జిల్లాలో 56 డిస్ట్రిబ్యూటర్ల పరిధిలోని ఇండెన్, హెచ్‌పీ, భారత్ గ్యాస్ కంపెనీలకు చెందిన 6,18575 వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కా గా వీటిలో గ్యాస్ కంపెనీలతో 2,78,873 మంది అంటే 45.08 శా తం మంది వినియోగదారులు ఆధార్ అ నుసంధానం చేసుకున్నారు. అదే విధంగా 1,53,453 మంది అంటే 24.81 శాతం వినియోగదారులు బ్యాంకులో ఆధార్ అనుసంధానం చేసుకున్నారు. మరో 50 వేల మంది వరకు ఆయా గ్యాస్ ఏజెన్సీలలో అనుసంధానం కోసం దరఖాస్తులు సమర్పించినా వారికి ఇంతవరకు చేయలేదు.
ఈ నెల 31వతేదీలోగా ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోకుంటే సబ్సిడీ వం టగ్యాస్ అందే అవకాశాలు లేవు. ప్రస్తుతం వంట గ్యాస్‌కు ఆధార్ అనుసంధానం చేసుకోని వారు *445 చెల్లిస్తు న్నారు. అలాగే అనుసంధానం చేసుకున్న వారు మాత్రం *1327 చెల్లిస్తున్నారు. అనుసంధానం చేసుకున్న వారి బ్యాంకు ఖాతాలో నగదు బదిలీ పథకం ద్వారా *833 సబ్సిడీ జమఅవుతోంది. కా నీ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వినియోగదారులందరూ 1327 రూపాయలు చెల్లిం చాల్సి ఉంది.
అయితే ఆధార్ కార్డు అనుసంధానం చేసుకున్న వారికి మాత్రమే ప్ర భుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ.. బ్యాంకు ఖాతాలోకి వస్తుంది. అనుసంధానం చేసుకోని వారిపై మాత్రం భారం పడనుంది.
అనుసంధానం కాకుంటే..
గ్యాస్ వినియోగదారులు సంబంధిత గ్యాస్ ఎజెన్సీ వద్ద, బాం్యకులో ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోకుంటే పేదలపై భారం పడే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు మూడు పర్యాయాలు గడువులను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఆధార్ అనుసంధానం కాకుంటే గ్యాస్ వినియోగదారులు ఒక్కసారి రీఫిల్లింగ్ చేసుకుంటే 833 రూపాయల అదనపు భారం పడుతుంది.
ఆధార్.. బేజార్
Published Wed, Jan 22 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM
Advertisement
Advertisement