స్వతంత్ర అభ్యర్థి కిడ్నాప్ చేసిన టీడీపీ వర్గీయులు | Independent MLA candidate kidnaped in kovvur assembly constituency | Sakshi
Sakshi News home page

స్వతంత్ర అభ్యర్థి కిడ్నాప్ చేసిన టీడీపీ వర్గీయులు

Published Tue, Apr 29 2014 3:03 PM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

Independent MLA candidate kidnaped in kovvur assembly constituency

నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డిని టీడీపీ వర్గీయులు మంగళవారం కిడ్నాప్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టిడిపి అభ్యర్థి పేరు కూడా పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కావడంతో సమస్య వచ్చిపడింది.  దాంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని  నామినేషన్ ఉపసంహరణ గడువుకు ముందే టిడిపి వారు కోరారు. 

 

నామినేషన్ వెనక్కి తీసుకోవాలని  టీడీపీ వర్గీయులు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని హెచ్చరించారు. అయినా ఫలితంలేదు.  దాంతో అతడిని సముదాయించేందుకు టీడీపీ వర్గీయులు ముమ్మర చర్యలు చేపట్టారు. అయినా తాను పోటీలో ఉంటాననని కరాకండిగా వారికి చెప్పాడు. టీడీపీ వర్గీయులు ఇక లాభం లేదని అతనిని కిడ్నాప్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement