సాక్షి, హైదరాబాద్: జెన్‌కో మేనేజింగ్ డెరైక్టర్(ఎండీ) కె.విజయానంద్‌కు ‘ఇండియన్ పవర్’ అవార్డు లభించింది. రాష్ట్ర ప్రభుత్వ థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్వహణలో చూపిన ప్రతిభకుగాను ఆయన ‘2013 సంవత్సరానికి ఉత్తమ సీఈవో’గా ఎంపికయ్యారు. ‘ఇండియన్ పవర్’ అవార్డులను ఏటా కౌన్సిల్ ఆఫ్ పవర్ యుటిలిటీస్ సంస్థ ప్రకటిస్తుంది. ఇదిలా ఉండగా జెన్‌కో జేఎండీగా ఈ నెల 17 వరకూ సేవలందించిన డి.ప్రభాకర్‌రావుకు కూడా అవార్డు లభించింది.
ఈయనకు ‘ఫైనాన్స్ అండ్ రెవెన్యూ మేనేజ్‌మెంట్’ విభాగంలో అవార్డు లభించింది. నవంబర్ 22న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతులమీదుగా హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో వీరిద్దరూ అవార్డులను స్వీకరించనున్నారు.