హైకోర్టును త్వరగా విభజించండి: ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్: కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి బండారు దత్తాత్రేయతో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. గోదావరి పుష్కరాలకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీలను ఆహ్వానించాలని దత్తాత్రేయను కోరినట్టు ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. గోదావరి పుష్కరాలకు రూ.900 కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరామని ఇంద్రకరణ్ చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో బీడీ కార్మికులకు ఈఎస్ఐ ఆసుపత్రి, హైకోర్టును త్వరగా విభజించాలని కేంద్ర మంత్రి దత్తత్రేయను కోరామని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.