కడప అర్బన్ : మీకేమీ భయం లేదు.. మీకు అండగా మేముంటాం.. రోజుకు రూ. 2 వేలు కూలీ ఇస్తాం. ఒకవేళ మీకేమైనా జరిగితే రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలు ఇస్తాం.. ఎర్రచందనం కూలీలతో స్మగర్లు చేసుకుంటున్న అగ్రిమెంట్ ఇది. ప్రపంచంలోనే అరుదైన, నాణ్యమైన ఎర్రచందనం జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో లభిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను ఆపేందుకు 2001 నుంచి పోలీసులు, అటవీ శాఖ అధికారులు శతవిధాలా కృషి చేస్తూనే ఉన్నారు. ఐదారేళ్లుగా ఎర్రచందనం స్మగ్లింగ్ పెరిగింది.
మండల స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి స్మగ్లర్లు ఎదిగారు. కొందరు పోలీసులు, అటవీ సిబ్బంది వీరికి సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2001 నుంచి ఇప్పటివరకు కడప, ప్రొద్దుటూరు, రాజంపేట డివిజన్‌లలోని అన్ని ఫారెస్టు కార్యాలయాల పరిధిలో దాదాపు 2500 టన్నుల మేర ఎర్రచందనం దుంగలను గోడౌన్‌లో భద్రపరిచారు.
అయితే 5 నుంచి 10 రెట్లు అనగా పదివేల టన్నులకు పైగా ఎర్రచందనం అక్రమ రవాణా యధేచ్చగా జరిగిందని చెప్పవచ్చు. అడవుల నుంచి ఎర్రచందనం దుంగలను అనంతపురం మీదుగా బెంగళూరుకు, అక్కడి నుంచి చెన్నైకి చేరవేస్తున్నారు. చెన్నై నుంచి నేరుగా విదేశాలకు షిప్‌ల ద్వారా గానీ, కంటైనర్‌లలో గ్రానైట్స్, ప్లాస్టిక్ పైపుల మాటున కోల్‌కతాకు జాతీయ రహదారుల్లో తరలిస్తున్నారు. చెన్నై, కోల్‌కతా, చైనా, దుబాయ్‌లకు ఎర్రచందనం చేరవేయడం స్మగ్లర్లకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది.
స్మగ్లర్ల ఆఫర్లకు తలాడిస్తున్న కూలీలు
స్థానికులకు బదులుగా తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సంబంధించిన ఎర్రకూలీలను తీసుకుని రావడం రెండు సంవత్సరాలుగా మొదలైంది. ఒక్కో ‘ఎర్ర’ కూలీకి రోజుకు రూ. 2వేలు కూలీగా ఇస్తామని తీసుకొస్తున్నారు. ఆరు నెలలుగా ఎర్రకూలీలు తమిళనాడు నుంచి వచ్చి యధేచ్చగా ఎర్రదుంగలను నరికివేస్తున్నారు. ఈ క్రమం లో అనేక సార్లు పోలీసులకు, ఎర్రకూలీల మధ్య దాడు లు, ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు అటవీ సిబ్బంది, ఇద్దరు ఎర్రకూలీలు ఇటీవల మృతి చెందారు. ఇదిలా ఉండగా పోలీసుల కాల్పుల వల్ల ఏదైనా జరిగితే రూ. 5 నుంచి 10 లక్షల వరకు ఎక్స్‌గ్రేషి యా చెల్లిస్తామని అగ్రిమెంట్ చేయించుకుని తమిళనాడు, కేరళ నుంచి కూలీలకు తీసుకొస్తున్నట్లు సమాచారం.
మేమున్నాం..
Published Sun, Aug 3 2014 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 11:17 AM
Advertisement
Advertisement