Subsidy gas
-
ఆధార్ లేకుంటే సబ్సిడీ గ్యాస్ కట్
నమోదుకు నవంబర్ వరకు గడువు న్యూఢిల్లీ: సబ్సిడీ గ్యాస్ పొందాలంటే ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులు ఆధార్‌కు అనుసంధానమయ్యేందుకు నవంబర్ 30వ తేదీ వరకు గడువునిచ్చింది. దీంతో నవంబర్ తర్వాత ఆధార్ లేకపోతే సబ్సిడీ గ్యాస్ అంద దు. ఆధార్ నమోదు కోసం తగిన ఏర్పాట్లు చేయాలని ఆయిల్ కంపెనీలకు కేంద్రం సూచించింది. అంతవరకూ బ్యాంకు పాస్‌బుక్, ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీ, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, కిసాన్ ఫొటో పాస్‌బుక్, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్స్‌లో ఏదో ఒక దాన్ని గుర్తింపు కార్డుగా పరిగణిస్తారు. ఈ ఉత్తర్వులు అస్సాం, మేఘాలయ, జమ్మూ కశ్మీర్ తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో తక్షణం అమల్లోకి వస్తాయని కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం సబ్సిడీ కింద ఏడాదికి 12 సిలిండర్లు ఇస్తుండగా... సబ్సిడీ మొత్తాన్ని ఆధార్ కార్డు ఆధారంగా బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నారు. -
12 సిలిండర్లు ఏడాదిలో ఎప్పుడైనా వాడుకోవచ్చు
న్యూఢిల్లీ: సబ్సిడీ వంటగ్యాస్ వినియోగదారులకు పెద్ద ఊరట! కుటుంబానికి నెలకు ఒకే సిలిండర్ అన్న నిబంధనను కేంద్ర కేబినెట్ ఎత్తివేసింది. ఏడాదికి ఇస్తున్న 12 సబ్సిడీ సిలిండర్లను ఇకపై ఏడాదిలో ఎప్పుడైనా వాడుకోవచ్చని పేర్కొంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి యూపీఏ ప్రభుత్వం 14.2 కేజీల సబ్సిడీ సిలిండర్ల కోటాను 9 నుంచి 12 సిలిండర్లకు పెంచుతూ.. నెలకు ఒకే సిలిండర్ అని నిబంధన విధించడం తెలిసిందే. ఈ విధానం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కేబినెట్ గుర్తించినట్లు టెలికం, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కేబినెట్ భేటీ అనంతరం విలేకర్లతో చెప్పారు. ‘కొన్నిసార్లు ప్రజలకు ఒక్క సిలిండర్ కూడా అవసరం ఉండదు. పండుగల్లో మాత్రం చాలా కావాల్సి ఉంటుంది. దీంతో ఒక నెల సిలిండర్ తీసుకోకపోతే అది పోయినట్లేనని భావన నెలకొంది. దేశ ప్రజల మేలు కోసం కేబినెట్ భేటీలో ఈ నిబంధనను ఎత్తివేశాం’ అని తెలిపారు. ఇకపై ఢిల్లీలో 12 సబ్సిడీ సిలిండర్లను ఏడాదిలో ఎప్పుడైనా సరే రూ.414 చొప్పున, సబ్సిడీయేతర సిలిండర్‌ను మార్కెట్ రేటు రూ. 920కు కొనుక్కోవచ్చన్నారు. జపాన్‌తో ఆరోగ్య ఒప్పందానికి ఒకే... ఆరోగ్య రంగంలో జపాన్‌తో సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి ఉద్దేశించిన సహకార ఒప్పందంపై సంతకాలు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిసింది. ప్రభుత్వ ఆరోగ్య బీమా వ్యవస్థ అనుభవాలు, మానవ వనరుల అభివృద్ధి ద్వారా సార్వత్రిక ఆరోగ్య సదుపాయాల కల్పనకు ఇది దోహదం చేస్తుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రధాని మోడీ త్వరలో జపాన్‌లో పర్యటించనున్న నేపథ్యంలో కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. -
వాహనాలకు వంటగ్యాసా?
-
సిలిండర్ @ రూ.2వేలు !
గొడౌన్లో గ్యాస్ లేదా...? గ్యాస్ అందుబాటులోకి రావడం లేదా....? అయితే సీలేరు రండి. రూ.2 వేలు ఇస్తే నడుచుకొని మీ ఇంటికి గ్యాస్ వచ్చేస్తుంది. గ్యాస్ సిలిండర్ ధర 2000 రూపాయలా..? అని ఆశ్చర్యపోతున్నారా!! ఔను నిజం. గ్యాస్ కావాలంటే అంత చెల్లించక తప్పదు. ఎందుకంటే ఇక్కడంతా దళారుల ఇష్టారాజ్యం. - సీలేరులో అంతే... - దళారుల చేతిలో సబ్సిడీ గ్యాస్ - ఒకే పేరుపై నాలుగైదు కనెక్షన్లు - అధిక ధరలకు ఒడిషా తరలింపు - పట్టించుకోని అధికారులు సీలేరు: సీలేరులో ప్రభుత్వ సబ్సిడీ గ్యాస్ దళారుల పాలవుతోంది. గ్యాస్ అధికారులు స్థానికంగా ఉన్న కొందరు దళారులు ఒక్కటై నకిలీ పేర్లతో పాస్ పుస్తకాలను తయారు చేసి ఒక్కొక్కరు 20 నుంచి 30 వరకు కనెక్షన్లు ఇళ్లల్లో పెట్టుకొంటున్నారు. ఈ వ్యవహారం అంతా రెండేళ్లుగా సాగుతున్నా సంబంధిత అధికారులు ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. దీంతో సీలేరుకు గ్యాస్ వచ్చిందంటే దళారుల సందడి ఎక్కువవుతుంది. ఒక్కో ఇంటిలో ఒకే పేరుపై నాలుగైదు కనెక్షన్లు, దానికి తోడు దళారుల వద్ద అధికంగా కనెక్షన్లు ఉండడంతో నిజమైన లబ్దిదారులకు గ్యాస్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలే చింతపల్లి గ్యాస్ గొడౌన్లో అవినీతి వెలు గు చూడడానికి ప్రధాన కారణం సీలేరే. మరణించిన, ఊరు విడిచి వెళ్ళిన వారు, బదిలీ అయిన ఉద్యోగుల పేరిట కనెక్షన్లు ముందుగా తీసుకొని దళారులు దళారులు దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి నెలకు రెండుసార్లు గ్యాస్ సరఫరాచేయాల్సి ఉంది. అయితే ఇక్కడ దళారులు చింతపల్లి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు కుమ్మక్కై గ్యాస్ సరఫరాలో జాప్యం చేస్తారు. ఈలోగా వినియోగదారుల అవసరాన్ని సాకుగా తీసుకుని తమ వద్ద ఉన్న సిలిండర్లను అధిక ధరలకు అమ్మి దళారులు సొమ్ము చేసుకుంటారు. సబ్సిడీ రేటు రూ.420గా ఉండగా, దళారులు రూ.1000 నుంచి రూ.2 వేల వరకు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. కనెక్షన్ ఉన్నా...నో గ్యాస్ ఆదివారం సీలేరులోని వినియోగదారుల కోసం 320 గ్యాస్ సిలిండర్లు సరఫరా అయ్యాయి. అయితే సరఫరా అయిన గ్యాస్ దళారుల పాలబడింది. లబ్దిదారుల్లో సగం మందికి కూడా గ్యాస్ అందకపోవడం గమనార్హం. అంటే ఒక్కొక్కరి వద్ద దగ్గర పదికి మించి బండలు ఉండడంతో వారంతా గ్యాస్‌ను సబ్సిడీ రేటుకు దక్కించుకున్నారు. వచ్చిన గ్యాస్‌లో సగం వారే తన్నుకుపోవడంతో మిగిలిన లబ్దిదారులకు గ్యాస్ అందక బిక్కమొగం వేశారు. రెండు నెలలుగా ఎదురు చూసినా తీరా గ్యాస్ వచ్చినా తమకు అందక గంటల తరబడి వేచి ఉండి ఖాళీ బండలతో లబ్దిదారులు ఉసూరుమంటూ తిరిగి వెళ్లారు. అధిక ధరలకు ఒడిషా తరలింపు అధిక ధరల కారణంగా స్థానికంగా డిమాండ్ లేకపోతే తమ వద్ద గల సిలిండర్లను దళారులు యథేచ్ఛగా పొరుగునే ఉన్న ఒడిషాకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా చిత్రకొండ, బలిమెల, మల్కన్‌గిరి వరకు బహిరంగంగా వ్యాన్లలో గ్యాస్ సిలిండర్లను తరలించడం ఇక్కడ నిత్యకృత్యం. ఇలా యథేచ్ఛగా సబ్సిడీ గ్యాస్ పక్కదారి పడుతుంటే పౌర సరఫరా అధికారులు మిన్నకుండిపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు గ్యాస్ అక్రమాలను దృష్టిలో పెట్టుకొని చింతపల్లిలో, సీలేరు దళారుల చేతిలో ఉన్న నకిలీ కనెక్షన్లు గుర్తించి నిజమైన లబ్దిదారులకు గ్యాస్ అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
ఇంకా ‘ఆధార’మేనా?
సాక్షి, సంగారెడ్డి: వంట గ్యాస్‌కు ఆధార్ అనుసంధానంపై గడబిడ కొనసాగుతోంది. నిబంధనలను ఉపసంహరించుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి నెల రోజులవుతున్నా.. ఇంకా ఆ మేరకు ఆదేశాలు జారీ కాలేదు. దీంతో వినియోగదారుల్లో అయోమయం నెలకొంది. ఒకవేళ ‘ఆధార్’ లింక్ కొనసాగిస్తే వినియోగదారుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. ఇదిలా ఉండగా వంట గ్యాస్‌కు ఆధార్ కార్డు అనుసంధానం గడువు శుక్రవారంతో ముగియనుంది. ఆ తర్వాత గ్యాస్ కొనే వినియోగదారులు రాయతీ లేని వంట గ్యాస్‌ను కొనాల్సి ఉంటుంది. ఆధార్ అనుసంధానం నిబంధనను ఉపసంహరించుకుంటున్నట్లు యూపీఏ సర్కార్ ప్రకటన చేసినా ఆదేశాలు మాత్రం జారీ కాలేదు. శుక్రవారం ఆధార్‌తో అనుసంధానం కాని వినియోగదారులకు రాయితీపై వంట గ్యాస్ సరఫరా నిలిచిపోనుం ది. రాయితీపై రూ.441కు లభిస్తున్న వంట గ్యాస్ రిఫిల్ కోసం ఈ వినియోగదారులు రూ. 1,220.50 చెల్లించాల్సిందే. ప్రభుత్వం నగదు బదిలీ పథకం కింద చెల్లిస్తున్న రూ. 740 రాయితీని నష్టపోవాల్సి ఉంటుంది. జిల్లాలో 66 శాతం వినియోగదారులు ఇంకా ఆధార్‌తో అనుసంధానం కాలేదు. ఆధార్ ఉపసంహరణపై ఉత్తర్వులు జారీ అయ్యేవరకు వీరికి ఇక్కట్లు తప్పేటట్లు లేవు. ఉత్తర్వులు అందితేనే సబ్సిడీపై గ్యాస్ సరఫరా చేస్తామని గ్యాస్ కంపెనీలు, ఏజెన్సీలు తేల్చి చెప్పుతున్నాయి. ‘ఢీ’లర్లు ఆధార్‌తో అనుసంధానానికి గడువు ముగియకముందే కొన్ని గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు సబ్సిడీపై గ్యాస్ విక్రయాలను నిలిపివేశాయి. గ్యాస్ కంపెనీల నుంచి సబ్సిడీ గ్యాస్ సరఫరా లేదని సాకులు చెప్పి ఆధార్‌తో అనుసంధానం కాని వినియోగదారులను తిప్పి పంపిస్తున్నారు. గ్యాస్ కంపెనీలు డీలర్లకు సాధారణ సబ్సిడీ, నాన్ సబ్సిడీ అనే రెండు వేర్వేరు కోటాల కింద గ్యాస్‌ను సరఫరా చేస్తున్నాయి. నాన్ సబ్సిడీ కింద సరఫరా చేసే గ్యాస్‌ను ఆధార్‌తో అనుసంధానమైన వినియోగదారులకు విక్రయిస్తుండగా.. సబ్సిడీ గ్యాస్‌ను అనుసంధానం కాని వినియోగదారులకు అందజేస్తున్నారు. అయితే, కొందరు డీలర్లు కంపెనీల నుంచి సబ్సిడీ కోటా గ్యాస్ కొనుగోళ్లను అప్పుడే నిలిపివేసి కేవలం నాన్ సబ్సిడీ గ్యాస్‌ను మాత్రమే వినియోగదారులకు సరఫరా చేస్తున్నాయి. దీంతో ఆధార్‌తో అనుసంధానం కాని వినియోగదారులు తప్పనిసరి పరిస్థితిలో బ్లాక్‌లో గ్యాస్‌ను కొనుగోలు చేసి నష్టపోవాల్సి వస్తోంది. -
ఆధార్.. బేజార్
జిల్లాలో 56 డిస్ట్రిబ్యూటర్ల పరిధిలోని ఇండెన్, హెచ్‌పీ, భారత్ గ్యాస్ కంపెనీలకు చెందిన 6,18575 వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కా గా వీటిలో గ్యాస్ కంపెనీలతో 2,78,873 మంది అంటే 45.08 శా తం మంది వినియోగదారులు ఆధార్ అ నుసంధానం చేసుకున్నారు. అదే విధంగా 1,53,453 మంది అంటే 24.81 శాతం వినియోగదారులు బ్యాంకులో ఆధార్ అనుసంధానం చేసుకున్నారు. మరో 50 వేల మంది వరకు ఆయా గ్యాస్ ఏజెన్సీలలో అనుసంధానం కోసం దరఖాస్తులు సమర్పించినా వారికి ఇంతవరకు చేయలేదు. ఈ నెల 31వతేదీలోగా ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోకుంటే సబ్సిడీ వం టగ్యాస్ అందే అవకాశాలు లేవు. ప్రస్తుతం వంట గ్యాస్‌కు ఆధార్ అనుసంధానం చేసుకోని వారు *445 చెల్లిస్తు న్నారు. అలాగే అనుసంధానం చేసుకున్న వారు మాత్రం *1327 చెల్లిస్తున్నారు. అనుసంధానం చేసుకున్న వారి బ్యాంకు ఖాతాలో నగదు బదిలీ పథకం ద్వారా *833 సబ్సిడీ జమఅవుతోంది. కా నీ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వినియోగదారులందరూ 1327 రూపాయలు చెల్లిం చాల్సి ఉంది. అయితే ఆధార్ కార్డు అనుసంధానం చేసుకున్న వారికి మాత్రమే ప్ర భుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ.. బ్యాంకు ఖాతాలోకి వస్తుంది. అనుసంధానం చేసుకోని వారిపై మాత్రం భారం పడనుంది. అనుసంధానం కాకుంటే.. గ్యాస్ వినియోగదారులు సంబంధిత గ్యాస్ ఎజెన్సీ వద్ద, బాం్యకులో ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోకుంటే పేదలపై భారం పడే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు మూడు పర్యాయాలు గడువులను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఆధార్ అనుసంధానం కాకుంటే గ్యాస్ వినియోగదారులు ఒక్కసారి రీఫిల్లింగ్ చేసుకుంటే 833 రూపాయల అదనపు భారం పడుతుంది. -
జనంపై గ్యాస్ ‘బండ’!
దేనికైనా సమయమూ, సందర్భమూ ఉండాలంటారు. యూపీఏ ప్రభుత్వానికి ఆ ఔచిత్యం కూడా లోపించింది. గత ఏడాది ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని అలసి సొలసి... కనీసం భవిష్యత్తు అయినా బాగుండాలని అందరూ ఆకాంక్షించే నూతన సంవత్సరాగమన వేళ వంటగ్యాస్ ధరను భారీగా పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది. సామాన్యుడి పేరు చెప్పుకుని అధికారంలోకొచ్చిన కేంద్ర సర్కారు సబ్సిడీ సిలెండరు, సబ్సిడీయేతర సిలెండరు అంటూ రెండు రకాలను సృష్టించి వాటికి చెరో రకం ధరనూ అమల్లోకి తెచ్చి...వాటిని క్రమబద్ధంగా పెంచుతూ జన జీవితాలతో ఆటలాడుకోవడం మొదలుపెట్టి చాన్నాళ్లయింది. నొప్పి తెలియకుండా చావబాదడానికి ఎంచుకున్న ఈ మార్గంలో సామాన్య వినియోగదారులు దేని ధర ఎంత పెరిగిందో, తమ జేబులు ఇకపై ఏమేరకు ఖాళీ కాబోతున్నాయో తెలుసుకోలేక అయోమయంలో పడతారని... తీరా గ్యాస్ బండ ఇంటికొచ్చి తలుపు తట్టేవేళకు అంతా అర్ధమై చ చ్చినట్టు చెల్లిస్తారని ఏలినవారి అంచనా. ఇప్పుడు సబ్సిడీయేతర సిలిండరు ధర ఒకేసారి రూ. 215 మేర పెరిగింది. అంటే, ఇంతవరకూ రూ. 1,112.50 ఉన్న సిలెండరును ఇకపై రూ. 1,327.50 పెట్టి కొనుక్కోవాలన్న మాట! సబ్సిడీ సిలిండరు ధరను రూ. 10 పెంచారు. గత జూన్ వరకూ సబ్సిడీ సిలిండర్లపై పరిమితి ఉండేది కాదు గనుక సబ్సిడీయేతర సిలిండరు ధర ఎంత పెరిగినా ఎవరికీ పట్టేది కాదు. అటు తర్వాత నగదు బదిలీ పథకాన్ని అమల్లోకి తెచ్చి సబ్సిడీ సిలిండర్లను ఏడాది కాలంలో తొమ్మిది మాత్రమే ఇస్తామని ప్రకటించాక ‘గ్యాస్ మంట’ అందరినీ తాకడం మొదలైంది. పదో సిలిండరుతో మొదలై ఇక ఏడాదికాలంలో ఎన్నయితే అన్నీ దాదాపు మూడురెట్ల ధర చెల్లించి కొనాల్సిందేనని చెప్పడంవల్ల మధ్యతరగతి, పేదవర్గాల ప్రజలు అల్లల్లాడుతున్నారు. వాస్తవానికి పదో సిలిండరునుంచి మాత్రమే సబ్సిడీయేతర ధర వర్తిస్తుందని చెప్పడం అర్ధ సత్యం మాత్రమే. ఎంపికచేసిన కొన్ని జిల్లాల్లో ఆధార్ కార్డున్న వారికే నగదు బదిలీ పథకం వర్తింపజేస్తామని, సబ్సిడీ మొత్తాన్ని చెల్లిస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ జిల్లాల్లో ఆధార్ కార్డు కోసం వివరాలు అందించినా ఆ కార్డులు రానివారున్నారు. అలాగే, అసలు నమోదే చేయించుకోలేనివారున్నారు. బ్యాంకు ఖాతాలు ప్రారంభించలేని అశక్తతలో ఉన్నవారున్నారు. ఆధార్ కార్డు లేని ఎల్పీజీ కనెక్షన్లను బోగస్ అని నిర్ధారించడానికి, సబ్సిడీ ఎగ్గొట్టడానికి ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 28.29 లక్షల వంటగ్యాస్ కనెక్షన్లుండగా అందులో 9.03 లక్షల మందికి సబ్సిడీ వర్తించడంలేదు. ఇలాంటివారంతా ఏ క్యాటగిరీలతో సంబంధం లేకుండా ఇప్పుడు అధిక మొత్తం చెల్లించి సిలిండర్లు కొనుక్కోవాల్సి వస్తోంది. ఇక ఆధార్ కార్డు ఉన్నా పదో సిలిండరును అత్యధిక ధర చెల్లించి తీసుకోవడం చాలామందికి కష్టమవుతున్నది. ఒక్కసారి అంత మొత్తం ఇవ్వడం అరకొర వేతనాలపైనా, జీతాలపైనా ఆధారపడే కుటుంబాలకు ఎంత కష్టమో పాలకులకు అర్ధం కావడం లేదు. నెలకు సంపాదించే మొత్తంలో దాదాపు 20 శాతం ఒక్క సిలిండరుకే ఖర్చయిపోతుంటే ఆ కుటుంబాలు ఇక ఏం వండుకోవాలి? ఏం తినాలి? పోనీ, ఏదోవిధంగా అంత సొమ్ము చెల్లించి సిలిండరు సుకుంటున్నవారికి వెనువెంటనే ఖాతాల్లోకి ఆ మొత్తం బదిలీ కావడంలేదు. తీసుకున్న ఎన్నో నెలలకు డబ్బులు వస్తున్నవారు కొందరైతే, ఎంతకాలమైనా రానివారు కూడా ఉంటున్నారు. అసలు సిలిండరు తీసుకోనివారికి సైతం ‘మీ ఖాతాలోకి సబ్సిడీ సొమ్ము బదిలీ అయింద’ంటూ ఎస్సెమ్మెస్‌లు వస్తున్నాయి. ఇది సరిగాలేదని అర్ధమై ఆధార్ గడువును కేంద్రం ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ పోతున్నది. ఇంత నాసిరకంగా, ఇంత అస్తవ్యస్థంగా అమలవుతున్న నగదు బదిలీ పథకాన్ని చూపించి, చిత్తమొచ్చినట్టు ధరలు పెంచుకుంటూ పోవడం ఆశ్చర్యకలిగిస్తుంది. వాణిజ్యావసరాల కోసం వినియోగించే సిలిండరు ధర రూ. 1882.50 ఒక్కసారిగా రూ. 2,268కి పెరిగింది. ఈ భారం కూడా అంతిమంగా సాధారణ ప్రజానీకంపైనే పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా దాదాపు 15 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయని అంచనా. మన రాష్ట్రంలో ఈ సంఖ్య కోటి 60 లక్షలుంటుందని గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 55 శాతం కుటుంబాలు ఏడాదికి తొమ్మిది సిలిండర్లను మించి వినియోగిస్తాయని నిపుణుల అంచనా. ఇలా చూస్తే ప్రజలపై ఎన్నివందల కోట్ల అదనపు భారం పడిందో అర్ధం చేసుకోవచ్చు. కేంద్రం నిర్ణీత కాలవ్యవధిలో ప్రజలపై మోపే భారంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా వ్యాట్ రూపంలో అదనంగా వడ్డిస్తోంది. ఇదంతా సామాన్యులకు తడిసిమోపెడవుతున్నది. సామాన్యులెదుర్కొంటున్న ఇబ్బందులపై అవగాహన ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇలా భారం పడిన సందర్భంలో తానే కాపుగాశారు. కేంద్రం సిలిండర్ ధరను రూ. 50 పెంచినప్పుడు ఆ పెరిగిన భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే స్వీకరిస్తుందని ప్రకటించిన పెద్ద మనసు ఆయనది. ఆ పెంపును రూ. 25కు తగ్గించాక కూడా ఆయన దాన్ని కొనసాగించారు. కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఆ సబ్సిడీని ఎత్తేయడమే కాదు...అదనంగా వ్యాట్ భారం మోపింది. వంటగ్యాస్, ఇతర పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచే ప్రక్రియలో పారదర్శకతకు కాస్తయినా చోటివ్వాలని పాలకులకు తోచడంలేదు. చమురు సంస్థలను ముందుకు తోసి సాగిస్తున్న ఈ తతంగంలో పైకి కనబడని కంతలు చాలా ఉన్నాయి. సుంకాల పేరుమీదా, పన్నులపేరుమీదా అటు కేంద్రమూ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలూ నిలువుదోపిడీ చేస్తూ... కేవలం సబ్సిడీల కారణంగానే చమురు కంపెనీలకు నష్టం వచ్చిపడిపోతున్నట్టు నాటకాలాడుతున్నాయి. ఇలాంటి కపటనాటకాలకు ప్రభుత్వాలు ఇక స్వస్తి చెప్పి పెంచిన భారాన్ని వెంటనే తగ్గించాలి. లేదంటే ప్రజాగ్రహాన్ని అవి చవిచూడక తప్పదు. -
నేటి నుంచి నగదు బదిలీ
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సబ్సిడీ గ్యాస్ వినియోగదారులకు నగదు బదిలీ పథకం జనవరి 1వ తేదీ నుంచి అమలు కానుందని జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ పథకం అమల్లోకి వచ్చినా వినియోగదారులు కంగారుపడాల్సిన అవసరం లేదన్నారు. గ్రేస్ పీరియడ్ నెల రోజుల వరకు ఉంటుందని తెలిపారు. ఈలోగా ఆధార్, బ్యాంకు అకౌంట్ , సెల్‌ఫోన్ నంబర్లు సంబంధిత గ్యాస్ డీలర్లకు ఇవ్వాలని పేర్కొన్నారు. బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేయడం పూర్తి చేసిన వినియోగదారులకు ఇప్పటికే ఒక సిలిండర్ సబ్సిడీ బ్యాంకు ఖాతాలకు జమ అయి ఉంటుందని తెలిపారు. జమ కాకపోయివుంటే త్వరలో ఒక సిలిండర్ సబ్సిడీ అడ్వాన్స్‌గా జమ అవుతుందని తెలిపారు. గ్రేస్ పీరియడ్ పూర్తి అయ్యేలోగా వినియోగదారులు ఆధార్, బ్యాంకు ఖాతాలు ఇవ్వకపోతే పూర్తి ధరతో సిలిండర్ కొనాల్సి వస్తుందని చెప్పారు. జిల్లాలో 42 లక్షల జనాభా ఉండగా, ఇందులో 32 లక్షల మందికి ఆధార్ నంబర్లు వచ్చాయని తెలిపారు. వివిధ జిల్లాలతో పోలిస్తే కర్నూలు జిల్లాలో ఆధార్‌లో పురోగతి ఎక్కువగా ఉందని వివరించారు. జిల్లాలో మొత్తం గ్యాస్ వినియోగదారులు 5,53,481 మంది ఉండగా, వీరిలో 2,28,646 మంది నుంచి ఆధార్ నెంబర్లు 2,08,170 మంది నుంచి బ్యాంకు ఖాతాలు సేకరించామని వివరించారు. మరో 67,138 మంది వినియోగదారుల నుంచి ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్లు సేకరించామని వివరించారు. ఆధార్ నమోదు అయి యుఐడీ రాకపోయి ఉంటే అటువంటివారికి యుఐడీ నంబర్లు తెప్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. నగదు బదిలీ పథకంతో గ్యాస్ వినియోగదారులకు ఎవ్వరికీ ఎటువంటి నష్టం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆధార్, బ్యాంకు ఖాతాలు ఇవ్వని రైతులు వెంటనే ఈ వివరాలతో పాటు సెల్‌ఫోన్ నంబర్ కూడా గ్యాస్ డీలర్లకు ఇచ్చి సహకరించాలని కోరారు. గ్యాస్ వినియోగదారుల నగదు బదిలీ పథకం అమలుపై మరింత చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. -
‘ఆధార్’తో ఇబ్బందిపెట్టొద్దు కేంద్రానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఆధార్ కార్డు వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని హైకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఎవరో కొందరు ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేస్తున్నారనే నెపంతో ఆధార్ ప్రాజెక్టును తీసుకువచ్చి మెజారిటీ ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంతమాత్రం సరికాదని కేంద్రానికి హితవు పలికింది. నగదు బదిలీకి ఆధార్‌కు లింక్ పెట్టిన కేంద్ర ప్రభుత్వానికి అసలు దేశంలో ఎంతమందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయో తెలుసా..? అంటూ ప్రశ్నించింది. ఆధార్ ఉంటేనే సబ్సిడీ గ్యాస్ సరఫరా చేస్తుండడాన్ని సవాలు చేస్తూ హైకోర్టు న్యాయవాది వై.బాలాజీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. సంక్షేమ పథకాలు దుర్వినియోగం అవుతున్నందు వల్లే నగదు బదిలీ పథకాన్ని తీసుకురావడం జరిగిందని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ పొన్నం అశోక్‌గౌడ్ తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం... ఎవరో కొంత మంది దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, మెజారిటీ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తారా..? అంటూ ప్రశ్నించింది. ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని, ఇదే అంశంపై ఇంతకు ముందే ఆదేశాలు జారీ చేసినందున ఈ పిటిషన్‌పై ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేమని పేర్కొంది.