మీ కంటే పెద్ద రౌడీని : చంద్రబాబు | I'm a Big Rowdy than you : Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

మీ కంటే పెద్ద రౌడీని : చంద్రబాబు

Published Tue, Sep 10 2013 12:47 PM | Last Updated on Fri, Aug 10 2018 7:58 PM

మీ కంటే పెద్ద రౌడీని : చంద్రబాబు - Sakshi

మీ కంటే పెద్ద రౌడీని : చంద్రబాబు

కంభంపాడు : ఆత్మగౌరవ యాత్ర పేరుతో రాష్ట్రంలో పర్యటిస్తున్న చంద్రబాబునాయుడుకు అడుగడుగునా అవాంతరాలు ఎదురువుతున్నాయి.   కృష్ణా జిల్లా ఏ.కొండూరు మండలం కంభంపాడు గ్రామస్తులు సోమవారం రాత్రి బాబు యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు.  ఆరోపణలు మాని అసలు  రాష్ట్ర విభజనపై వైఖరి ఏంటో స్పష్టం చేయాలని వారు చంద్రబాబును డిమాండ్‌ చేశారు.  

చంద్రబాబుకు వ్యతిరేకంగా గట్టిగా నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు...గ్రామస్తులపై కన్నెర్రజేశారు.  రౌడీలు, గుండాల్లా వ్యవహరిస్తున్నారని వారిని దుర్భాషలాడారు.  మీ కంటే పెద్ద రౌడీని.... తోకలు కత్తిరిస్తానంటూ కంభంపాడు వాసుల్ని హెచ్చరించారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు,  ప్రైవేట్‌  సెక్యూరిటీ సిబ్బంది గ్రామస్తుల్ని దూరం తీసుకెళ్లారు.  అయితే చంద్రబాబును నిలదీసిన గ్రామస్తులపై స్థానిక టీడీపీ నేత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. బాబు ఆదేశాలతోనే తమపై కేసు పెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement