డెంకాడ, న్యూస్‌లైన్ : ఐసెట్ పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలోని రెండు కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష రాశారు. జిల్లా మొత్తం అభ్యర్థులకు ఇక్కడే పరీక్ష కేంద్రం కేటారుుంచారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరిగింది. కేంద్రం 1లో 800 మంది అభ్యర్థులు పరీక్షలు రాయూల్సి ఉండగా 89 మంది గైర్హాజరయ్యూరు. 711 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు.
కేంద్రం-2లో 672 మంది పరీక్ష రాయూల్సి ఉండగా 66 మంది గైర్హాజరయ్యూరు. 606 మంది పరీక్ష రాశారు. కొందరు విద్యార్థులు పరీక్ష సమయానికి రావడంతో కళాశాల సిబ్బందే బైక్‌లపై కేంద్రానికి చేరవేశారు. కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లుగా వైఎంసీ శేఖర్, టీవీఎన్ పార్థసారధి వ్యవహరించారు. పరీక్ష రీజనల్ కోఆర్డినేటర్ కేవీఎల్ రాజు, అబ్జర్వర్ ఏయూ అసోసియేట్ ప్రొఫెసర్ కె.వి.రమణ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.
ప్రశాంతంగా ఐసెట్
Published Sat, May 24 2014 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM
Advertisement
Advertisement