విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: సర్కారు పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధనను అందించేందుకు రాజీవ్ విద్యామిషన్ వినూత్న ప్రయోగం చేస్తోంది. ఎంపిక చేసి న ప్రాథమిక పాఠశాలల్లో నూతన బోధానా పద్ధతులను శతశాతం అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా జిల్లాలోని 102 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా మార్చనున్నారు. మండల రిసోర్స్ గ్రూప్ (ఎంఆర్‌జీ)గా వ్యవహరించే ఉపాధ్యాయులు పనిచేస్తున్న పాఠశాలలను ముందుగా ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దుతారు. ఈ మేరకు రాజీవ్ విద్యామిషన్ రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ వి.ఉషారాణి నుంచి జిల్లా కేంద్రానికి ఉత్తర్వులు అందాయి. ప్రతి ఎం ఆర్‌జీ గ్రూప్‌లో ముగ్గురు సభ్యులుంటారు. అంటే జిల్లాలోని మొత్తం 34 మండలాల పరిధిలోని 102 మంది ఉపాధ్యాయులు అంకితభావంతో విధులు నిర్వహిస్తూ అధునాతన అంశాలతో.. కొత్త విధానాలతో గుణాత్మక విద్యను అందించాల్సి ఉంటుం ది. వీరంతా అకడమిక్ బృందంగా ఏర్పడి ఇత ర పాఠశాలల్లో కూడా బోధనా ప్రమాణాల ను మెరుగుపరచాల్సి ఉంటుంది.
విధివిధానాలు...
పాఠశాలపై విజన్ ఏర్పర్చుకుని అందుకు తగిన ప్రణాళిక రూపొందించుకుని (పాఠశా ల అభివృద్ధి ప్రణాళిక) అమలు చేయాలి. పాఠశాలకు అవ సరమైన వనరులను సమీకరించి అందరినీ భాగస్వాములను చేయాలి. విషయ స్వభావం, బోధనా లక్ష్యాలు, అభ్యాసనా ప్రక్రియలు, బోధనా వ్యూహాలు అనుసరించి పిల్లల సామర్థ్యాల సాధనకు అనుగుణంగా తరగతి గది ప్రక్రియ అమలు చేయాలి. వినూత్న కార్యక్రమాలను నిర్వహించాలి. పాఠశాలలకు సహకరించే వివిధ వ్యవస్థలతో అనుసంధానమై గుణాత్మక విద్యకు కృషి చేయాలి.
ఎంఆర్‌జీ సభ్యుల పాత్ర
ఎంఆర్‌జీ సభ్యులు తమ పాఠశాలలతోపాటు స్కూల్ కాంప్లెక్స్, మండల స్థాయిలో అన్ని పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా రూపొందించేందుకు కృషి చేయాలి. తోటి ఉపాధ్యాయులు, హెచ్‌ఎంల సహకారం తీసుకోవాలి. తమ సబ్జెక్టుల్లో 80 శాతానికిపైగా విద్యార్థులు ఏ+/ఏ స్థాయి సాధిం చేలా కృషి చేయాలి. విద్యార్థుల హాజరుపై కూడా దృష్టి పెట్టాలి. వివిధ సబ్జెక్టుల్లో విద్యార్థుల మధ్య ప్రగతి అంతరాన్ని తగ్గించాలి. సమీక్ష సమావేశాలు, సెమినార్ల ద్వారా ఇతర ఉపాధ్యాయులకు బోధనాంశాల పై వివరించాలి. విద్యార్థులకు ఆటలు, పాట లు, సృజనాత్మక కార్యక్రమాలు, వార్షికోత్సవా లు నిర్వహించాలి. క్షేత్ర పరిశీలన, ప్రాజెక్టులు, స్థానికంగా ఉండే వ్యక్తులు, వృత్తులు, సంస్థలను బోధనాభ్యాసంలో ఉపయోగిం చాలి. ఇంకా పలు అం శాలు ఎంఆర్‌జీ సభ్యులకు నిర్దేశించారు.
ఇక ఆదర్శ ప్రైమరీ స్కూళ్లు
Published Sat, Nov 2 2013 5:56 AM | Last Updated on Sat, Sep 2 2017 12:14 AM
Advertisement