగంగా బీజేపీకి చెందిన అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయాలి.

అలాగే బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ఉపసంహరణ గడువు నేటితో ముగియనుండటంతో వేసిన నామినేషన్ ఉపసంహరించాలని జితేంద్రగౌడ్ను స్థానిక బీజేపీ నాయకులు కోరారు. అందుకు సదరు టీడీపీ నేత నిరాకరించి... పార్టీ అధినేత చంద్రబాబే నాకు స్వయంగా ఆదేశించినప్పుడు నేను ఎలా నామినేషన్ వెనక్కి తీసుకుంటా అంటూ బీజేపీ నేతలకు ఝలక్ ఇచ్చారు. దాంతో చంద్రబాబుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నామురా బాబు అంటు జుట్టు పీక్కుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement