మంత్రులు, {పజాప్రతినిధుల వ్యాఖ్య
{పముఖులకు స్వామీజీ ఆశీర్వచనాలు
పీఠాధిపతులతో కళకళలాడిన మహాలక్ష్మీ యాగశాల
నేడు లక్ష్మీ ఆవిర్భావం, కల్యాణోత్సవాలతో ముగియనున్న యాగం
తిరుపతి గాంధీరోడ్డు : తిరుపతిలో నిర్వహిస్తున్న మహా లక్ష్మీయాగం లాంటివి దేశ చరిత్రలో అపూర్వ ఘట్టాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అభివర్ణించారు. బాష్యం కార్లు మఠం పీఠాధిపతి అనంత శ్రీవిభూషిత శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి నిర్వహిస్తున్న 16వ మహాలక్ష్మీయాగానికి గురువారం కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి మాణిక్యాలరావు దంపతులు హాజరయ్యారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గల్లా అరుణకుమారి తదితరులు పాల్గొని మహాలక్ష్మీ అమ్మవారికి పూజలు చేయించారు. దత్తాత్రేయను రామచంద్ర రామానుజ జీయర్ స్వామీజీ సత్కరించారు. మంత్రి మాట్లాడుతూ యజ్ఞాలతో వాతావరణంలో మార్పులు వచ్చి సమాజానికి అనుకూలంగా ఉంటాయని అన్నారు. లోకకల్యాణం కోసం జీవితాలను త్యాగం చేసిన త్యాగమూర్తులు స్వామీలు అని పేర్కొన్నారు.
యాగంలో పాల్గొని సమాజంలో పవిత్రతను కాపాడుకోవలని సూచించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో వర్షాలు బాగా కురిసి శుభం కలగాలని ఆకాంక్షించారు. స్వామీజీల సందేశాలను పాటించాలని కోరారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అతివృష్టి, అనావృష్టి లేకుండా పర్యావరణ సమతుల్యత కలిగి ఉండాలని ఆకాంక్షించారు. దేశ సౌభాగ్యం కోసం జీయర్ స్వామి నిర్వహిస్తున్న ఈయాగం ద్వారా మంచి ఫలితాలు వస్తాయన్నారు. యాగం ఏర్పాటు చేసిన స్వామీజీకి కృతజ్ఞతలు తెలియజేశారు. జియ్యర్‌స్వామి మాట్లాడుతూ లోకకల్యాణం కోసం ఏ కార్యక్రమం చేపట్టినా భగవంతుడు హర్షిస్తాడని తెలిపారు. యాగం కోసం సంవత్సరమంతా భిక్ష చేసి, తల్లి సంతానమైన ప్రజలందరినీ భాగస్వాములను చేశామని అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు యాగానికి వచ్చిన మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చదలవాడ దంపతులు, టీటీడీ మాజీ కార్యనిర్వహణాధికారి పీవీఆర్‌కే.ప్రసాద్, బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి, టీడీపీ జిల్లా వైద్య విభాగం అధ్యక్షురాలు రాళ్లపల్లి సుధారాణి, బీజేపీ నాయకుడు కోలా ఆనంద్, కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, అహోబిలం మ ఠం రామనుజజీయర్, అష్టాక్షరి రామానుజ జీయర్, దేవరాజరామానుజ జీయర్, చిన్న జీయర్ తల్లి అండాళమ్మ పాల్గొన్నారు. గురువారం ఉదయం యథావిధిగా గోవిందపెరుమాళ్, లక్ష్మీ అమ్మవార్లకు శాత్తుమురై, అమ్మవారి హవనం కార్యక్రమాలతో పాటు వేదపారాయణ ఉచ్ఛారణ జరిగింది. ప్రవచనం, కోటికుంకుమ, కోటిమల్లెల, కోటి తులసి అర్చనలు జరిగాయి. కోటికుంకుమ అర్చనలు గురువారంతో ముగిశాయి.
నేడు 1008 కేజీల ముత్యాలతో కల్యాణ మహోత్సవం
యాగంలో ఆఖరు రోజైన శుక్రవారం మహాలక్ష్మీ అమ్మవారి ఆవిర్భావం, కల్యాణోత్సవాలు జరుగుతాయని యా గం కన్వీనరు కల్యాణ చక్రవర్తిస్వామి తెలిపారు. ఉదయం ఆరు గంటలకు సంకీర్తన, ఏడు గంటలకు క్షీరార్ణవ మండప సందర్శన ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో 108 వెండి గంగాళాలతో గోవింద పెరుమాళ్లుకు పాయసం నివేదన ఉంటుందని తెలిపారు. సా యంత్రం వైభవంగా కల్యాణ మహోత్స వం జరుగుతుందని పేర్కొన్నారు.
అపూర్వ ఘట్టాలు యాగాలు
Published Fri, Apr 3 2015 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 11:45 PM
Advertisement
Advertisement