Central Minister Bandaru Dattatreya
-
వచ్చే ఎన్నికల్లో మాకు నోటిచ్చి ఓటేస్తారు
► పెద్ద నోట్ల రద్దుపై ప్రజల నుంచి అనూహ్య స్పందన ► విలేకర్ల సమావేశంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ హైదరాబాద్: దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దు అంశంపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దత్తాత్రేయ ఏం చెప్పారంటే 'సామాన్యులు ఇబ్బంది పడుతున్నా... ప్రధాని మోదీ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. నలభై ఏళ్ల క్రితం జనతా పార్టీకి ప్రజలు నోటిచ్చి ఓటేశారు. వచ్చే ఎన్నికల్లో ఇదే పరిస్థితి పునరావృతమవుతుంది. మా ప్రభుత్వాన్ని రోజురోజుకు ప్రజాధరణ పెరుగుతోంది. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో 78శాతం ప్రజలు మోదీకి మద్దతు పలికారు. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు ఇది రెట్టింపు’’ అని పేర్కొన్నారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు, కార్మిక వర్గాలకు కొంత అసౌకర్యం కలిగిన మాట వాస్తవమేనన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని దత్తాత్రేయ చెప్పారు. కార్మికుల నివాస ప్రాంతాలు, వ్యాపార సముదాయాలు, మార్కెట్ల వద్ద మొబైల్ ఏటీఎం సౌకర్యాన్ని విస్తృతం చేస్తామన్నారు. సోమవారం మధ్యాహ్నం ప్రధాని మోదీని కలవనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రధానికి వివరిస్తానని దత్తాత్రేయ అన్నారు. నోట్ల రద్దు అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా సామాజిక నేపథ్యంలో స్వీకరించాలని, నల్లడబ్బును నిర్మూలిస్తే దేశాభివృద్ధి మరింత పరుగులు పెడుతుందన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ అంశాన్ని గమనించాలని సూచించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు నోట్ల రద్దుపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పించాలని దత్తాత్రేయ పిలుపునిచ్చారు. -
పవన్‌ను కలిసిన కేంద్ర మంత్రి
హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో కలిశారు. కాటమరాయుడు షూటింగ్లో బిజీగా ఉన్న పవన్‌ను కలిసిన దత్తాత్రేయ తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరారు. పవన్‌ను ఆహ్వానించేందుకు దత్తాత్రేయ వెంట బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా ఉన్నారు. -
పల్లెల ప్రగతితోనే దేశాభివృద్ధి
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ చిన్నకోడూరు: పల్లెలు బాగుంటేనే దేశం అన్నివిధాలా అభివృద్ధి చెందుతుందని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. గ్రామ్ ఉదయ్‌సే భారత్ ఉదయ్ నిర్మాణ్ కార్యక్రమంలో భాగంగా శనివారం మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం చెర్ల అంకిరెడ్డిపల్లిలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు కేంద్ర ప్రభు త్వ సహకారాన్ని అందిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం పల్లెల్లో రోడ్ల అభివృద్ధికి రూ. 28 కోట్లు, రైతు సంక్షేమం కోసం రూ. 21 లక్షల కోట్లు కేటాయించిందన్నారు. మహిళా కార్మికులకు ప్రసూతి సెలవులను 12 నుంచి 20 వారాల వరకు పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. బడుగు, బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని మోదీ ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. సుకన్య సమృద్ధి యోజన, బేటీ బచావో.. బేటీ పడావో.. ప్రధానమంత్రి ముద్ర యోజన వంటి పథకాలతో పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో చెర్ల అంకిరెడ్డిపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. యూపీఏ కుట్రవల్లే భద్రాచలం ముంపు ఏపీ విభజనను యూపీఏ ప్రభుత్వం చేపట్టగా టీఆర్ఎస్తోపాటు బీజేపీ కూడా మద్దతు తెలపడంతో తెలంగాణ ఏర్పడిం దని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం మెదక్ జిల్లా గజ్వేల్ మం డలం ప్రజ్ఞాఫూర్‌లో ఆయన మాట్లాడుతూ.. భద్రాచలం వద్ద కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యేలా అప్పటి యూపీఏ ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. ఏ వివాదానికైనా చర్చలతో పరిష్కారం దొరుకుతుందన్నారు. -
ఎవరెస్ట్ శిఖరం ‘కాకా’
♦ సీఎం కేసీఆర్ కితాబు ♦ ట్యాంక్‌బండ్‌పై వెంకటస్వామి విగ్రహావిష్కరణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కోసం అవిశ్రాంతంగా పోరాడిన గొప్ప వ్యక్తి జి.వెంకటస్వామి అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొనియాడారు. కాంగ్రెస్ దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి జయంతి సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పిన ఆయన విగ్రహాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ నుంచి దళిత నేతగా వెంకటస్వామి ఎవరెస్ట్ శిఖరమంత ఎదిగారని కీర్తించారు. ఆయన సుదీర్ఘ రాజకీయ చరిత్ర, అపార అనుభవం, రాజీలేని పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శమన్నారు. 91 ఏళ్ల వయసులో అనారోగ్యానికి గురైన కాకాను ఆసుపత్రిలో పరామర్శించేందుకు తాను వెళ్లినప్పుడు ‘‘ఎట్లన్నా తెలంగాణ చూసి పోవాలనేది నా చివరి కోరిక’’ అని అన్నారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. బతికున్నంత కాలం తెలంగాణ కోసం తపనపడి... ఆపై రాష్ట్ర ఏర్పాటును కళ్లారా చూసిన ధన్యజీవి ఆయన అన్నారు. ఇదే సందర్భంగా మేరా సఫర్ పేరిట వెంకటస్వామి జీవిత చరిత్ర పుస్తకాన్ని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు. తొలి పుస్తక ప్రతిని సీఎం కేసీఆర్‌కు అందించారు. వెంకటస్వామి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని దత్తాత్రేయ సూచించారు. చిన్నస్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన నాయకుడు వెంకటస్వామి టఅని, కార్మికులు, పేదల కోసమే ఆయన నిరంతరం పోరాడారన్నారు. ఆయ న స్ఫూర్తితోనే దేశవ్యాప్తంగా అసంఘటిత రంగ కార్మికులకు ‘స్మార్ట్ కార్డులు’ అందించే కార్యక్రమం చేపట్టామన్నారు. వెంకటస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణ జాతి తనను తాను గౌరవించుకోవడమేనని స్పీకర్ మధుసూదనచారి పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు నాయిని నరసింహారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ కేకేలు పాల్గొన్నారు. పెద్దపల్లిలో విగ్రహాల ఏర్పాటుకు అనుమతివ్వండి: వినోద్ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని వీలైనంత తొందరగా పునరుద్ధరించాలని మాజీ మంత్రి, వెంకటస్వామి కుమారుడు జి.వినోద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తన తండ్రి అందించిన సేవలను గుర్తించి ట్యాంక్‌బండ్‌పై విగ్రహం ఏర్పాటు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలోనూ కాకా విగ్రహాల ఏర్పాటుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘మేరా సఫర్’ ఆంగ్ల పుస్తకాష్కరణకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంగీకరించినట్లు కాకా మరో కుమారుడు, మాజీ ఎంపీ వివేక్ చెప్పారు. 1972లో కేంద్ర కేబినేట్లో ప్రణబ్, తన తండ్రి మంత్రులుగా పని చేశారని... అప్పట్నుంచీ ఉన్న అనుబంధంతోనే పుస్తకావిష్కరణకు రాష్ట్రపతి అంగీకరించారన్నారు. -
టీడీపీతో కలసి రైతు యాత్రలా?
బీజేపీ పదాధికారుల సమావేశంలో నేతల ప్రశ్న సాక్షి, హైదరాబాద్: రైతు సమస్యల పరిష్కారం కోసం టీడీపీతో కలసి యాత్ర ఎం దుకు చేయాలని, పార్టీ శ్రేణులతోనే చేయలేమా అని బీజేపీ పదాధికారుల సమావేశంలో పలువురు నేతలు ప్రశ్నించారు. బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో పదాధికారుల సమావేశం సోమవారం జరిగింది. కేంద్రమంత్రి దత్తాత్రేయ, పార్టీ నేతలు కె.లక్ష్మణ్, వి.రామారావు, ఇంద్రసేనారెడ్డితో పాటు ప్రధానకార్యదర్శులు, ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. టీడీపీ చేపడుతున్న యాత్రల్లో బీజేపీ భాగస్వామ్యం కావాలని ముందుగా ప్రతిపాదించారు. ఎన్నికల్లో పొత్తు ఉంటే ఎన్నికల్లోనే చూసుకుందాం, అప్పటిదాకా పార్టీ విడిగానే కార్యక్రమాలు చేపట్టాలని పలువురు వాదించారు. టీడీపీతో కలసి యాత్రలు చేపడితే పార్టీ విస్తరణ, బలోపేతం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, రుణమాఫీ సాధించుకోవాలంటే అన్ని ప్రతిపక్ష పార్టీలతో కలసి పనిచేయడమే మంచిదని సీనియర్లు చెప్పారు. -
రూ.400 కోట్లతో ఉపాధి కల్పన కార్యాలయాల ఆధునీకరణ
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధి కల్పన కార్యాలయాలను ఆధునీకరించేందుకు మొదటి దశగా రూ.400 కోట్ల ఖర్చు చేయనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. దిల్కుషా అతిథి గృహంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 20న ఢిల్లీలో 3 రోజుల పాటు జాతీయ కార్మిక సదస్సును నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారని చెప్పారు. కనీస వేతనాలను కనీసం రూ.15 వేల వరకైనా పెంచాలని జాతీయ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు. అయితే కేంద్రం నిర్ణయం తీసుకున్నా, రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేయాలని పేర్కొన్నారు. కార్మికుల శ్రేయస్సే లక్ష్యంగా పని చేస్తున్నామని అందులో భాగంగానే ఈఎస్ఐలో మెరుగైన సేవలు అందించడంతో పాటు త్వరలోనే 8వేల ఉద్యోగాలకు నియామకాలు చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమల భాగస్వామ్యంతో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 5 లక్షల కార్మిక కుటుంబాలు ఈ సేవలను ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. -
పాత కార్మిక చట్టాలను ప్రక్షాళన చేస్తాం
కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సాక్షి, విజయవాడ : పాత కార్మిక చట్టాలను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, పది మంది కార్మికులు పని చేసే సంస్థనూ ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకువచ్చేలా కొత్త చట్టాలు చేస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం గుణదలలో కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్ఐ) ఉప ప్రాంతీయ కార్యాలయం నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర కార్మిక శాఖ పరిధిలో 59 కోట్ల మంది ఉన్నారని, వారి కుటుంబసభ్యుల సంక్షేమం, ఆరోగ్యం, సాం ఘిక భద్రత కల్పించేందుకు కార్మిక శాఖ ప్రయత్నిస్తోందన్నారు. ఉప ప్రాంతీయ కార్యాలయం పరిధిలో 9.68 లక్షల మంది కార్మిక కుటుం బాలు ఆధారపడి ఉన్నాయని, కృష్ణా, గుంటూ రు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాలు ఈ కార్యాలయ పరిధిలోకి వస్తాయని ఆయన వివరించారు. ఈ-బిజ్ విధానం ద్వారా కార్మికుల వివరాలను సమోదు పక్రియ చేపడతామన్నారు. దీని ద్వారా కార్మికుడు ఎక్కడ పని చేసి నా అతను పని చేసిన కాలానికి సంబంధించి ఈపీఎఫ్ తదితర మొత్తాలు వెంటనే తీసుకునే వీలుంటుందని తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు మాట్లాడుతూ కొద్ది కాలంలోనే దేశంలో అభివృద్ధి రేటు 7.3 శాతానికి పెరిగిందని, దేశం ఇదే తరహాలో అభివృద్ధి చెందితే చైనాను అధిగమించే అవకాశం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో ఈఎస్ఐ డెరైక్టర్ జనరల్ ఎ.కె.అగర్వల్ మాట్లాడుతూ ఈఎస్ఐ హస్పటల్లో లేని వైద్య సేవలను కార్పొరేట్ హస్పటల్ ద్వారా అందజేస్తున్నామని అన్నారు. కార్మికులు ఈఎస్ఐపై అవగాహన పెంచుకుని మెరుగైన వైద్య సేవలు పొదాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ గద్దె అనూరాధ మాట్లాడుతూ కార్మికులు ఈఎస్ఐ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలుపొందటం తమ హక్కుగా భావించాలన్నారు. సీఐటీయూ నేతల విన్నపం ఈఎస్ఐ హాస్పటల్లో కనీస సౌకర్యాలు లేవం టూ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు ఆధ్వర్యం లో పలువురు సీఐటీయూ నేతలు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు. హాస్పటల్లోఎంఆర్ఐ, సీటీ స్కాన్, అల్ట్రాస్కాన్ పరీక్షలు చేసే యంత్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి వార్డుల్లో తనిఖీలు మంత్రి దత్తాత్రేయ ఈఎస్ఐ హాస్పటల్లోని వార్డుల్లో పర్యటించి రోగులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. క్యాంటిన్ సౌకర్యం లేదని ఒక మహిళా రోగి మంత్రి దృష్టికి తీసుకువచ్చింది. హాస్పటల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని పలువురు రోగులు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీలు కె.లక్ష్మణరావు, బొడ్డు నాగేశ్వరరావు, కార్పొరేటర్ అపర్ణ, ఈఎస్ఐ రీజినల్ డెరైక్టర్ చిన్మయబోస్, డెప్యూటీ డెరైక్టర్ ఎస్.కృష్ణమూర్తి, బీజేపీ నాయకులు యూవీ శ్రీనివాసరాజు, లాకా వెంగళరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
మాది అవినీతి రహిత పాలన
వచ్చే నాలుగేళ్లు కూడా నిజాయతీగా ఉంటాం కార్మికులను ఆదుకుంటాం కేంద్ర మంత్రి దత్తాత్రేయ సంగారెడ్డి టౌన్ : నరేంద్ర మోదీ నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం అవినీతి రహిత పాల నను అందించిందని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. వచ్చే నాలుగేళ్లు కూడా నిజాయతీగా పరిపాలిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలో ‘సంపర్క్ అభియాన్’ వారోత్సవాలను మంత్రి దత్తాత్రేయ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయకు తమ సంపూర్ణ మద్దతు ఉం టుందన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి తమ ప్రభుత్వం చేయూతనందిస్తుందని చెప్పారు. దేశంలో 48 కోట్ల మంది కార్మికులున్నారని, ప్రతి కార్మికుడికి న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని చెప్పారు. అందుకోసం వారికి ప్రత్యేక నంబర్ ఇచ్చామని దాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. సంగారెడ్డిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి కేంద్రం ద్వారా సహాయం చేస్తామన్నారు. నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీమా పథకాలు, పింఛన్ పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను పేదలు ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నాయకులు నరేందర్‌రెడ్డి, అమర్‌సింగ్, జగన్ పాల్గొన్నారు. -
అపూర్వ ఘట్టాలు యాగాలు
మంత్రులు, {పజాప్రతినిధుల వ్యాఖ్య {పముఖులకు స్వామీజీ ఆశీర్వచనాలు పీఠాధిపతులతో కళకళలాడిన మహాలక్ష్మీ యాగశాల నేడు లక్ష్మీ ఆవిర్భావం, కల్యాణోత్సవాలతో ముగియనున్న యాగం తిరుపతి గాంధీరోడ్డు : తిరుపతిలో నిర్వహిస్తున్న మహా లక్ష్మీయాగం లాంటివి దేశ చరిత్రలో అపూర్వ ఘట్టాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అభివర్ణించారు. బాష్యం కార్లు మఠం పీఠాధిపతి అనంత శ్రీవిభూషిత శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి నిర్వహిస్తున్న 16వ మహాలక్ష్మీయాగానికి గురువారం కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి మాణిక్యాలరావు దంపతులు హాజరయ్యారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గల్లా అరుణకుమారి తదితరులు పాల్గొని మహాలక్ష్మీ అమ్మవారికి పూజలు చేయించారు. దత్తాత్రేయను రామచంద్ర రామానుజ జీయర్ స్వామీజీ సత్కరించారు. మంత్రి మాట్లాడుతూ యజ్ఞాలతో వాతావరణంలో మార్పులు వచ్చి సమాజానికి అనుకూలంగా ఉంటాయని అన్నారు. లోకకల్యాణం కోసం జీవితాలను త్యాగం చేసిన త్యాగమూర్తులు స్వామీలు అని పేర్కొన్నారు. యాగంలో పాల్గొని సమాజంలో పవిత్రతను కాపాడుకోవలని సూచించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో వర్షాలు బాగా కురిసి శుభం కలగాలని ఆకాంక్షించారు. స్వామీజీల సందేశాలను పాటించాలని కోరారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అతివృష్టి, అనావృష్టి లేకుండా పర్యావరణ సమతుల్యత కలిగి ఉండాలని ఆకాంక్షించారు. దేశ సౌభాగ్యం కోసం జీయర్ స్వామి నిర్వహిస్తున్న ఈయాగం ద్వారా మంచి ఫలితాలు వస్తాయన్నారు. యాగం ఏర్పాటు చేసిన స్వామీజీకి కృతజ్ఞతలు తెలియజేశారు. జియ్యర్‌స్వామి మాట్లాడుతూ లోకకల్యాణం కోసం ఏ కార్యక్రమం చేపట్టినా భగవంతుడు హర్షిస్తాడని తెలిపారు. యాగం కోసం సంవత్సరమంతా భిక్ష చేసి, తల్లి సంతానమైన ప్రజలందరినీ భాగస్వాములను చేశామని అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు యాగానికి వచ్చిన మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చదలవాడ దంపతులు, టీటీడీ మాజీ కార్యనిర్వహణాధికారి పీవీఆర్కే.ప్రసాద్, బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి, టీడీపీ జిల్లా వైద్య విభాగం అధ్యక్షురాలు రాళ్లపల్లి సుధారాణి, బీజేపీ నాయకుడు కోలా ఆనంద్, కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, అహోబిలం మ ఠం రామనుజజీయర్, అష్టాక్షరి రామానుజ జీయర్, దేవరాజరామానుజ జీయర్, చిన్న జీయర్ తల్లి అండాళమ్మ పాల్గొన్నారు. గురువారం ఉదయం యథావిధిగా గోవిందపెరుమాళ్, లక్ష్మీ అమ్మవార్లకు శాత్తుమురై, అమ్మవారి హవనం కార్యక్రమాలతో పాటు వేదపారాయణ ఉచ్ఛారణ జరిగింది. ప్రవచనం, కోటికుంకుమ, కోటిమల్లెల, కోటి తులసి అర్చనలు జరిగాయి. కోటికుంకుమ అర్చనలు గురువారంతో ముగిశాయి. నేడు 1008 కేజీల ముత్యాలతో కల్యాణ మహోత్సవం యాగంలో ఆఖరు రోజైన శుక్రవారం మహాలక్ష్మీ అమ్మవారి ఆవిర్భావం, కల్యాణోత్సవాలు జరుగుతాయని యా గం కన్వీనరు కల్యాణ చక్రవర్తిస్వామి తెలిపారు. ఉదయం ఆరు గంటలకు సంకీర్తన, ఏడు గంటలకు క్షీరార్ణవ మండప సందర్శన ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో 108 వెండి గంగాళాలతో గోవింద పెరుమాళ్లుకు పాయసం నివేదన ఉంటుందని తెలిపారు. సా యంత్రం వైభవంగా కల్యాణ మహోత్స వం జరుగుతుందని పేర్కొన్నారు. -
అండగా నేనుంటా
బీడీ కార్మికులకు కేంద్ర మంత్రి దత్తన్న భరోసా అవసరమైతే మహిళా కార్మికులను ఢిల్లీకి తీసుకెళతా సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తానని వెల్లడి సిద్దిపేట అర్బన్ : పొగాకు ఉత్పత్తులపై అప్పటి కేంద్ర ప్రభుత్వం 2005లోనే కఠిన నిర్ణయాలు తీసుకుందని, కఠినమైన నిబంధనలపై పోరాడి ఎన్నింటినో తొలగింపజేశానని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. మంగళవారం పట్టణంలో ని శివమ్స్ గార్డెన్లో బీఎంఎస్, తెలంగాణ ప్రదేశ్ బీడీ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులు చెప్పిన పలు సమస్యలను విన్నారు. చేతినిండా పని కల్పించాలని, డేంజర్ మార్క్ గుర్తును తొలగింపజేయాలని, పీఎఫ్ కల్పించాలని, రూ. వెయ్యి పింఛన్ ఇవ్వాలని వారు కోరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బీడీ కట్టలపై 85 శాతం ప్రమాద హెచ్చరిక గుర్తును ముద్రించాలని విడుదల చేసిన జీఓ 727 (ఈ)ని అమలు చేయడంలో ఈ నెల 18, 19న ఆరోగ్య శాఖ మంత్రి, అధికారులతో సమావేశం ఉందన్నారు. అందులో ఈ జీఓపై కఠిన నిర్ణయాలపై చర్చిస్తానని బీడీ కార్మికులకు తగిన న్యాయం జరి గేలా చూస్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే మహిళా కార్మికులను ఢిల్లీకి తీసుకెళ్లి మంత్రితో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. చేతితో చేసే ఈ పరిశ్రమను ఆదుకునేందుకు కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలో 17 లక్షల కుటుంబాలు ఈ బీడీ పరిశ్రమపై ఆధారపడి పనిచేస్తున్నారని వారికి తన అండదండలు తప్పక ఉంటాయని స్పష్టం చేశారు. బీడీ కార్మికులకు యూవిన్ స్మార్ట్ కార్డులను కేంద్ర ప్రభుత్వం త్వరలో అందజేస్తుందని వీటి ద్వారా పీఎఫ్ సమాచారం నేరుగా కార్మికుల సెల్‌కు అందుతుందని పేర్కొన్నారు. ఈ కార్డు రాష్ట్రీయ స్వస్త్బీమా, ఆమ్ ఆద్మీ బీమా, పింఛన్లకు కూడా వర్తిస్తుందన్నారు. బీడీ కార్మికులందరికి ఇండ్ల స్థలాలను కొనుగోలు చేసి ఇంటి నిర్మాణాలను చేపడుతామని చెప్పారు. గతంలో ఇంటి నిర్మాణానికి రూ. 40 వేలు మాత్రమే ఇచ్చేవారని రూ. లక్ష ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. అదే విధంగా వారికి ఆస్పత్రులను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్దిపేటలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బీడీ కార్మికులు, కమిషన్ ఏజెంట్లు, అంగన్వాడీ వర్కర్లు, మోటార్ వర్కర్స్, ఆర్చ్ ఫార్మా ఉద్యోగులు మంత్రికి తమ సమస్యలను తెలియజేస్తూ వినతి పత్రాలను అందజేసి సన్మానించారు. మంత్రి వారి సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి, బీఎంఎస్, తెలంగాణ ప్రదేశ్ బీడీ కార్మిక సంఘం, బీజేపీ, బీజేవైఎం నాయకులు కలాల్ శ్రీనివాస్, గంగాడి మోహన్‌రెడ్డి, అమర్‌సింగ్, అంజిరెడ్డి, వంగ రాంచంద్రారెడ్డి, సొప్పదండి విద్యాసాగర్, రాఘవులు, సుధీర్‌కుమార్, శివయ్య, మల్లేషం, కిష్టయ్య, రాజిరెడ్డి, ఉమేష్‌గౌడ్, కిషన్, రాజు, దత్తు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
హైకోర్టును త్వరగా విభజించండి: ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్: కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి బండారు దత్తాత్రేయతో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. గోదావరి పుష్కరాలకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీలను ఆహ్వానించాలని దత్తాత్రేయను కోరినట్టు ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. గోదావరి పుష్కరాలకు రూ.900 కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరామని ఇంద్రకరణ్ చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో బీడీ కార్మికులకు ఈఎస్ఐ ఆసుపత్రి, హైకోర్టును త్వరగా విభజించాలని కేంద్ర మంత్రి దత్తత్రేయను కోరామని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. -
మార్చి 15 నుంచి స్మార్ట్ కార్డుల జారీ
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడి సాక్షి, ముంబై: అసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందించడం కోసం ప్రత్యేకంగా రూపొందిస్తోన్న ‘స్మార్ట్ కార్డు’లను మార్చి 15 నుంచి జారీచేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. బాంద్రాలోని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) కార్యాలయంలో దేశంలోనే మొట్టమొదటి ‘స్పెషల్ కార్పొరేట్ ఆఫీస్’ను గురువారం ఆయన ప్రారంభించారు. బడా కంపెనీల్లో భారీ సంఖ్యలో ఉన్న ఉద్యోగులు, కార్మికులకు శ్రేష్టమైన, సత్వర సేవలను అందించేందుకు ఈ కార్యాలయం దోహదపడనుంది. బాంద్రాలోని ఈ కార్యాలయం పరిధిలోకి 16 కంపెనీలను చేర్చారు. ఆయా కంపెనీల ఉద్యోగుల పీఎఫ్ క్లెయిమ్స్‌ను ఈ కార్యాలయం చేపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమం అనంతరం బండారు దత్తాత్రేయ ‘సాక్షి’తో మాట్లాడారు. దేశవ్యాప్తంగా కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగానే సంఘటిత కార్మికుల కోసం ‘యూనివర్సల్ అకౌంట్ నెంబరు’ (యూఎఎన్)ను ప్రారంభించినట్టు చెప్పారు. దీంతోపాటు అసంఘటితక కార్మికుల సంక్షేమం కోసం ‘యునివర్సల్ వర్కర్ ఐడెంటిఫికేషన్ నెంబరు’ (యూవీఐఎన్) పేరుతో పిలిచే స్మార్టుకార్డులను రూపొందిస్తున్నట్టు చెప్పారు. వీటిని మార్చి 15 నుంచి జారీ చేయాలన్న యోచనలో తమ ప్రభుత్వం ఉన్నట్టు తెలిపారు. ఈ కార్డులు జారీ చేసిన అనంతరం కేంద్ర కార్మిక శాఖలోని రూ. 27 వేల కోట్ల నిధులను అన్ని రంగాల కార్మికులకు అందించేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. నైపుణ్యం పెంపుదలకు ప్రత్యేక శ్రద్ద... అసంఘటిత రంగంలో నైపుణ్యంలేని కార్మికుల సంఖ్య అధికంగా ఉందని బండారు దత్తాత్రేయ తెలిపారు. వారిలోని నైపుణ్యాన్ని వెలికితీయడంతో పాటు నైపుణ్యం కలిగిన (స్కిల్డ్ వర్కర్లు) కార్మికుల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. దేశవ్యాప్తంగా భవననిర్మాణ రంగంలో సుమారు 4.70 కోట్ల మంది కార్మికులుండగా వీరిలో కేవలం ఏడు శాతం మంది మాత్రమే స్కిల్డ్ (నైపుణ్యం) కార్మికులున్నారు. వీరికి శిక్షణనిచ్చి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. నైపుణ్యం పెంపుదల విషయంలో చైనా రెండు కోట్ల మందికి శిక్షణ ఇస్తుండగా, జపాన్ కోటి మందికి శిక్షణనిస్తోందని చెప్పారు. మనదేశంలో గతంలో కేవలం 2.80 లక్షల మందికి శిక్షణ ఇవ్వగా తమ ప్రభుత్వ హయాంలో ఈ సంఖ్య పది లక్షలకు చేరిందన్నారు. రాబోయే రోజుల్లో జపాన్‌తో సమానంగా కోటి మందికి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. శిక్షణ పొందే సమయంలో అసంఘటిత కార్మికులకు ప్రతి గంటకు రూ. 35 చొప్పున చెల్లిస్తామని చెప్పారు. వృత్తి విద్యా కోర్సులు 165 ఉన్నాయని, వీటిలో శిక్షణ పొందేవారికి 50 శాతం ప్రభుత్వం, మిగిలిన సగాన్ని శిక్షణనిచ్చే సంస్థ ద్వారా అందించేందుకు కృషి చేస్తామని దత్తాత్రేయ చెప్పారు. నైపుణ్యం సంపాదించిన వారికి నెలసరి వేతనం రూ. 15 నుంచి రూ. 18 వేల వరకు వస్తోందని, బీటేక్ చేసిన వారికి కూడా ఇంతే వేతనం వస్తోందని చెప్పారు.