పాలమూరు, న్యూస్‌లైన్: పంచాయతీ కా ర్యదర్శి పోస్టుల కో సం జిల్లాలో జోరుగా పైరవీలు కొనసాగుతున్నాయి. ఖాళీగా ఉ న్న 169 పోస్టులకు 16,500 దరఖాస్తులు రావడంతో ఉద్యోగంపై అభ్యర్థుల్లో తీవ్రఉత్కంఠ నెలకొంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు పైరవీకార్లు పంచాయతీ కార్యదర్శి పోస్టులను ఇప్పిస్తామని.. ఇం దుకోసం రూ.ఐదు లక్షల వరకు ఖర్చవుతుందని నిరుద్యోగులకు గాలం వేస్తున్నా రు.
అధికారపార్టీతోపాటు, ఇతర పార్టీల కు చెందిన ప్రజాప్రతినిధుల పేర్లు చెబు తూ వారి అండతో మీకు కచ్చితంగా ఉ ద్యోగం ఇప్పిస్తామని చెబుతూ డబ్బులు దండుకునే ప్రయత్నాలు మొదలుపెట్టా రు. అయితే పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థు ల డిగ్రీ మార్కుల ఆధారంగా మెరిట్ జా బితాను సిద్ధం చేయాల్సి ఉంది. సంబంధిత అధికారులు ఆ జాబితాను తయారుచేసే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పైరవీకారులు రంగంలోకి దిగారు. కొం తమంది అభ్యర్థులు ఎంతైనా ఇచ్చేం దుకు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోం ది. పోస్టులకు కొత్తగా దరఖాస్తు చేసుకు న్న వారే కాకుండా కాంట్రాక్టు కార్యదర్శు లు కూడా ఈ పైరవీకారులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో పనిచేసే కాంట్రాక్టు కార్యదర్శులకు ప్రభుత్వం 25 శాతం వెయిటేజీ మార్కులు కల్పించింది.
మొత్తం 169 పో స్టుల్లో సగం పోస్టులు కాంట్రాక్టు కార్యదర్శులకే వర్తిస్తాయని అంచనాలు ఉన్నప్పటికీ ఒకవేళ రాకపోతే ఏమిటని కొందరు ముడుపులు చెల్లించేం దుకు సిద్ధమవుతున్నారు. కాగా, పంచాయతీ కార్యదర్శుల పోస్టులను నిబంధన ల ప్రకారమే భర్తీ చేస్తామని, అభ్యర్థుల్లో డిగ్రీ మార్కులు ఎక్కువగా ఉన్న వారికే ఉద్యోగాలు లభిస్తాయని అధికారులు చె బుతున్నారు. దరఖాస్తుదారులెవరూ పై రవీకారులను ఆశ్రయించొద్దని, దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులందరి మార్కు ల వివరాలను నోటీస్ బోర్డుపై ప్రదర్శిస్తామని వారు పేర్కొన్నారు.
దరఖాస్తుల సంఖ్యపై గోప్యత
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ : పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి దరఖాస్తు లు 13 వేలపైగా వచ్చాయని అధికారులు మొదట చెప్పారు. 20రోజుల పాటు గో ప్యంగా ఉంచిన అధికారులు తీరా దరఖాస్తులు 16,500 వచ్చాయని బయటికి చె ప్పడంతో దరఖాస్తుదారుల్లో మరింత ఆందోళన మొదలైంది. మెరిట్ ప్రకారం కాకుండా లిఖితపూర్వ పరీక్ష విధానం లేదా ఇంటర్వ్యూల మాదిరిగా నో అభ్యర్థులను స్వయంగా పిలిచి ఉద్యోగాలు భర్తీచేస్తే బాగుంటుందని దరఖాస్తుదారులు మొదటినుంచి అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.
ఈ నేపథ్యంలో అధికారులు దరఖాస్తుల సంఖ్యను మొదట గోప్యంగా ఉంచి తీరా ఆలస్యంగా అసలు సంఖ్యను వెల్లడించడంతో ఏం జరుగుతుందోనని అభ్యర్థుల్లో తీవ్ర కలవరం మొదలైంది. మొదట్లో ఈ ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేస్తామని పేర్కొన్న అధికారులు తాజాగా వాటి విషయంపై వివిధ రకాల అనుమానాలు చెలరేగడంతో నిరుద్యోగుల ఆశలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయి. దీనిపై అధికారుల్లో కూడా ఆందోళన చెలరేగడం విశేషం.
తప్పుడు ధ్రువపత్రాలతో
దరఖాస్తులు
కార్యదర్శుల పోస్టులకు దరఖాస్తులు ఇబ్బడిముబ్బడిగా రావడంతో అధికారులు వాటిని చూసీచూడనట్లుగా స్వీకరించారు. హడావుడిగా స్వీకరించిన దరఖాస్తులను కంప్యూటరీకరణలో కూడా అభ్యర్థుల మార్కులను నమోదు చేస్తున్నారు. దీంతో చాలామంది నకిలీ ధ్రువీకరణ పత్రాలతో పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. దీనిపై అధికారులు ప్రత్యేకదృష్టి సారించి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దళారుల మాటలు నమ్మొద్దు: డీపీఓ
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దళారులు ఎవరైనా చెబితే అభ్యర్థులు వారి మాటలు నమ్మొద్దని జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) రవీందర్ సూచించారు. అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రచారం జరుగుతుందని, అటువంటి పరిస్థితులేవీ ఉండవని, పారదర్శకంగా నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. గ్రామ కార్యదర్శి పోస్టులను నిబంధనల ప్రకారం భర్తీ చేస్తామని, అభ్యర్థుల్లో డిగ్రీ మార్కులు ఎక్కువగా ఉన్న వారికే ఉద్యోగాలు లభిస్తాయని ఆయన వివరించారు. దరఖాస్తులు చేసుకున్న అందరి అభ్యర్థుల మార్కుల వివరాలను నోటీస్ బోర్డుపై ప్రదర్శిస్తామని. పైరవీకార్లను ఆశ్రయిస్తే నష్టపోవాల్సి వస్తుందన్నారు.
-రవీందర్,
జిల్లా పంచాయతీ అధికారి
అమ్మకానికి కార్యదర్శి పోస్టులు?
Published Sat, Nov 23 2013 4:17 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM
Advertisement
Advertisement