
నేనెప్పటికీ సామాన్యుడినే: నరసింహన్
హైదరాబాద్ : తానెప్పటికీ సామన్య మానవుడినేనని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అన్నారు. రాజ్భవన్లో బుధవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నరసింహన్ను పలువురు ప్రముఖులు, విద్యార్థులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలియచేశారు. తాను సామాన్య మనిషినే అని... గవర్నర్ అయినంత మాత్రాన ప్రత్యేకంగా ఫీల్ అవటం లేదన్నారు. సామాన్య ప్రజలు ఇబ్బండి పడేలా తానెప్పుడు ప్రవర్తించలేదని గవర్నర్ తెలిపారు.