నెల్లూరు జిల్లా కేంద్రంలోని బాలాజీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విగ్రహాలను దొంగిలిస్తున్న ఓ ముఠాను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: నెల్లూరు జిల్లా కేంద్రంలోని బాలాజీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విగ్రహాలను దొంగిలిస్తున్న ఓ ముఠాను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పండితి వెంకటేశ్, చిలుకూరి శ్యాంకుమార్, రామస్వామి సుబ్రమణ్యం అనే వ్యక్తులు ముఠాగా ఏర్పాడి గత కొంతకాలంగా ఆలయాల్లోని పురాతన విగ్రహాలను ఎత్తుకెళ్తున్నారు. దీనిపై పలు ఫిర్యాదుల అందడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారి స్టైల్లో విచారణ చేపట్టడంతో నిందితులు దొంగతనాలను అంగీకరించారు. వారి నుంచి అతి విలువైన బుద్ధ విగ్రహంతో పాటు దేవతా విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు.