రాయల తెలంగాణ వ్యవహారమై నిఘావర్గాల అధికారులెవ్వరూ తమకు ఫోన్ చేయలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: రాయల తెలంగాణ వ్యవహారమై నిఘావర్గాల అధికారులెవ్వరూ తమకు ఫోన్ చేయలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజులుగా తాను ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్నా, ఫోన్‌కు అందుబాటులోనే ఉన్నానని, తమ ఎమ్మెల్యేలకూ ఫోన్లు వచ్చిన సమాచారం లేదని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులను వదిలి ఎమ్మెల్యేలకు ఎలా ఫోన్లు చేస్తారని ప్రశ్నించారు.