రె‘వెన్ను’లో వణుకు
Published Wed, Jan 1 2014 4:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM
చీపురుపల్లి, న్యూస్‌లైన్: చీపురుపల్లి తహశీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న రెవెన్యూ సిబ్బం ది అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తట్టుకోలేక వణికిపోతున్నారు. నాయకులు చెప్పింది చేయలేక, చేయకుండా ఉండలేక సతమతవుతున్నారు. దీంతోవారి పరిస్థితి ‘ముందుగొయ్యి... వెనుకనుయ్యి’ అన్నచందంగా తయారయింది. అసలే పీసీసీ చీఫ్, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం..అందులోనూ నియోజకవర్గ కేంద్రమైన చీపురుపల్లి మండలంలో విధులు నిర్వహించే అధికారులకు ఒత్తిళ్లు ఉండడం సహజమే అని అనుకోవచ్చు. కానీ స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో పని చే స్తున్న అధికారులు ఆస్థాయిని దాటిపోయి ఒత్తి ళ్లు ఎదుర్కొంటున్నారు.
దీంతో భీతిల్లి మూకుమ్మడిగా సెల వుపెట్టేంత వరకూ సిద్ధమవుతున్నారు. ఒకవేళ మూకుమ్మడి సెలవులు వీలుకాకపోతే ఎలాగైనాఇక్కడి నుంచి బదిలీ చేయించుకుని బతికి బట్టకట్టాలని భావిస్తున్నారు. ఆ మేరకు ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారి నుంచి తహశీల్దార్ వరకు అం దరిదీ అదే పరి స్థితి. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రతి చిన్న పనికి సర్పంచ్ నుంచి మంత్రి బంధువుల వర కూ నేతలందరూ ఒత్తిడి తీసుకువస్తున్నారని అధికారులు వాపోతున్నారు. నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ అధికార పార్టీ కు చెందిన కార్యకర్తలు పనులు పూర్తి చేయాలంటూ హుకుంజారీచేస్తున్నట్లు తెలిసింది.
అం దులోభాగంగానే భూములు లేనివారికి భూము లు ఉన్నట్లురికార్డులు సృష్టించాలని, భూములు లేని వారికి కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, డి-పట్టా భూములను ధనికుల పేర్లుతో ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. అసలే కొత్తగా విధుల్లో చేరామని, తమకు బోలెడంత భవిష్యత్తు ఉందని, వీరు చెప్పినవన్నీ చేస్తే ఉద్యోగాలు ఊడిపోతాయని గ్రామ రెవెన్యూ అధికారులు వేడుకుంటున్నా అధికార పార్టీ నేతలు వినిపించుకోవడం లేదు. దీనికి తోడు తహశీల్దార్ ను కూడా బెదిరిస్తున్నారు. ఎక్కడికీ వెళ్లరాదని, ఏ తనిఖీలు చేయొద్దని, సీట్లోనే కూర్చొని, వచ్చిన ఫైళ్లపై సంతకా లు చేసుకోవాలంటూ నేతలు ఆర్డర్లు జారీ చేస్తున్నారు. తహశీల్దార్ టి.రామకృష్ణ సైతం ప్రొహిబిషన్‌లో ఉండడంతో ఏం చేయా లో తెలియక సతమతమవుతూ విధులు నిర్వహిస్తున్నారు. ఈ బాధలన్నీ భరించే కంటే ఎక్కడికైనా బదిలీ చేసుకుని వెళ్లిపోతే మంచిదని వారంతా భావిస్తున్నారు.
Advertisement